EPAPER

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

BRS Working President Ktr : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉదయం నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఆయనపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా దాఖలైంది. దీంతో ఈ కేసులో స్వయంగా కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్, ఉదయం 11.30 గంటలకు న్యాయస్థానంలో స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. సాక్ష్యులుగా బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, తుల ఉమ, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ సైతం వాంగ్మూలం ఇవ్వనున్నారు.


ఈనెల 3న కేసు నమోదు…

బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు ఆమె భంగం కలిగించారంటూ ఈనెల 3న నాంపల్లి క్రిమినల్ న్యాయస్థానంలో పరువునష్టం కేసు ఫైల్ చేశారు.


రేపే వాంగ్మూలాలు నమోదు…

దీంతో పిటిషన్‌పై ఈనెల 14న కోర్టు విచారించింది. అనంతరం 18కి వాయిదా వేసింది. ఇక కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలు శుక్రవారం నమోదు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రేపు కోర్టులో హాజరవుతారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టులో సమర్పించారు.

రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

మరోవైపు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్’లో మూసీ నదిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

also read : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Related News

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Revanth On Musi River: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Big Stories

×