EPAPER

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Urine Colour: తక్కువ నీరు తాగితే మూత్రం ముదురు పసుపు రంగులో కనిపిస్తుంది. ఎక్కువ నీళ్లు తాగితే తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. మూత్రం ఎంత తెల్లగా వస్తే అంత ఆరోగ్యంగా ఉన్నట్లు అని చాలా మంది భావిస్తారు. కొంత మంది అదే పనిగా నీళ్లు తాగుతుంటారు. మూత్రం కాస్త పసుపు రంగులోకి మారితే చాలా ప్రమాదం అన్నట్లు భావిస్తారు. అలాంటి వారికి తాజాగా పరిశోధకులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉన్నట్లు భావించాలన్నారు. ఎక్కువ తెల్లగా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు లండన్ పరిశోధకులు.


ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదా?

నీళ్లు తాగడం వల్ల శరీరరానికి ఎన్నో లాభాలున్నాయి. బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి అవయవాలు చక్కగా పని చేస్తాయి. అలాగని అదే పనిగా నీళ్లు తాగడం మంచిదికాదంటున్నారు నిపుణులు. శరీరంలో నీటి శాతం ఎక్కువైతే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ నీరు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని సోడియం లెవల్స్ తగ్గుతాయి. ఫలితంగా వాంతులు, తిమ్మిర్లు, అలసట ఏర్పడుతాయి. ఓవర్ హైడ్రేషన్ కారణంగా తలనొప్పి ఏర్పడుతుంది. అంతేకాదు, నీరు ఎక్కువగా తాగినప్పుడు శరీరంలో ఉప్పు తగ్గి అవయవాలు వాపుకు గురవుతాయి. శరీరంలో నీళ్లు ఎక్కువైతే ఎలక్ట్రోలైట్స్ తగ్గుతాయి. ఫలితంగా కండరాల తిమ్మిరి కలుగుతుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల మీద ఎక్కువ భారం పడుతుంది. హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లోపం ఏర్పడుతుంది. కాళ్లలో మంట, ఛాతి నొప్పి ఏర్పడుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, నీళ్లు ఎక్కువగా తాగితే శరీరం పోషకాలను తీసుకోలేదు. మూత్రం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు సైతం బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.   నీరు ఎక్కువగా తాగడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. మెదడు కణాల్లోకి నీరు చేరి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి మూర్చ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

రోజుకు ఎన్ని నీళ్లు తాగాలంటే?

రోజు 2 లీటర్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. లేదంటే, 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగలి. గర్భిణీలు, బాలింతలు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్లు కాస్త నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.

మూత్రం రంగు ఎలా ఉండాలి?

మూత్రం లేత పసుపు రంగులో ఉంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉన్నట్లు గుర్తు. ముదరు పసుపురంగులో ఉంటే డీహైడ్రేషన్ కు గురవుతున్నట్లు గుర్తించాలి. మూత్రం ఎప్పుడూ లేత పసుపురంగులో ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Read Also:వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Related News

Adulterants Food Items: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Pizza Sauce Recipe: ఇంట్లోనే పిజ్జా సాస్ ఇలా తయారు చేసుకుంటే.. బయట కొనే అవసరం ఉండదు

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Big Stories

×