EPAPER

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Lowest Totals: టీమిండియా (Team india)వర్సెస్ న్యూజిలాండ్ (new Zealand)జట్ల మధ్య బెంగళూరు (Benguluru) వేదిక గా మొదటి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి రోజు వర్షం కారణంగా రద్దు కాగా… రెండవ రోజు అంటే ఇవాళ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఇందులో టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న రోహిత్ శర్మ… అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా బ్యాట్స్మెన్లు మొత్తం… అత్యంత దారుణమైన ప్రదర్శనను కనపరిచారు.


రిషబ్ పంత్ అలాగే జైష్వాల్ మినహా.. ఏ ఒక్కరు డబుల్ డిజిట్ దాటలేకపోయారు. ఐదుగురు ప్లేయర్లు డక్ ఔట్ అయ్యారు. విరాట్ కోహ్లీ (Virat Kohli), సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ అలాగే రవీంద్ర జడేజా (Jadeja)ఈ ప్లేయర్ లందరూ… డక్ అవుట్ కావడం జరిగింది. దీంతో 46 పరుగులకే టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ముగించేసింది. అటు న్యూజిలాండ్ బౌలర్లు రెచ్చిపోవడంతో… ఏ ఒక్క టీమిండియా బ్యాట్స్మెన్ కూడా… ఆడ లేక పోయారు.

Also Read: Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!


అయితే ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో ఇలా అతి తక్కువ స్కోరుకు.. టీమిండియా ఆల్ అవుట్ కావడం కొత్తేమీ కాదు. ఆడి లైట్ లో ఆసిస్ చేతిలో కూడా 36 పరుగుల కి టీమిండియా ఆల్ అవుట్ అయింది. గతంలో 1987 సంవత్సరంలో వెస్టిండీస్ పైన.. 75 పరుగులకే టీమిండి ఆల్ అవుట్ కావడం జరిగింది. ఇక ఇప్పుడు.. బెంగళూరు వేదికగా 46 పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయింది.

Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఇక ఇప్పటివరకు టెస్టుల్లో అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్ల వివరాలు పరిశీలిస్తే… 26 పరుగులకు 1955లో న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ (England) వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య 1886 లో టెస్ట్ జరగగా ఆ సమయంలో సౌతాఫ్రికా (South Africa) 30 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అలాగే…1924 సంవత్సరంలోఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో…సఫారీలు మరోసారి 30 పరుగులకు అలౌట్ అయ్యారు.

1899 లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ లో కూడా… సఫారీలు 35 పరుగులకు అలౌట్ అయ్యారు. ఇక 1932లో… ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి సఫారీలు 36 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. ఇక 1902 లో ఇంగ్లాండ్ చేతిలో 36 పరుగులకే ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. అలాగే 2020 సంవత్సరంలో టీమిండియా… ఆస్ట్రేలియా చేతిలో… 36 పరుగులకే ఆల్ అవుట్ కావడం జరిగింది. 2019 సంవత్సరంలో ఐర్లాండ్ కూడా.. ఇంగ్లాండ్ చేతిలో 38 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 1946లో ఆస్ట్రేలియా చేతిలో… న్యూజిలాండ్ 42 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక ఇప్పుడు… 46 పరుగులకు న్యూజిలాండ్ చేతిలో టీమిండియా చిత్తుచిత్తు అయింది.

Related News

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Big Stories

×