EPAPER

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనంతో హైదరాబాద్‌ ఎలా ఉంటుంది. దాని వల్ల తెలంగాణకు ఏం జరుగుతుందనేది కళ్లకు కట్టినట్టు వివరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు సంబంధించి నాలుగు నిమిషాల నిడివిగల డాక్యుమెంట్‌ను విడుదల చేసింది.


మూసీ రివర్ అనగానే మురికి కూపంగా కనిపిస్తుంది. చుట్టు పక్కల మనుషులు జీవించడానికే కష్టంగా మారింది. దీన్ని ప్రక్షాళన చేసి, నదికి పునర్జీవనం కల్పించేందుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తద్వారా పరివాహక ప్రాంత ప్రజలకు గొప్ప మేలు చేకూరడమే కాదు, హైదరాబాద్ సాంస్కృతిక, ఆర్థిక పునరుత్తేజం, తెలంగాణకు పునర్నిర్వచనం కల్పించినట్టవుతుంది.

మూసీకి సంబంధించి డాక్యుమెంట్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి . మార్పు జరగాలంటే ఉక్కు సంకల్పంతో కూడిన సాహసం చేయాలని రాసుకొచ్చారు. మూసీ గర్భంలో జీవచ్ఛవాలుగా బతుకుతున్న పేదల బతుకులు మార్చేందుకు సంకల్పం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


హైదరాబాద్ చారిత్రక వైభవానికి ఆనవాలుగా మిగిలిన మూసీని పునరుజ్జీవిపం చేసే లక్ష్యం తనదని ప్రస్తావించారు. విశ్వ నగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరం ఆర్థిక, పర్యాటక, వాణిజ్య రంగాల ఆయువు పట్టుగా మూసీని మార్చే బాధ్యత తనది చెప్పుకొచ్చారు.

ALSO READ: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

వేసిన అడుగులో ఎన్ని దుష్టశక్తులు అడ్డు వచ్చినా ఈ సంకల్పం చెరిగిపోదని, ఈ లక్ష్యం చెదిరిపోదని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు దానిపై ఓ లుక్కేద్దాం.

 

Related News

Hyderabad Restaurants Raids: పాచిన పిండి, కుళ్లిన ఉల్లి.. ‘చట్నీస్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటల్స్ బంద్..

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Revanth On Musi River: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

Big Stories

×