EPAPER

Sadar Festival : ధూం.. ధాం.. సదర్

Sadar Festival : ధూం.. ధాం.. సదర్

Sadar Festival : సదర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది హైదరాబాద్. ప్రతీ ఏడాది దీపావళి తర్వాత ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుగుతాయి. డప్పు చప్పుళ్లు, దున్నపోతుల విన్యాసాలు, ఆటపాటలతో ఎంతో సందడిగా ఉంటుంది. హైడరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలను ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది కూడా వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సదర్ సమ్మేళన్ నిర్వహిస్తున్నట్టు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు.


అక్టోబర్ 27వ తేదీన ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గర సదర్ సమ్మేళన్ జరుగుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సారి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తర ప్రదేశ్ నేతలు తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ సహా తదితరులు హాజరవుతున్నారని తెలిపారు.

ALSO READ : మాది సంక్షేమం.. మీది అన్యాయం – హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఫైర్


కులమతాలకు అతీతంగా సదర్ సమ్మేళన్‌ను జరుపుకోవాలని కోరారు అంజన్ కుమార్ యాదవ్. తెలంగాణ అంతటా సదర్ వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం విభిన్న సంసృతి, సంప్రదాయాలకు నిలయమని చెప్పారు.

సదర్ సమ్మేళన్‌కు నలుమూలల ఉన్న ప్రజలు హాజరవుతారని, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమ రూపకర్తలుగా వివరించారు. ఏకేవై టీం ఆధ్వర్యంలో అంతా జరుగుతుందని, ధనక్ ధనక్ తురే అనే శబ్దంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.

Related News

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Revanth On Musi River: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Big Stories

×