EPAPER

Hyderabad Restaurants Raids: పాచిన పిండి, కుళ్లిన ఉల్లి.. ‘చట్నీస్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటల్స్ బంద్..

Hyderabad Restaurants Raids: పాచిన పిండి, కుళ్లిన ఉల్లి.. ‘చట్నీస్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటల్స్ బంద్..

Hyderabad Restaurants Raids: పేరుకు స్టార్ హోటల్స్.. వాటిని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తే కానీ, వాటి అసలు రంగు బయటపడడం లేదు. అన్నీ హోటల్స్ ఒకేలా ఉండవని అనుకున్నా, ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో బయటపడే అక్కడి స్థితిగతులు గమనిస్తే.. ఎంచక్కా ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా మేలే అనిపించక మానదు మనకు.


ప్రస్తుత కాలంలో ఎవరి లైఫ్ చూసినా బిజీబిజీ. టైం కి ఆహారం కూడా తయారు చేసుకోలేని బిజీ లైఫ్ కొందరిది. అందుకే హోటల్స్ బాట పడుతున్నారు కొందరు. ఇదే ఆసరాగా తీసుకున్న కొన్ని హోటల్స్ నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నాయి. ఇటువంటి వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీలతో కొందరు హోటల్స్, రెస్టారెంట్ యజమానులు బెంబేలెత్తి పోతున్నారు. మరికొందరు మాత్రం ఈ తనిఖీల వల్ల అంతా మేలు జరుగుతుందని తెలుపుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లోని కొండాపూర్ లో గల శరత్ సిటీ మాల్ లో గల చట్నీ టిఫిన్ సెంటర్ ను శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసినట్లు తమ ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే ఈ తనిఖీలో అక్కడ ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్ కనిపించేవిధంగా ప్రదర్శించబడలేదన్నారు. అలాగే ముడిసరుకు నిల్వ చేసే ప్రదేశంలో అధికారులకు బొద్దింకలు కనిపించగా అవాక్కయ్యారట. అంతేకాదు రవ్వ, పిండి పదార్థాలకు నల్ల పురుగులు ఉండగా అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఉల్లిపాయలు, క్యాబేజీ చూసిన అధికారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేసి, ఇటువంటి చర్యలు మరలా పునరావృతమైతే చర్యలు తప్పక తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడ చూసినా దుర్గంధం రావడంతో అధికారులు జరిమానా విధించినట్లు సమాచారం.

Also Read: Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

అలాగే అల్ఫార్ టిఫిన్ సెంటర్ లో కూడా తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అక్కడ కూడా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు గుర్తించి వారిని కూడా హెచ్చరించారు. ఇలా అధికారుల తనిఖీలు సాగుతున్నంత సేపు.. చుట్టు ప్రక్కల హోటల్స్ యజమానులు హోటళ్లను మూసివేయడం విశేషం. స్థానిక ప్రజలు మాత్రం తనిఖీలకు అదేశాలిచ్చిన ప్రభుత్వానికి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు అభినందనలు తెలిపారు.

ప్రతిరోజూ అధికారుల తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు పాటించని హోటల్స్, రెస్టారెంట్ లకు జరిమానాలతో సరిపెట్టకుండా.. సీజ్ చేయాలన్న అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న హోటల్స్ పై నిఘా ఉంచి, మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నిబంధనలు పాటిస్తున్న హోటల్స్, రెస్టారెంట్స్ లకు అవార్డులు కూడా ప్రకటిస్తే బాగుంటుందన్నది భోజన ప్రియుల అభిప్రాయం.

Related News

Minister Konda Sureka : యాదగిరిగుట్ట లడ్డూ సూపర్… భక్తులకు, ఆలయాలను మరింత చేరువ చేస్తామన్న మంత్రి సురేఖ

Lady Aghori: కారుపై పుర్రెబొమ్మలు.. డేంజర్ అంటూ సింబల్.. తీరా చూసి అందరూ షాక్.. ఎక్కడ జరిగిందంటే?

Adani group donation: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ.. తెలంగాణకు భారీ విరాళం.. కారణం ఇదే!

Konda Surekha Defamation Case : నాంపల్లి కోర్టుకు రాలేనన్న కేటీఆర్, ఈనెల 23కు కేసు వాయిదా వేసిన న్యాయస్థానం

KTR on TDP Congress:ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే.. బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ చేస్తున్నారు.. కేటీఆర్

Adulterated Milk Mafia: యాసిడ్ తో పాల తయారీ.. తాగారంటే ప్రాణాలు పోవాల్సిందే!

Big Stories

×