EPAPER

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

Pro Kabaddi League 11: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న… ప్రో కబడ్డీ లీగ్ కు ( Pro Kabaddi League 11) కౌంట్ డౌన్ షురూ అయింది. ఇవాల్టి నుంచే ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు నిర్వహణ సంస్థ అన్ని ఏర్పాట్లు… చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్‌ 10 సీజన్లు అయిపోయాయి. ఇప్పుడు ప్రో కబడ్డీ 11వ సీజన్‌ ( Pro Kabaddi League 11) ప్రారంభం కానుంది. ఈసారి ప్రో కబడ్డీ లీగ్ మూడు దశల్లో మూడు ప్రాంతాల్లో నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మొదటి మ్యాచ్ కు… మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. వాస్తవంగా ఈ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ జట్లు తలబడబోతున్నాయి.


Pro Kabaddi League 11 Squads Schedule Live Streaming

ఇక ఈ మ్యాచ్… హైదరాబాద్ మహానగరంలోని (Hyderabad) గచ్చిబౌలి స్టేడియంలో…. రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందని అధికారిక ప్రకటన చేసేశారు. అంతేకాదు రాత్రి 9 గంటల సమయంలో… ఇదే గచ్చిబౌలి స్టేడియంలో… రెండవ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ రెండో మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ ముంబై (Mumbai) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అలాగే.. ఈ ప్రో కబడ్డీ మ్యాచ్ లన్ని… హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ మాధ్యమాలలో ప్రసారం కానున్నాయి. ఈ రెండు మాధ్యమాల్లోనే లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. ముందు చెప్పుకున్నట్లుగానే ఈసారి ప్రో కబడ్డీ లీగ్ మూడు దశలలో జరగనుంది. మూడు నగరాలు ఈ టోర్నమెంట్కు ఆదిత్యం ఇవ్వబోతున్నాయి. మొదటగా మన హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో… ఇవాల్టి నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఫస్ట్ ఫేస్ పోటీలు నిర్వహించనున్నారు.

Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !


ఇక్కడ అయిపోయిన తర్వాత నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు రెండవ దశ పోటీలు జరుగుతాయి. ఈ రెండవ దశ పోటీలు నోయిడా ఇండోర్ స్టేడియం లో నిర్వహించనున్నారు. ఇక డిసెంబర్ మూడో తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు… పూణే (Pune) వేదిక కానుంది. పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో… ప్రో కబడ్డీ లీగ్ జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రో కబడ్డీ లీగ్ తాజా అప్డేట్స్ కోసం… Www.prokabaddi.com వెబ్ సైట్ లో లాగిన్ కావాలని కూడా… ఈ టోర్నమెంట్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. అలాగే ప్రో కబడ్డీ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

జట్ల వివరాలు

  • బెంగాల్ వారియర్జ్ – ఫజెల్ అత్రాచలి
  • బెంగళూరు బుల్స్ – పర్దీప్ నర్వాల్
  • దబాంగ్ ఢిల్లీ కె.సి. – నవీన్ కుమార్ మరియు అషు మాలిక్
  • గుజరాత్ జెయింట్స్ – నీరజ్ కుమార్
  • హర్యానా స్టీలర్స్ – జైదీప్ దహియా
  • జైపూర్ పింక్ పాంథర్స్ – అర్జున్ దేశ్వాల్
  • పాట్నా పైరేట్స్ – శుభమ్ షిండే
  • పుణేరి పల్టాన్ – అస్లాం ఇనామ్దార్
  • తమిళ్ తలైవాస్ – సాగర్
  • తెలుగు టైటాన్స్ – పవన్ సెహ్రావత్
  • యు ముంబై – సునీల్ కుమార్
  • యుపి యోధాస్ – సురేందర్ గిల్

Related News

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Big Stories

×