EPAPER

Rewind Movie Review : రివైండ్ మూవీ రివ్యూ

Rewind Movie Review : రివైండ్ మూవీ రివ్యూ

Rewind Movie Review :


సినిమా : రివైండ్
విడుదల తేదీ : 18 అక్టోబర్ 2024
నటీనటులు :సాయి రోనక్, అమృత, సురేశ్, తదితరులు
దర్శకత్వం: కల్యాణ్ చక్రవర్తి
సంగీతం: ఆశ్వీర్వాద్ ల్యూక్
సినిమాటోగ్రఫీ: శివరామ్ చక్రవర్తి
నిర్మాత:కల్యాణ్ చక్రవర్తి

Rewind Movie Rating : 0.5/5


సైన్స్ ఫిక్షన్ మూవీస్ కి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ఈ జోనర్లో సినిమాలు చేస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడి థియేటర్లకు వస్తారు. అంతే కాదు ఈ జోనర్లో రూపొందిన ‘ఆదిత్య 369’ వంటి సినిమాలు క్లాసిక్స్ గా కూడా నిలిచాయి. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తోనే ‘రివైండ్’ అనే సినిమా వచ్చింది. అక్టోబర్ 18 న చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘ప్రెజర్ కుక్కర్’ ‘అంటే సుందరానికీ’ ‘సర్కిల్’ వంటి సినిమాల్లో నటించిన సాయి రోనాక్ హీరో. మరి ఈ సినిమా అలరించిందో? లేక ఓ అనవసరపు ప్రయోగంగా మిగిలిపోయిందో..? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే కార్తిక్(సాయి రోనక్) కి.. అతని జాబ్ పై బోరింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అతనికి ఛాలెంజెస్ అంటే ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న బోరింగ్ లైఫ్ గడుపుతున్న కార్తీక్ కి శాంతి(అమృత) పరిచయమవుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు.అతను పనిచేస్తున్న ఆఫీస్లోనే ఆమె కూడా చేరుతుంది. సో వాళ్ళు ఎక్కువగా కలుసుకునేందుకు టైం లభిస్తుంది. ఈ క్రమంలో శాంతి ఒకరోజు కార్తీక్ కి తన తాత కృష్ణమూర్తి(సామ్రాట్) గురించి చెబుతుంది. అలాగే తాను 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్టు కూడా చెబుతాడు. దీంతో కార్తీక్ మనసు ముక్కలైనట్టు అవుతుంది. అలాంటి టైంలో అతనికి టైమ్ మిషన్ దొరుకుతుంది. దాంతో తెలీకుండానే అతను టైం ట్రావెల్ చేస్తాడు. కార్తీక్ కి టైం ట్రావెల్ మిషన్ ఎలా దొరికింది? అతను టైం ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్ళాడు. ఎవరెవరిని కలిశాడు? చివరికి శాంతిని దక్కించుకున్నాడా? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ ‘రివైండ్’ చిత్రం.

విశ్లేషణ :
‘రివైండ్’ చిత్రం చాలా సదా సీదాగా మొదలవుతుంది. హీరో, హీరోయిన్..ల మధ్య లవ్ ట్రాక్ కోసం దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి ఏంటేంటో సన్నివేశాలు రాసేశాడు. మెయిన్ ప్లాట్ కి వెళ్ళడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. అసలు టైం మిషన్ కథ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ప్రేక్షకుల సహనానికి చాలా పరీక్ష పెట్టాడు దర్శకుడు. అంతేకాకుండా చాలా కన్ఫ్యూజన్స్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇక సెకండాఫ్ ఫాస్ట్ గా సాగుతుంది అనుకుంటే.. అలాంటిదేమీ జరగదు. ఫస్ట్ హాఫ్ లో ఏవైతే కన్ఫ్యూజన్ అని ప్రేక్షకులు అనుకుంటారో.. వాటికి సెకండాఫ్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

అందువల్ల సేమ్ సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే టైం ట్రావెల్ చేసిన హీరో.. తన తండ్రితో గడిపిన క్షణాలను ఎమోషనల్ గా చూపించారు. కానీ ఇవి కొత్తగా ఏమీ అనిపించవు. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే. కానీ ఆ సినిమాలో ఎమోషన్ తో పాటు ఎక్సయిట్ చేసే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ‘రివైండ్’ లో అవి మిస్ అయ్యాయి. మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ.. దానిని ఆసక్తికరంగా నడపకపోతే ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా డిజప్పాయింట్ అవుతారు.

‘రివైండ్’ విషయంలో అదే జరిగింది. ఈ కాన్సెప్ట్ ను ఇంకా బాగా తీసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు.. దానిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు దర్శకుడు. టెక్నికల్ గా కూడా పెద్దగా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వీక్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా పేలవంగా అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సాయి రోనక్ నటన సో సో గానే ఉంటుంది. అమృత చౌదరి లుక్స్, నటన జస్ట్ ఓకే. సామ్రాట్ పాత్ర సినిమాకి చాలా కీలకం. కానీ దానిని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సీనియర్ హీరో సురేష్ మాత్రం..ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని లుక్స్ కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కాన్సెప్ట్
2 గంటల 15 నిమిషాలు మాత్రమే రన్ టైం ఉండటం

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ మొత్తం( ఎమోషనల్ సీక్వెన్స్ మినహాయించి)
మ్యూజిక్
పూర్ ప్రొడక్షన్ వాల్యూస్

మొత్తంగా.. ‘రివైండ్’ మంచి కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ఆసక్తికర కథనం లేకపోవడం వల్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

Rewind Movie Rating : 0.5/5

Related News

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Sharukh Khan: చివరి కోరిక బయటపెట్టిన షారుక్.. కంగారులో ఫ్యాన్స్..!

Suriya: హీరోయిన్ జ్యోతిక ఎన్ని రూ.వందల కోట్లకు అధిపతో తెలుసా..?

Big Stories

×