EPAPER

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Moringa Powder: మునగ ఆకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ముగన ఆకులతో తయారు చేసిన పౌడర్ చాలా ప్రయోజనకరమైనది. దీని వినియోగం అనేక శారీరక సమస్యలు రాకుండా చేస్తుంది. మునగ కాయలే కాకుండా, దాని ఆకులతో పాటు పువ్వుల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మునగ కాయల పొడిని తయారు చేసుకొని తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.


బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకు పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు.. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మునగ పొడి తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మునగ పొడి యొక్క 6 అద్భుత ప్రయోజనాలు:


పోషకాల నిధి:

మునగ పొడిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, ఐరన్‌‌తో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

మునగ పొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది దగ్గు, జలుబుతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:
మునగ పొడి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం,అసిడిటీతో పాటు అజీర్ణం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
మునగ పౌడర్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన మీరు చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Also Read: ఎంతకీ దగ్గు తగ్గడం లేదా.. వీటితో వెంటనే ఉపశమనం

రక్తపోటును అదుపులో ఉంచుతుంది:
మునగ పొడిలో ఉండే పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

మునగకాయ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది తరుచుగా తినడం వల్ల కీళ్ల నొప్పులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది కీళ్ల వాపులో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

మునగ ఆకులో ఉండే పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. తరుచుగా మునగ ఆకు పౌడర్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Adulterants Food Items: పాల నుంచి పండ్ల వరకు.. కల్తీ జరిగిందో లేదో సింపుల్ గా ఇలా తెలుసుకోండి!

Pizza Sauce Recipe: ఇంట్లోనే పిజ్జా సాస్ ఇలా తయారు చేసుకుంటే.. బయట కొనే అవసరం ఉండదు

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Big Stories

×