EPAPER

Strange News: అతడికి ‘మూడు’.. ఆశ్చర్యపోతున్న వైద్యులు, ఇన్ని రోజులు ఎలా దాచుకున్నావయ్యా?

Strange News: అతడికి ‘మూడు’.. ఆశ్చర్యపోతున్న వైద్యులు, ఇన్ని రోజులు ఎలా దాచుకున్నావయ్యా?

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అలాంటి ఓ వింత గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వాస్తవానికి ఓ పురుషుడికి ఒక పురుషాంగం మాత్రమే ఉంటుంది. అలా కాదని, ఎక్కువ ఉంటే? ఆశ్చర్యపోతాం. షాకవుతాం. ఈ విషయం తెలిస్తే మీరు నిజంగానే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఓ వ్యక్తికి మూడు పురుషాంగాలు ఉన్నట్లు యుకె వైద్యులు గుర్తించారు. అయితే, మూడు పురుషాంగాలు ఉన్నాయనే విషయం తనకు కూడా తెలియకపోవడం అసలైన షాక్.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

రీసెంట్ గా 78 ఏండ్ల బ్రిటీష్ వ్యక్తి చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు డెడ్ బాడీని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్ మెడికల్ స్కూల్ కు దానం చేశారు. తాజాగా అతడి బాడీని మెడికల్ విద్యార్థులు పరీక్షించారు. బాడీలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. అతడి జననాంగాలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు పురుషాంగాలు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. నిజానికి మూడు పురుషాంగాలు ఉన్నాయనే విషయం అతడికి కూడా తెలియదని వైద్యులు తెలిపారు. ఒక పురుషాంగం సాధారణంగా బయటకు ఉండగా, మిగతా రెండు పురుషాంగాలు బీజకోశంలో ఉన్నట్లు తెలిపారు. అందుకే అతడికి మిగతా పురుషాంగాల గురించి తెలిసే ఛాన్స్ లేదన్నారు. అతడి ప్రాథమిక పురుషాంగం మూడు అంగుళాల పొడవు ఉండగా, మిగిలిన రెండు పురుషాంగాలు 1.5 అంగుళాల పొడవు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


మూడు పురుషాంగాలు ఉన్న రెండో కేసు   

మనిషికి ఒకటి కంటే ఎక్కువ పురుషాంగాలు ఉండటాన్ని వైద్య పరిభాషలో పాలీపాలియా అంటారు. బ్రిటన్ వ్యక్తికి మూడు పురుషాంగాలు ఉన్నాయి కాబట్టి ట్రిఫాలియా అంటారని డాక్టర్లు తెలిపారు. ఒక వ్యక్తికి రెండు పురుషాంగాలు ఉన్న ఘటనలు గతంలో రెండుసార్లు జరిగాయి. 1606 ఓ వ్యక్తికి రెండు పురుషాంగాలు ఉండగా, 2023లో మరో వ్యక్తి రెండు పురుషాంగాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఒక వ్యక్తికి రెండు పురుషాంగాలు ఉండటాన్ని డిఫాలియా అంటారు. ఇక ట్రిపాలియా అనేది ఇంతకు ముందుకు ఒకసారి గుర్తించారు. 2020లో ఇరాక్ లోని దుహోక్ కు చెందిన మూడు నెలల బాలుడిలో ఈ సమస్యను వైద్యులు గుర్తించారు. పెద్దవారిలో గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. జన్యుపమైన లోపాల కారణంగా ఎక్కువ పురుషాంగాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. జననేంద్రియ ట్యూబర్‌ కిల్ అనే కణజాలం నుంచి తయారవుతాయి. పురుషాంగం అభివృద్ధి చెందుతున్న క్రమంలో జన్యుపరంగా ఏమైనా అవాంతరాలు ఏర్పడినప్పుడు ఒకటికి మించి పురుషాంగాలు ఏర్పడుతాయని వైద్యులు వివరించారు.

ట్రిపాలియాతో కలిగే సమస్యలు

ట్రిపాలియాతో పురుషులలో పలు లైంగిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. మూత్రాన్ని ఆపుకునేందుకు చాలా ఇబ్బంది పడుతారు. అంగస్తంభన సమస్య, సంతానలేమి లాంటి ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్‌ లో ప్రచురించారు.

Read Also:  నిరుద్యోగులకు ఉచితంగా ‘వెయిట్ లాస్’ టీకాలు.. యూకేలో కొత్త పథకం, వాళ్లకే ఎందుకు?

Related News

Anga Tribe: మరణించిన వారిని ఇంకా మమ్మీలుగా మారుస్తున్న తెగ, ఎలా మారుస్తారో తెలిస్తే అవాక్కయిపోతారు

Home Remedies For Hair: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

Dates For Hair: ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది తెలుసా ?

Cough: ఎంతకీ దగ్గు తగ్గడం లేదా.. వీటితో వెంటనే ఉపశమనం

Homemade Rose Water: ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Egg Potato Omelette: ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఇలా వేసి చూడండి, మీ పిల్లలకు ఈ బ్రేక్ ఫాస్ట్ తెగ నచ్చేస్తుంది

Haldi adulteration: మీరు ఇంట్లో వాడే పసుపు మంచిదేనా లేక కల్తీదా? పసుపు కల్తీని ఇలా ఇంట్లోనే చెక్ చేయండి

Big Stories

×