EPAPER

Yahya Sinwar Kamala Harris: ‘యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవాలి’.. ఇజ్రాయెల్‌కు కమలా హారిస్ సూచన

Yahya Sinwar Kamala Harris: ‘యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవాలి’.. ఇజ్రాయెల్‌కు కమలా హారిస్ సూచన

Yahya Sinwar Kamala Harris| పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూపు అగ్రనాయకుడు యహ్యా సిన్వర్ మరణించాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోయే అవకాశాలున్నాయి. ఈ విషయంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ యూనివర్సిటీ ఆఫ్ విస్ కాన్సిన్ మిల్ వాకీలో ఒక కార్యక్రమం సంద్భంగా మాట్లాడారు.


హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ మరణంతో గాజా యుద్ధానికి ముగింపుపలకాలని ఇజ్రాయెల్ కు సూచించారు. సిన్వర్ మృతితో అక్టోబర్ 7, 2023న హమాస్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయిందని, న్యాయం జరిగిందని.. ఇక హమాస్ చెరలో ఉన్న బందీలు కూడా దాదాపు విడుదల కావడంతో యుద్ధం ముగిసిపోవాలని.. గాజాలోని పాలస్తీనా వాసుల బాధలు కూడా ఇంతటితో అంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
పాలస్తీనా వాసులకు కూడా స్వతంత్రంగా జీవించే హక్కు ఉందని ఆమె అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కమలా హ్యారిస ప్రచారంలో పాలస్తీనా మద్దతుదారులు కూడా ఉండడంతో ఆమె వారి ఓట్లను కూడా టార్గెట్ చేస్తున్నట్లు కనిపించింది.

యద్దం కానసాగుతుంది: నెతన్యాహు
మరోవైపు యహ్యా సిన్వర్ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు. సిన్వర్ మరణించడంతో అతనితో లెక్క సరిపోయిందన్నారు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్ పై జరిగిన అమానుష దాడుల్లో 1200 మందికి పైగా చనిపోయారని.. హిట్లర్ కాలంలో యూదుల మారణహోమం తరువాత జరిగిన అతిపెద్ద నరమేధంగా అక్టోబర్ 2023 దాడులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. సిన్వర మృతితో గాజా యుద్దం కీలక మలుపు తీసుకుందని చెప్పారు. గాజాలో సరెండర్ చేసిన మిలిటెంట్లు.. ఇజ్రాయెల్ బందీలను విడిపించేందుకు సాయం చేస్తే.. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోమని తెలిపారు. అయితే సిన్వర్ చనిపోయినా గాజా యుద్ధం మాత్రం కొనసాగుతుందని అన్నారు.


యహ్యా సిన్వర్ మృతి ఎందుకు కీలకం?
జూలై 2024లో హమాస్ మిలిటరీ వింగ్ అధ్యక్షుడు ఇస్మాయెల్ హానియె.. ఇరాన్ లో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసి ఆయనని హత్య చేసింది. ఇస్మాయిల్ హానియె మరణం తరువాత హమాస్ చీఫ్ గా కరుడుగట్టిన మిలిటెంంట్ యహ్యా సిన్వర్ బాధ్యతలు చేపట్టాడు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్ పై జరిగిన అకస్మాత్తు దాడిలో 1200 మంది చనిపోయారు. ఈ దాడికి మాస్టర్ మైండ్ యహ్యా సిన్వర్ అని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో యహ్యా సిన్వర్ తాజాగా జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవడంతో హమాస్ కు ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టినట్లైంది.

హమాస్ మిలిటరీ కార్యకలాపాలు చాలా కాలంగా యహ్యా సిన్వర్ నాయకత్వంలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు అతను చనిపోవడంతో హమాస్ మిలిటెంట్ గ్రూపునకు నాయకుడు లేకుండా పోయాడు. దీనివల్ల హమాస్‌కు తీవ్ర నష్టం జరిగింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ ఈ విషయంపై స్పందిస్తూ.. ”సిన్వర్ ను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ మిలిటరీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇది ఊహించని పరిణామం. ఇప్పుడు త్వరగానే హమాస్ చేతిలో బందీలుగా ఉన్న పౌరులను విడిపించగలమని నమ్ముతున్నాను. సిన్వర్ మృతి తరువాత గాజాలో హమాస్, ఇరాన్ ప్రభావం లేని ప్రజావ్యవస్థ ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సిన్వర్ చనిపోలేదు.. అదంతా తప్పుడు ప్రచారం: హమాస్
అయితే యహ్యా సిన్వర్ చనిపోయాడని ఇజ్రాయెల్ చెబుతున్నా.. మరోవైపు హమాస్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు. తమ నాయకుడు బతికే ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ తప్పుడు ప్రచారం చేస్తోందని హమాస్ అధికారికంగా ప్రకటించింది. కేవలం హమాస్ సైనికులను మానసికంగా దెబ్బతీసేందుకే ఇజ్రాయెల్ ఈ ప్రచారం చేస్తోందని ప్రకటనలో పేర్కొంది. పాలస్తీనా ప్రజల మనోధైర్యం అంత బలహీనం కాదని.. తమ నాయకుడు బతికే ఉన్నాడని చెప్పింది. పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం హమాస్ పోరాడుతూనే ఉంటుందని గుర్తుచేసింది.

Related News

Gurupatwant Pannun: ‘ఖలీస్తాన్ ఉగ్రవాది’ హత్యాయత్నం కేసులో నిందితుడిగా భారత ఇంటెలిజెన్స్ అధికారి.. అమెరికా ఆరోపణలు

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

Oswal Daughter Uganda: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’

Justin Trudeau Nijjar Killing: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు

Lawrence Bishnoi: భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

Big Stories

×