EPAPER

BSNL fibre plan : అదిరే ఆఫర్ గురూ.. సింగిల్ రీఛార్జ్ తో 6500GB… BSNL ప్లాన్ అదిరిపోలా!

BSNL fibre plan : అదిరే ఆఫర్ గురూ.. సింగిల్ రీఛార్జ్ తో 6500GB… BSNL ప్లాన్ అదిరిపోలా!

BSNL fibre plan : బిఎస్ఎన్ఎల్.. ఒకప్పుడు టాప్ మోస్ట్ టెలికాం సంస్థగా ఉన్నా బిఎస్ఎన్ఎల్ కాల క్రమంలో కాస్త వెనుకబడిందనే చెప్పాలి. ఇక టాప్ టెలికాం సంస్థలని విపరీతంగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచేస్తున్న సమయంలో.. నేను ఉన్నా అంటూ హామీ ఇస్తూ తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వీలైనంత తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్స్ ను అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ తాజాగా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ వినియోగదారులకు కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.


ప్రముఖ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాంట్స్ ను అత్యద్భుతంగా కస్టమర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ప్లాన్స్ కు మంచి డిమాండ్ ఉండగా తాజాగా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ వినియోగదారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపింది.

బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ప్లాన్స్ ఎక్కువ మొత్తంలో ఇంటర్నెట్ వాడే వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ తెలిపింది. ఇక అవసరాలకు అనుగుణంగా సబ్ స్కైబ్ ప్లాట్ ఫామ్ సైతం అందుబాటులో ఉంటాయని కాలింగ్ సదుపాయం అదనంగా ఉంటాయని చెప్పుకొచ్చింది.


బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అల్ట్రా ఓటిటి రీఛార్జ్ ప్లాన్ – 

బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అల్ట్రా ఓటీపీ కొత్త ప్లాన్ ఖరీదైనదే అయినప్పటికీ అత్యద్భుతమైన సేవలను అందిస్తుందని చెప్పాలి. నెలకు రూ. 1799 తో ఈ ప్లాన్ అత్యంత వేగంగా డేటాను అందిస్తుంది. ఇక 300 ఎంబిబిఎస్ వేగం ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. అపరిమిత డేటాను కోరుకునే వారికి ఈ ప్లాన్ మంచి అవకాశం అని.. ప్రతి నెలా 6500 GB ఇంటర్నెట్ను అందిస్తామని చెప్పుకొచ్చింది. 6500 GB డేటా కోటా ముగిసిన తర్వాత వినియోగదారులు 20 ఎంబిబిఎస్ వేగంతో డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని అంతరాయం లేకుండా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుందని తెలిపింది.

అధిక డేటా కేటాయింపులతో ప్లాన్ లో భాగంగా ఓటీపీ యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ సైతం బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది. ఇందులో భాగంగా డిస్నీ + ప్లస్ హాట్ స్టార్, యూప్ టీవీ ప్యాక్, సోనీ లీవ్, జీ 5 తో సహా లయన్స్ గేట్ ప్లే కూడా ఉచితంగా యాక్సిస్ ఇస్తుంది. ఇక కాలింగ్ సదుపాయం కోసం ఉచిత ల్యాండ్ లైన్ కనెక్షన్ తో పాటు అపరిమిత లోకల్ ఎస్.టి.డి సైతం అందించనున్నట్టు బిఎస్ఎన్ఎల్ వివరించింది.

బిఎస్ఎన్ఎల్ తన సేవలను మరింత విస్తృత పరుచుకునే పనిలో ఉంది. వచ్చే ఆరు నెలల్లో సేవలు మరింత గణనీయంగా మెరుగుపడతాయని.. ప్రస్తుతం ఉన్న 24,000 టవర్ల నుండి దాదాపు లక్ష వరకు టవర్లను పెంచే అవకాశం ఉందని.. దీని ద్వారా 4G సేవలు మరింత మెరుగుపడతాయని ఇప్పటికే వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఫైబర్ ప్లాన్స్ సైతం మరింత విసృతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా బీఎస్ఎన్ఎల్ తన సేవలను మరింత మెరుగుపరిచే పనిలో ఉందనే చెప్పాలి.

ALSO READ : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

 

Related News

YouTube Account Recovery : హ్యాకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే యూట్యూబ్ కొత్త టూల్.. ఒక్క క్లిక్ తో అకౌంట్ సేఫ్

Samsung Galaxy A16 5G : శాంసంగ్‌ మరో అరాచకం.. 2 వేరియంట్స్ లో తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్

Flipkart Diwali sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Lunar Space Station: చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

Vivo Y19s Mobile: వివో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

×