EPAPER

AP Govt on BigTV News: మద్యం ప్రియుల డిమాండ్స్‌తో ‘బిగ్ టీవీ’ కథనం.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP Govt on BigTV News: మద్యం ప్రియుల డిమాండ్స్‌తో ‘బిగ్ టీవీ’ కథనం.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP Govt on BigTV News: ఏపీలోని మందుబాబుల డిమాండ్స్ ను బిగ్ టీవీ ప్రత్యేక కథనంను ప్రచురించింది. దీనితో ప్రభుత్వం తాజాగా స్పందించి మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి రాగానే మద్యం ప్రియులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మద్యం విధానం ద్వారా తాము క్యూలైన్లో నిలబడి మద్యం సీసాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంతో తమకు ఆ కష్టాలు తొలిగాయని మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు.


అలాగే నూతన మద్యం షాపుల్లో ఆన్లైన్ విధానం ద్వారా సైతం నగదు చెల్లింపులు నిర్వహిస్తుండగా, చిల్లర సమస్య కూడా తగ్గిందన్నారు. అయితే ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రూ.99 లకే క్వాటర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని, అలాగే బ్రాండెడ్ మద్యం సీసాలను అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు.

నూతన మద్యం విధానం ద్వారా.. బ్రాండెడ్ మద్యం సీసాలు అందుబాటులోకి వచ్చినా, ధరపైన పలు డిమాండ్ లు వినిపించాయి. పలువురు మద్యం ప్రియులు సోషల్ మీడియా ద్వారా.. ధర తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఇదే కథనాన్ని బిగ్ టీవీ ప్రచురించింది.
మద్యం ప్రియులు నూతన మద్యం విధానంపై ఆనందం వ్యక్తం చేస్తున్నా.. ఆ ఒక్క డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు బిగ్ టీవీ కథనం ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా ప్రయత్నించింది. తాజాగా ఇదే విషయానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.


మద్యం ప్రియులు కోరుకుంటున్నట్లుగానే రూ.99 లకే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు. ఐదు ప్రముఖ సంస్థలు ఇదే ధరకు క్వార్టర్ బాటిల్ ను అందించేందుకు ముందుకు వచ్చాయని, ఈనెల 21 నాటికి పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 99 లకే క్వార్టర్ బాటిల్ మద్యం లభిస్తుందన్నారు. అలాగే పలు చోట్ల ఈ ధరలోనే క్వార్టర్ బాటిల్ లభిస్తుందన్నారు.

Also Read: NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌గా మళ్లీ సీఎం చంద్రబాబుకే! త్వరలో ప్రకటన

నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో మద్యం ప్రియులకు మరింత స్టాక్ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తరఫున వచ్చిన ఈ ప్రకటనతో మద్యం ప్రియులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం షాపులకు లైసెన్స్ లభించగా, ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఇక డిమాండ్స్ నెరవేరాయి.. ఫుల్ కిక్కే కిక్కు అంటున్నారు మద్యం ప్రియులు.

Related News

CM Chandrababu : సజ్జల జస్ట్ శాంపిల్, నెక్ట్స్ ఎవరు.. వైసీపీని వణికిస్తున్న బాబు మాస్టర్ ప్లాన్

Bigtv Free Medical Camp: కనీసం రవాణా సదుపాయం కూడా లేని గ్రామంలో.. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు

YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో.. అంతా మాఫియా మయం.. కూటమిపై జగన్ సెటైర్స్

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

YS Sharmila: ఆర్టీసీ బస్సెక్కిన వైయస్ షర్మిళ.. కండక్టర్ కు ప్రశ్నల వర్షం.. అంత మాట అనేశారేంటి ?

Tension In YCP Leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. పొంతన లేని సమాధానాలు, సీఐడీకి ఇచ్చే ఛాన్స్

Big Stories

×