EPAPER

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

Dubbaka Politics: జాతీయ, ప్రాంతీయ పార్టీల వైరం జోరందుకుంది. కుస్తీలు, కుమ్మలాటలు జోరు నడుస్తోందట. BRS ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. నేతల మాటెలా ఉన్నా.. వీరు మధ్య తాము నలిగిపోతున్నాని అధికారులు వాపోతున్నారట. ఇటీవల ఆ నియోజకవర్గ రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఆ రాజకీయ రగడకు వేదిక ఎక్కడో చూసేద్దాం రండి.


దుబ్బాక రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోందట. అక్కడ ఏ పార్టీ ప్రోగ్రాం జరిగినా ఏదో గొడవ జరగడం.. తద్వారా వార్తల్లోకి ఎక్కడం పరిపాటిగా మారింది. గొడవలు ఎందుకులే మన పని మనం చేసుకుందాం అనే లీడర్లు కనిపించటం లేదట. నువ్వేంత అంటే నువ్వేంత అనే వారే.. పుష్కలంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. దుబ్బాకలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. మూడు పార్టీల నేతలకు క్షణం కూడా పడడం లేదని.. దీంతో ఎవరికి వారే ప్రోగ్రామ్స్‌ డిసైడ్ చేసుకోవటంతో.. ఏదో రకంగా వాగ్వాదం జరుగుతూనే ఉందట. ఎప్పుడు ఏ నేత.. ఎలాంటి కార్యక్రమం పెట్టుకుంటాడో తెలియక అధికారులు విలవిల్లాడుతున్నట్టు టాక్ నడుస్తోంది.

నియోజకవర్గ పరిధిలో ఏ పార్టీకి చెందిన ప్రోగ్రామ్.. ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుందోనన పోలీసులు వణికిపోతున్నారట. ఎందుకంటే.. ఏ గొడవ జరిగినా.. తమ మెడకే చిక్కుకుంటుందనే భావనలో ఖాకీలు ఉన్నారట. టెన్షన్‌ పుట్టించే అధికారులే.. టెన్షన్‌ పడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రోజురోజుకీ ఈ గొడవలు పెరుగుతున్నాయే తప్ప. తగ్గటం లేదని పోలీసుల వాపోతున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రోటోకాల్ వివాదం తీవ్రస్థాయిలోకి వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ.. ఓ కార్యక్రమానికి వస్తే కూడా అక్కడ ప్రోటోకాల్ రగడ జరిగిందట. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సభావేదిక పైకి ఎక్కగానే.. BRS నేతలు పెద్ద ఎత్తున్న గొడవకు దిగారట. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మంత్రి సురేఖ.. ప్రోగ్రాం మధ్యలో నుంచే వెళ్లిపోవాల్సిన నెలకొందట.


మరోవైపు.. BRS ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అసలు పడదట. వీరికి తోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా వీరితో ఉప్పూనిప్పులాగే ఉంటున్నారట. అందుకే ఈ నియోజకవర్గ పరిధిలో.. ఈ మూడు పార్టీల కార్యకర్తలు కూడా వారి వారి నేతల తీరుగానే వ్యవహరిస్తోందనే టాక్ నడుస్తోంది. అందుకే ఇక్కడ ఉన్న మూడు పార్టీల మధ్య ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతూనే ఉండటం.. ఖాకీలను కలవరపాటుకు గురి చేస్తోందట.

Also Read:  ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

మొన్నటికి మొన్న.. దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు అత్యుత్సాహం చూపించారట. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొని.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందని పోలీసులే చెబుతున్నారు. దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు… ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు.. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారట. దీంతో BRS నాయకులు కూడా అక్కడకు చేరుకుని. శివాజీ చౌక్‌ వద్దకు వస్తుండగా కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారట. ఈ క్రమంలో హస్తం శ్రేణులు కోడిగుడ్లు విసిరేందుకు ప్రయత్నించారట. దీంతో పోలీసుల జోక్యం చేసుకోవటంతో ఇరు పార్టీల నేతలూ అక్కడ నుంచి పంపించేయటంతో వివాదం సద్దుమణిగింది.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వ్యవహరించటం హాస్యాస్పదంగా మారిందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారట. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న BRS ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందంటూనే.. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమవంతుగా పోరాడుతున్నానని ప్రభాకర్‌రెడ్డి అన్నారట. అంతే కాదు.. ఒక అడుగు ముందుకు వేసి.. తన కార్యక్రమాలను కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటు అంటూ పెద్ద స్టేట్‌మెంట్ ఇవ్వటంతో వివాదం కాస్తా ముదిరింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యానించటంతో వివాదం మరింత ముదిరిందని సామాన్య ప్రజలతో పాటు ఖాకీలూ చెబుతున్నారట.

ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం అంటే కొద్ది మందికే తెలిసేది. రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉపఎన్నికలతో దుబ్బాక.. రాష్ట్రవ్యాప్తంగా హాట్ నియోజకవర్గంగా మారిందట. ఉపఎన్నికల సమయంలో మొదలైన అగ్గి.. ఇప్పటి వరకు చల్లారడం లేదట. అప్పుడు BRS వర్సెస్ BJPగా ఉంటే.. ఇప్పుడు BRS వర్సెస్ BJP అండ్ కాంగ్రెస్ గా మారిందట. నియోజకవర్గంలో తాజా పరిస్థితులపై నేతల మాటెలా ఉన్నా.. తాము నలిగిపోతున్నామని పోలీసులు వాపోతున్నారట.

 

Related News

YCP – Janasena: లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

South Korea Vs North Korea: యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

TDP VS Janasena: భగ్గుమన్న నిడదవోలు.. కూటమిలో కొట్లాట?

Big Stories

×