EPAPER

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Multani Mitti: ముల్తానీ మిట్టిని మన దేశంలో శతాబ్దాలుగా చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తున్నారు. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చేందుకు ముల్తానీ మిట్టిని ఉపయోగిస్తారు. ముల్తానీ మిట్టిని ముఖంపై తరుచుగా అప్లై చేస్తే, ఇది చర్మం యొక్క పాత గ్లోను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.


ముల్తానీ మిట్టి చర్మానికి సహజసిద్ధమైన ఔషధం. ఇది చర్మాన్ని లోతుల నుంచి శుభ్రం చేస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ముల్తానీ మిట్టిని ముఖానికి అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ముల్తానీ మిట్టిని ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముల్తానీ మిట్టిని 3 రకాలుగా ఉపయోగించండి:


1. ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:

కావలసినవి:
ముల్తానీ మిట్టి -2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ -1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ఒక గిన్నెలో పైన చెప్పిన మోతాదుల్లో ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్ వేసి కలపండి.ఆ తర్వాత దీనిని మందపాటి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా మొటిమలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

2. ముల్తానీ మిట్టి, పెరుగు ఫేస్ ప్యాక్:

కావలసినవి:
ముల్తానీ మిట్టి- 2 టేబుల్ స్పూన్లు
పెరుగు-1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ఒక గిన్నెలో ముల్తానీ మిట్టి తో పాటు పైన చెప్పిన మోతాదులో పెరుగు వేసి చిక్కగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేసి, ట్యానింగ్ తగ్గించి, చర్మం మెరుస్తుంది.

Also Read: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

3. ముల్తానీ మిట్టి, తేనె ఫేస్ ప్యాక్ :

కావలసినవి:
ముల్తానీ మిట్టి- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 1 స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదులో ముల్తానీ మిట్టి, తేనెలను ఒక గిన్నెలో వేసి చిక్కని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి పోషణనిస్తుంది. అంతే కాకుండా ఇది మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని కూడా మృదువుగా చేస్తుంది.

ముల్తాని మిట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా కాంతివంతంగా మారుస్తుంది. ముల్తాని మిట్టితో తయారు చేసిన హోం రెమెడీస్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అంతే కాకుండా చర్మంపై జిడ్డును కూడా తొలగిస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

Big Stories

×