EPAPER

Tension In YCP Leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. పొంతన లేని సమాధానాలు, సీఐడీకి ఇచ్చే ఛాన్స్

Tension In YCP Leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. పొంతన లేని సమాధానాలు, సీఐడీకి ఇచ్చే ఛాన్స్

Tension In YCP Leaders: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏం జరుగు తోంది? ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి ఇస్తోందా? నిందితులను మళ్లీ పిలుస్తారా? ముందుస్తుగా వైసీపీ నేతలు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారా? మీడియాకు నేతలు మసాలా ఇచ్చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి వెళ్తున్నట్లు బలంగా సంకేతాలు వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితులు నోరు విప్పలేదు. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఖంగు తిన్నారు. కనీసం ఫోన్లు అడిగినా లేవని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని విచారణ అధికారి స్వయంగా చెప్పారు.

ఈ కేసు ఏం చేద్దామనే ఆలోచన ప్రభుత్వం పడినట్టు సమాచారం. సీఐడీకి ఇస్తే కచ్చితంగా నిందితులు నోరు విప్పడం ఖాయమని భావిస్తోంది. వైసీపీ నేత సజ్జల (Sajjala ramakrishnareddy)కు దాదాపు 40 ప్రశ్నలు సంధించారు విచారణ అధికారి. వాటిలో ఎక్కువ భాగం తెలీదు.. గుర్తు లేదు.. మరిచిపోయాను అనే మాటలు వచ్చాయి.


ఒకవేళ అడిగితే వ్యతిరేక ధోరణిలో జవాబు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమైన నేతలను అరెస్ట్ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నది పోలీసు వర్గాల మాట. సీఐ స్థాయి అధికారులు విచారించడంతో నిందితులు సరైన సమాధానాలు చెప్పలేదట.

ALSO READ:  మద్యం ప్రియుల డిమాండ్స్‌తో ‘బిగ్ టీవీ’ కథనం.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన ప్రభుత్వం

టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన తర్వాత వైసీపీ నేతలు వరసగా రియాక్ట్ అయ్యారు. అప్పటి సీఎం జగన్, సజ్జల మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన వారికి సపోర్టుగా మాట్లాడి నట్టు గుర్తించారు పోలీసులు.  ఈ కేసులో అవే కీలకంగా మారాయి. ఈ కోణంలో పోలీసులు ప్రశ్నలు రైజ్ చేశారు.

బైపోల్ సమయంలో తాను బద్వేలులో ఉన్నారని చెప్పుకొచ్చారు సజ్జల. అసలు బద్వేల్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయలేదు. అక్కడ వార్ వన్ సైడ్, అయినా తాను అక్కడున్నానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారాయన. ఫోన్ ఇవ్వాలని అడిగితే వ్యక్తగత స్వేచ్ఛకు భంగమంటూ రిప్లై ఇచ్చారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  వైసీపీ కార్యకర్తలను వెనుకేసుకొచ్చారు. ఇక విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చిన సజ్జల కేసు గురించి మాట్లాడడం మానేశారు. అంతా రాజకీయ కోణంలో మాట్లాడారు.

ఒకవేళ ఈ కేసు సీఐడీకి ఇస్తే.. నెక్ట్స్ ఏంటన్న దానిపై వైసీపీ నేతలు చర్చించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మళ్లీ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట.

 

Related News

Amrapali Kata IAS : సీఎం చంద్రబాబును కలిసిన ఆ నలుగురు ఐఏఎస్లు, ఆమ్రపాలికి ఏ శాఖ ఇవ్వనున్నారంటే ?

CM Chandrababu : సజ్జల జస్ట్ శాంపిల్, నెక్ట్స్ ఎవరు.. వైసీపీని వణికిస్తున్న బాబు మాస్టర్ ప్లాన్

Bigtv Free Medical Camp: కనీసం రవాణా సదుపాయం కూడా లేని గ్రామంలో.. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు

YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో.. అంతా మాఫియా మయం.. కూటమిపై జగన్ సెటైర్స్

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

YS Sharmila: ఆర్టీసీ బస్సెక్కిన వైయస్ షర్మిళ.. కండక్టర్ కు ప్రశ్నల వర్షం.. అంత మాట అనేశారేంటి ?

Big Stories

×