EPAPER

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు (Sunrishers hyderabad) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ జట్టు కీలక మెంటర్, బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ( Dale Steyn ) రాజీనామా చేయడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కీలక ప్రకటన కూడా చేశాడు డేల్ స్టెయిన్ ( Dale Steyn ). గత కొన్ని సంవత్సరాలుగా తనకు హైదరాబాద్ జట్టు యాజమాన్యం… మంచి అవకాశాన్ని ఇచ్చిందని… కానీ ఇప్పుడు నేను జట్టు నుంచి వెళ్ళిపోతున్నట్లు తెలిపాడు.


Blow for Sunrisers Hyderabad Dale Steyn announces SHOCKING exit as bowling coach

కొన్ని పర్సనల్ కారణాలవల్ల హైదరాబాద్ జట్టు {Sunrishers hyderabad) బౌలింగ్ కోచ్ పదవికి దూరమవుతున్నట్లు తెలిపాడు. తనకు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చిన కావ్య పాపకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపాడు డేల్ స్టెయిన్ ( Dale Steyn ). అంతేకాదు.. SA 20 టోర్నమెంట్ లోని హైదరాబాద్ జట్టుకు మాత్రం సేవలు అందిస్తానని తెలిపాడు. ఐపీఎల్ లోని హైదరాబాద్ జట్టుకు మాత్రం దూరంగా ఉంటానని వివరించాడు. ఐపీఎల్ టోర్నమెంట్ లోనే ఎస్ఆర్హెచ్ టీం చాలా బలమైందని తెలిపాడు.

Also Read: Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!


ఇది ఇలా ఉండగా హైదరాబాద్ జట్టుకు గతంలో బౌలర్గా పనిచేశాడు డేల్ స్టెయిన్ ( Dale Steyn ). అయితే తాను క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో…మళ్లీ అదే హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా నియామకమయ్యాడు. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ ఓనర్ కావ్య పాప కూడా…డెల్ స్టేన్ కు మంచి అవకాశాలు ఇచ్చింది.హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం ఇంత బలంగా ఉండడానికి కూడా కారణం… డేల్ స్టెయిన్ ( Dale Steyn )నని చెప్పవచ్చు.

ఇక బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ( Dale Steyn ) తప్పుకోవడంతో అతని స్థానంలో … న్యూజిలాండ్ కు సంబంధించిన మాజీ బౌలర్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా రిటెన్షన్ ప్రక్రియకు అక్టోబర్ 31వ తేదీ వరకు టైం ఉంది.ఆలోపు రిటెన్షన్ లిస్టును ఐపీఎల్ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రాంచైజీలు. దీంతో ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్ లిస్టును తయారు చేస్తున్నారు కావ్య పాప.

Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఈసారి క్లాసెన్ కు 23 కోట్లు ఇవ్వాలని కావ్య పాప నిర్ణయం తీసుకున్నారట. కమ్మిన్స్, హెడ్, నితీష్ రెడ్డి, అలాగే అభిషేక్ శర్మాను రిటైన్ చేసుకోనుంది కావ్య పాప. బౌలర్లలో భువనేశ్వర్ ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కచ్చితంగా టోర్నమెంట్ కొట్టాలని కావ్య పాపా… ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో ఫైనల్ వరకు వెళ్లి చతికల పడింది హైదరాబాద్ జట్టు. కేకేఆర్ జట్టు చేతిలో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి… ఇంటిదారి పట్టింది హైదరాబాద్.

Related News

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Big Stories

×