EPAPER

Top IT Companies : యాపిల్, గూగుల్​ టు ఫేస్​బుక్​, ఇన్​స్టా – ఈ 8 బడా సంస్థల అసలు పేర్లు తెలుసా?

Top IT Companies : యాపిల్, గూగుల్​ టు ఫేస్​బుక్​, ఇన్​స్టా – ఈ 8 బడా సంస్థల అసలు పేర్లు తెలుసా?

Top IT Companies : పలు కారణాలతో వ్యక్తుల నుంచి సంస్థల వరకు పేర్లను మార్చడం సహజమే. పేరు పలకడానికి కష్టంగా ఉందనో, అదృష్టం కలిసొస్తుందనో, లేదంటే పేరు నచ్చకనో ఇలా రకరకాల కారణాలతో చాలా మంది పేర్లను మార్చడం లేదా పేర్ల ను మార్చుకోవడం చేస్తుంటారు. అలా టెక్​కు సంబంధించిన బడా కంపెనీలు కూడా తమ సంస్థల పేర్లను పలు సందర్భాల్లో మార్చుకున్నాయి. వారిలో దిగ్గజ కంపెనీలైనా యాపిల్​, అమెజాన్, సోనీ, గూగుల్, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్ బుక్​ వంటివి కూడా ఉన్నాయి. మరి ఇంతకీ వాటి అసలు పేర్లు ఏంటి? మొదట వాటిని ఏమని పిలిచేవారు? ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.


అమెజాన్ – ప్రముఖ ఇ కామెర్స్ ప్లాట్​ఫామ్ అమెజాన్ ఒరిజినల్ నేమ్ ‘కదబ్రా’. జెఫ్ బెజోస్ తన సంస్థకు ‘అబ్రకదబ్రా’లోని ‘కదబ్రా’ను పెట్టారు. అయితే, కదబ్రా అని ఫోన్​లో చెప్పినప్పుడు కడవర్ (శవం) గా వినిపిస్తుందని జెఫ్​ లాయర్ చెప్పారట. దీంతో ‘అమెజాన్’ గా మార్చి పిలవడం ప్రారంభించారు.

యాపిల్ – యాపిల్​ స్టాటస్ సింబల్​కు బ్రాండ్ అంబాజిడర్​. యాపిల్ సంస్థ మొదట్లో కంప్యూటర్స్​ను తయారు చేసింది. అందుకే ‘యాపిల్ కంప్యూటర్స్’ అని మొదట పిలిచేవారు. కానీ ఆ తర్వాత అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్లను ఆ సంస్థ తయారు చేయడం ప్రారంభించింది. అందుకే 2007 నుంచి దీన్ని ‘యాపిల్’ ​గా పిలవడం మొదలుపెట్టారు.


గూగుల్ – ఈ సెర్చ్ ఇంజిన్​కు 1996 లో ‘బ్యాక్ రబ్’ అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత పేరు నచ్చక మార్చారు. గూగోల్ (1 పక్కన 100 సున్నాలుండే సంఖ్య)’ అని పెట్టారు. అది క్రమంగా ‘గూగుల్’ ​గా మారిపోయింది.

ALSO READ : 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ – ఓరి బాబాయ్​.. రూ.14 వేలకే బ్రాండెడ్​​ స్మార్ట్ ఫోన్​

సోనీ – సోనీ కంపెనీ అసలు పేరు టోక్యో షుషిన్ కొగ్యో. వరల్డ్​ మార్కెట్​లో వినియోగదారులకు ఈ పేరు పలకడం బాగా ఇబ్బందిగా ఉండటం వల్ల దీని పేరును సోనీగా మార్చారు. 1958 లో ఇది జరిగింది.

మెటా – ఫేస్​బుక్​ పేరు ఈ మధ్యే మెటాగా మార్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ఏఐ, వర్చువల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంతో ఫేస్ ​బుక్​ పేరును మార్చి మెటాగా పెట్టారు.

ఇన్​స్టాగ్రామ్​ – మొదటగా ‘బార్బన్’ పేరుతో ఓ వెబ్​సైట్​ ఉండేది. 2010లో దాన్ని యాప్​ గా తీసుకొచ్చారు. అప్పుడు ఇన్​స్టాగ్రామ్​గా నామకరణం చేశారు. ఇన్​స్టంట్​ కెమెరా, టెలిగ్రామ్ పదాల నుంచి ఈ పేరును క్రియేట్ చేశారు.

స్నాప్ చాట్ – స్మాప్​ చాట్​ను మొదటగా ‘పికాబూ’ అని పిలిచేవారు. అప్పటికే ఈ పేరును ఓ కంపెనీ ట్రేడ్​ మార్క్ చేసుకుంది. తమ పేరును మార్చుకోవాలంటూ నోటీసులు పంపింది. దీంతో పికాబూ కాస్త స్నాప్ చాట్​గా మారిపోయింది.

ఎక్స్ – సోషల్​ మీడియా ప్లాట్​ ఫామ్​ ట్విటర్​ను ఎలాన్ మస్క్​ కొనుగోలు చేశారు. అందులో చాలా మార్పులు తీసుకొచ్చారు. అందుకే ట్విటర్​ను ‘X’గా మార్చేశారు. వెబ్​ సైట్​ మాత్రం ‘ట్విటర్’ గానే కొనసాగుతోంది.

Related News

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Lunar Space Station: చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

Vivo Y19s Mobile: వివో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే !

Indian Mobile Number : భారత్​లో ఫోన్ నెంబర్లకు +91 కోడ్ ఇచ్చింది అందుకే – ఈ విషయాలు మీకు తెలుసా?

Readmi Note 13 5G : 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ – ఓరి బాబాయ్​.. రూ.14 వేలకే బ్రాండెడ్​​ స్మార్ట్ ఫోన్​

Redmi A4 5G : రెడ్ మీ అరాచకం.. స్నాప్ డ్రాగన్ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ మెుబైల్ మరీ అంత చీపా!

Big Stories

×