EPAPER

Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

హమాస్ టార్గెట్ గా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న వైమానిక దాడులు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. హమాస్ ఉగ్ర సంస్థను కూకటివేళ్లతో సహా పెకిలించివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గడిచిన ఏడాదిగా సాగిస్తున్న భీకర దాడుల్లో గాజాలో పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. వైమానిక దాడులు ముమ్మరంగా కొనసాగించడంతో గాజాలోని పాలస్తీనా వాసులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎటు చూసిన శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి.


శవాలను పీక్కుతింటున్న కుక్కలు

గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారి శవాలకు కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించే పరిస్థితులు లేవు. ఆకలితో అలమటిస్తున్న కుక్కలు ఆ శవాలను పీక్కుతింటున్నాయి. కనీసం మృతదేహాలు ఎవరివి అనేది గుర్తుపట్టే పరిస్థితి కనిపించడంలేదంటున్నారు గాజా నార్త్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చీఫ్ ఫేర్స్ అఫానా. “ఆకలితో ఉన్న వీధి కుక్కలు ఎక్కడికక్కడ పడి ఉన్న శవాలను పీక్కుతింటున్నాయి. మృతదేహాలను గుర్తించడం చాలా కష్టంగా ఉంది. ఉత్తర గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ దళాలు వారిపై దాడులకు దిగుతోంది. పాలస్తీనా వాసుల జీవితాలకు సంకేతంగా ఉన్న దేనినీ వదలడం లేదు. పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. మా పనులు కూడా చేయలేకపోతున్నాం. ఉత్తర గాజాలో జరుగుతున్న మారణహోమం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది” అని వెల్లడించారు.


గత ఏడాది ఇజ్రాయెల్ పై హమాస్ దాడి

ఇప్పుడు జరుగుతున్న మారణహోమానికి అసలు కారణం హమాస్ మొదలుపెట్టిన దాడి. గత ఏడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై హమాస్ ఉగ్రమూకలు దాడి చేశాయి. సుమారు 1200 మందిని చంపేశాయి. మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. గాజాలోని హమాస్ కేంద్రాలను టార్గెట్ చేసి వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు సుమారు 43 వేల మంది చనిపోయారు. సుమారు లక్ష మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 65 మంది పాలస్తీనా వాసులు చనిపోయినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.

గాజాలో పెరుగుతున్న ఆకలి చావులు

అటు పాలస్తీనాలో శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన UNRWA ఏజెన్సీ చీఫ్ ఫిలిప్ లాజారిని కీలక విషయాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ రెడ్ లైన్స్ క్రాస్ చేసిందని వెల్లడించారు. “ప్రస్తుతం పాలస్తీనాలో పౌరులుఏ ఆకలితో అలమటిస్తున్నారు. వారిని అలా వదిలి వేయడం మినహా ఏం చేయలేకపోతున్నాం. గాజాలో ఇజ్రాయెల్ రెడ్ లైన్స్ క్రాస్ చేసింది. యుద్ధ పరిస్థితులను నిలువరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత వాతావరణం దారుణంగా మారింది. ప్రజలు రోగ నిరోధక శక్తిని కోల్పోతున్నారు. దానికి కారణం సరైన ఆహారం లేకపోవడం. కనీసం శరణార్థులకు ఆహారం అందించే పరిస్థితులు కూడా లేదు. యుద్ధం కారణంగా ఆకలి చావులు రోజు రోజుకు పెరుగుతున్నాయి” అని ఫిలిప్ తెలిపారు.

Read Also: భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

Related News

Gurupatwant Pannun: ‘ఖలీస్తాన్ ఉగ్రవాది’ హత్యాయత్నం కేసులో నిందితుడిగా భారత ఇంటెలిజెన్స్ అధికారి.. అమెరికా ఆరోపణలు

Yahya Sinwar Kamala Harris: ‘యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవాలి’.. ఇజ్రాయెల్‌కు కమలా హారిస్ సూచన

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Oswal Daughter Uganda: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’

Justin Trudeau Nijjar Killing: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు

Lawrence Bishnoi: భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

Big Stories

×