EPAPER

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Prices Hike: బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్. స్టాక్ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దీపావళి పండుగ దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడంతో మహిళలు షాక్‌కు గురయ్యారు. అయితే బంగారం ధరలు పెరగడం, తగ్గడం రోజు జరుగుతూనే ఉంటుంది. కానీ గత రెండు రోజుల నుంచి వరుసగా ధరలు పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది.


24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.870 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,980కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.800 పెరగడంతో రూ.72,400 పలుకుతోంది. కిలో వెండి విషయానికొస్తే.. కేజీ సిల్వర్ రేటు రూ.2వేలు పెరిగి రూ.1,05,000 వద్ద ట్రెండ్ అవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఒడిదుడుగులు, బంగారం స్టోరేజీ ఆధారంగా రేట్లపై ప్రభావం చూపుతోంది.

ఇక, వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. అన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు భయపెడుతున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిద్దాం.


ఢిల్లీ, జైపూర్, లక్నో నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,450గా ఉంది. హైదరాబాద్, కేరళ, కోల్‌కతా, ముంబై నగరాల్లో బులియన్ మార్కెట్‌లో రూ.72,400గా ఉంది. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,030 గా ఉండగా.. ఢిల్లీ, జైపూర్, లక్నో, ఛండీఘఢ్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.79,130 పలుకుతోంది. హైదరాబాద్, కేరళ, బెంగళూరు, చెన్నై, ముంబై బులియన్ మార్కెట్‌లో రూ.78,980 వద్ద ట్రెండింగ్ లో ఉంది

Related News

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Fact Check: మీ IRCTC ఐడీతో వేరే వాళ్లకు టికెట్స్ బుక్ చెయ్యొచ్చా? అసలు విషయం చెప్పిన రైల్వేశాఖ

Bengaluru Air Taxis: బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Vande Bharat Sleeper Train: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Big Stories

×