EPAPER

Gurupatwant Pannun: ‘ఖలీస్తాన్ ఉగ్రవాది’ హత్యాయత్నం కేసులో నిందితుడిగా భారత ఇంటెలిజెన్స్ అధికారి.. అమెరికా ఆరోపణలు

Gurupatwant Pannun: ‘ఖలీస్తాన్ ఉగ్రవాది’ హత్యాయత్నం కేసులో నిందితుడిగా భారత ఇంటెలిజెన్స్ అధికారి.. అమెరికా ఆరోపణలు

Gurupatwant Pannun| కెనెడా, అమెరికా రెండు దేశాల పౌరసత్వం కలిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యాయత్నం కేసులో భారతదేశానికి చెందిన గూడాఛార సంస్థ రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్) అధికారి వికాస్ యాదవ్‌ని నిందితుడిగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వికాస్ యాదవ్ అనే ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారి.. పన్నూన్ హత్య కేసులో ప్లానింగ్, మనీ లాండరింగ్ చర్యలకు పాల్పడినట్లు అమెరికాలో జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది.


అమెరికా విచారణ సంస్థ ఎఫ్‌బిఐ రిపోర్ట్ ప్రకారం.. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ని హత్య చేయడానికి మే 2023లోనే ప్లానింగ్ మొదలైంది. ఇండియన్ రా ఆఫీసర్ వికాస్ యాదవ్.. నిఖిల్ గుప్తా అనే మరో భారత గూఢాచారితో కలిసి గురుపత్వంత్ హత్య చేయడానికి జూన్ నెలలో ఒక షూటర్ కు లక్ష డాలర్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ షూటర్ మరెవరో కాదు.. న్యూయార్క్ నగరంలో భారత దేశ నిఘా సంస్థలకు ఇన్‌ఫార్మర్ గా పనిచేస్తున్న ఓ ఎజెంట్. అతనికి గురుపత్వంత్‌ని హత్య చేయడానికి జూన్ 2023లో అడ్వాన్స్‌గా 15000 డాలర్లు ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందే ఈ హత్య కాంట్రాక్ట్ ప్లానింగ్ జరగడం గమనార్హం.

Also Read: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’


గురుపత్వంగ్ సింగ్ పన్నూన్ ఇండియాలోని పంజాబ్, హర్యాణా రాష్ట్రాలను సిక్కుల కోసం ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ మిలిటెంట్ సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నాడు. అమెరికా, కెనెడా దేశాల్లో లాయర్ గా స్థిరపడి.. ఇండియాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అతను పాకిస్తాన్ ద్వారా డబ్బు, ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు భారత విచారణ సంస్థ ఎన్ఐఏ తెలపింది. భారతదేశ ప్రభుత్వం.. గురుపత్వంత్ పన్నూన్ ని ఉగ్రవాదిగా ప్రకటించింది.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించే గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఇంటిపై గత సంవత్సరం దాడి జరిగింది. ఈ దాడిలో గురుపత్వంత్ తప్పించుకున్నాడు. తనను హత్య చేసుందుకే భారత ప్రభుత్వం ఈ దాడి చేయించిదని గురుపత్వంత్ అమెరికా కోర్టులో కేసు వేశాడు. తాను అమెరికా పౌరుడు కావడంతో తనకు రక్షణ కల్పించే బాధ్యత అమెరికా ప్రభుత్వానిదే అని కోర్టులో పిటీషన్ వేశాడు.

గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పిటీషన్ విచారణ ప్రారంభించిన అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ కేసులో నిఖిల్ గుప్తా అనే ఇండియన్ అధికారిని జెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో అరెస్టు చేసింది. అమెరికా కోర్టులో ప్రస్తుతం నిఖిల్ గుప్తా తాను నిర్దోషినని కేసు వాదిస్తున్నారు. అయితే తాజాగా గురుపత్వంత్ హత్యాయత్నం కేసులో మాస్టర్ మైండ్ వికాస్ దూబే అని అతను ఇండియాన్ ఇంటెలిజెన్స్ అధికారి అని ఎఫ్‌బిఐ పేర్కొంది. అతను ఇండియాలోనే ఉన్నాడని.. భారత ప్రభుత్వం అతడిని తమకు అప్పగించాలని నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులుపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. వికాస్ యాదవ్ ఒక మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అని.. అతను ఉద్యోగం మానేసి చాలా కాలం కావడంతో ఈ కేసుతో తమకు ఏ సంబంధం లేదని.. సమాధానం ఇచ్చింది. నోటీసులు జారీ చేయడం అనవసరమైన చర్యగా అభివర్ణించింది.

Related News

Yahya Sinwar Kamala Harris: ‘యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవాలి’.. ఇజ్రాయెల్‌కు కమలా హారిస్ సూచన

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

Oswal Daughter Uganda: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’

Justin Trudeau Nijjar Killing: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు

Lawrence Bishnoi: భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

Big Stories

×