EPAPER

Woman Duped Movie Role: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి

Woman Duped Movie Role: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి

Woman Duped Movie Role| సినిమాల్లో హీరోగా హీరోయిన్ గా అవకాశం కోసం దేశంలో లక్షలాది మంది ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది అనాలోచితంగా హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి నగరాలకు తరలివచ్చేస్తుంటారు. కానీ అలా వచ్చిన వారు ఎక్కువగా మోసపోతుంటారు. అలాంటిదే ఒక ఘటన బెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో ఇటీవల జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో నటించి పెద్ద హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని కలలుకనే నమ్రతా(23, పేరు మార్చబడినది) అనే యువతి న్యూస్ పేపర్ లో ఒక యాడ్ చూసింది. ఆ యాడ్ లో ‘సినిమాలో నటించేందకు నటీనటులు కావలెను’ అని ఉంది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూసే నమ్రతా ఆ యాడ్ చూసి ఎంతో సంతోషపడింది. వెంటనే న్యూస్ పేపర్ యాడ్ లో ఉన్న చోటుకి ఆడిషన్స్ కు వెళ్లింది.

Also Read: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. ఆ విషయం ఎలా బయటపడిందంటే?


బెంగాల్ లోని బేనియపకూర్ ప్రాంతంలో దీపేన్ నస్కార్, ప్రసూన్ సిన్హా అనే ఇద్దరు వ్యక్తులు బంగాల్ మూవీ ఆర్ట్స్ పేరుతో ఒక ఏజెన్సీ నడుపుతున్నారు. సెప్టెంబర్ నెలలో వాళ్లు సినిమా ఆడిషన్స్ కోసం న్యూస్ పేపర్ ల యాడ్ ఇచ్చారు. ఆ ఆఢిషన్స్ కు నమత్రా వచ్చింది. అయితే ఆడిషన్స్ లో ఆమె అందం అభినయం చూసిన దీపేన్, ప్రసూన్ సిన్హా.. ఇద్దరు ఆమెను సెలెక్ట్ చేశారు. అయితే నమ్రతా తప్ప ఆడిషన్స్ కు వచ్చిన మిగతా వారందరినీ తిరిగి పంపించేశారు.

నమ్రతాకు సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే అందుకోసం ఆమె చిన్న చిన్న బట్టలు వేసుకోవాలని చెబుతూ ఆమెతో అసభ్య ప్రవర్తించారు. అయినా నమ్రతా తనకు నచ్చకపోయినా వారి ప్రవర్తనకు ఓర్పుతో సమాధానం చెప్పింది. వారం రోజుల తరువాత ఆమెకు తిరిగి దీపన్, ప్రసూన్ సిన్హా ల నుంచి ఫోన్ వచ్చింది. సినిమా నిర్మాణంలో చాలా ఖర్చు అవుతుంది గనకు కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందబోయే సినిమా కోసం కొంచెం డబ్బులు తగ్గాయని అందుకోసం రూ.60 లక్షలు ఏర్పాటు చేయాలని నమ్రతాకు చెప్పారు.

సినిమా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురుచూసే నమ్రత రూ.60 లక్షలు ఖర్చు చేస్తే.. ఇక హీరోయిన్ చాన్స్ కొట్టేయచ్చునని భావించి. తన తల్లిదండ్రుల చేత తమ ఆస్తిలోని కొంత భాగం విక్రయించి రూ.60 లక్షలు ఏర్పాటు చేసి దీపేన్, ప్రసూన్ ల చేతికి ఇచ్చింది. ఆ తరువాత ఒకరోజు పార్టీ పేరుతో నమ్రతను వారిద్దరూ ఒకరోజు పిలిచి అత్యాచారం చేశారు. దీంతో నమత్రా పోలీసులకు తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది.

అయితే ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసుల చేతికి చిక్కకుండా ఇద్దరు మోసగాళ్లు.. పారిపోయారు. అయితే వారం రోజుల క్రితం పోలీసులు వారిద్దరినీ పట్టుకున్నారు. ఫేక్ సినిమా ఆడిషన్స్ కేసులో దీపేన్, ప్రసూన్ సిన్హాలతో పాటు మరో 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోల్ కతా లోని సియాల్‌దా కోర్టులో దీపేన్, ప్రసూన్ లపై చీటింగ్ కేసు, రేప్ కేసు విచారణ జరుగుతోంది.

Related News

FIR Against Harishrao Relatives: చిక్కుల్లో మాజీ మంత్రి బ్రదర్.. ఆపై కేసు

Doctor Suicide: బిజినెస్ కోసం రూ.కోటి అడిగిన భర్త.. ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్

Urine in Food: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. ఆ విషయం ఎలా బయటపడిందంటే?

Son In Law Arrested: అత్తకు రోజూ అల్లుడు మెసేజ్‌లు.. అరెస్ట్ చేసిన పోలీసులు, పాపం ఆమె గుండె పగిలింది

Mumabai : ముంబైలో దారుణం.. తల్లి తండ్రి కళ్ళముందే నడిరోడ్డుపై వ్యక్తి హత్య

Hyderabad Crime News: గచ్చిబౌలిలో దారుణం.. మహిళా టెక్కీపై ఇద్దరు అత్యాచారం, ఆపై..

Big Stories

×