EPAPER

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

 


IND VS NZ: బెంగళూరు టెస్ట్ లో (Bengulur Test)… న్యూజిలాండ్ జట్టు (New Zealand) పట్టు బిగిస్తోంది. రెండవ రోజు నుంచి ప్రారంభమైన మొదటి టెస్టులో.. బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్… విభాగాల్లో న్యూజిలాండ్ జట్టు అదరగొడుతోంది. ఈ తరుణంలోనే మొదటి ఇన్నింగ్స్ లో.. 402 పరుగులకు న్యూజిలాండ్ జట్టు ఆల్ అవుట్ అయింది. నిన్న మధ్యాహ్నం నుంచి బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ జట్టు….ఇవాళ మధ్యాహ్నం వరకు ఆల్ అవుట్…కావడం జరిగింది. ఈ తరుణంలోనే 356 పరుగుల అధిక్యాన్ని సంపాదించింది న్యూజిలాండ్.

New Zealand all out for 402 take 356 run 1st innings lead against India

న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (Rachin Ravindra)… దుమ్ము లేపాడు. ఏకంగా 134 పరుగులు చేసి… అదరగొట్టాడు. అటు న్యూజిలాండ్ ఓపెనర్ డే వాన్ కాన్వే (Devon Convey)… 91 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. టీం సౌథీ కూడా 65 పరుగులతో రాణించాడు. అలాగే విల్ యంగ్ 33 పరుగులు చేసి..జట్టును ఆదుకున్నాడు. ఇక టీమిండియా బౌలర్లలో… స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేయగలిగారు. నిన్నటి నుంచి ఫేస్ కు అనుకూలించిన బెంగుళూరు పిచ్… ఇవాల్టి నుంచి స్పిన్నర్లకు.. అనుకూలంగా మారింది.


Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

ఈ తరుణంలోనే టీమ్ ఇండియా (Team India ) ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( Jadeja) మూడు వికెట్లు పడగొట్టాడు. అటు కుల్దీప్ యాదవ్ ( kuldeep Yadav) కూడా 3 వికెట్లు పడగొట్టడం జరిగింది. మహమ్మద్ సిరాజుకు రెండు వికెట్లు పడ్డాయి. మరో స్పిన్నర్ అశ్విన్ కు ఒక వికెట్… స్పీడ్ స్టార్ బుమ్రా కు మరో వికెట్ పడింది. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ 402 పరుగులకు ఆల్ అవుట్ కావడం జరిగింది. ఇది ఇలా ఉండగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 పరుగులకు ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: Also Read: Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్… అత్యంత దారుణంగా ఆడటంతో…92 ఏళ్ల తర్వాత టీమిండియా… సొంత గడ్డపై తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ కావడం జరిగింది. విదేశాలలో ఇలా జరిగింది కానీ స్వదేశంలో ఇలా జరగడం టీమిండియా కు అవమానమే. ఇక రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా (Team India ) ఎలా ఆడుతుంది అనే దాని పైన…విజయ అవకాశాలు ఉంటాయి. మరో రెండున్నర రోజులు టెస్ట్ జరగనుంది కాబట్టి టీమిండియా ప్లేయర్లు జాగ్రత్తగా ఆడాలి. ఇది ఇలా ఉండగా… టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయం కారణంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో ధ్రువ్ జురేల్‌ ఆడుతున్నారు.  టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కోలుకోకపోతే.. భారత్‌ కు తీవ్ర నష్టమే.

https://whatsapp.com/channel/0029VaAe49e72WTw8YM6zr3q

Related News

Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Big Stories

×