EPAPER

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

ఆధునిక మనిషికి అర్థంకాని అంశాలు భూమిపై చాలానే ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, వాటి రహస్యాలను కనుక్కోవడానికి కాస్త సమయం పట్టొచ్చు అంతే. కానీ, మనిషికి అంతుబట్టిని చాలా విషయాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దశాబ్ధాలుగా.. ఆ మాటకొస్తే.. శతాబ్ధాలుగా.. గ్రహాంతరవాసులు ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నాడు మనిషి. ఈ అనంతమైన విశ్వంలో మనిషిలాంటి, లేదంటే అంతకుమించిప మేధోశక్తి కలిగిన జీవులు ఉండే అవకాశాల కోసం జల్లెడ పడుతున్నారు. కానీ, ఇప్పటికీ వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలు శాస్త్రవేత్తలకు లభించలేదు. అయితే, వచ్చే నెలలో ఈ పరిస్థితి మారబోతోందని.. బీబీసీ, నాసాతో కలిసి పనిచేసిన ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్ సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతర వాసుల ఆనవాళ్లు దొరికాయని, త్వరలో శాస్త్రవేత్తలు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేయొచ్చని అందరికీ షాకిచ్చారు.

అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేసిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ సైమన్ హాలండ్ చెప్పిన వివరాల ప్రకారం, భూమికి సంబంధించిన టెలిస్కోప్‌లు ఇప్పటికే గ్రహాంతర జీవుల సంకేతాలను గుర్తించాయిని వెల్లడించారు. అయితే, ఈ వివరాలను రాబోయే నెల రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశముందని తెలిపారు. గ్రహాంతర జీవులు పంపె సంకేతాలను వెతకడానికి నిధులు సమకూర్చిన మార్క్ జుకర్‌బర్గ్ “బ్రేక్‌త్రూ లిసన్ ప్రాజెక్ట్‌”తో పని చేస్తున్న అధికారిక వ్యక్తుల నుండి హాలండ్ ఈ సమాచారాన్ని పొందినట్లు వెల్లడించారు. సైమన్ హాలండ్ ప్రకారం, గ్రహాంతరవాసుల నుండి వచ్చిన ఈ సిగ్నల్స్ ఆస్ట్రేలియాలోని పార్క్స్ టెలిస్కోప్ ద్వారా సేకరించి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గ్రహాంతర జీవుల టెక్నాలజీ నుండి వచ్చే సంకేతాలను కనుగొనే లక్ష్యంతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో చేపట్టిన పరిశోధన ఫలితంగా బయటపడినట్లు హాలాండ్ చెప్పారు.


Also Read:  యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.. పార్క్స్ టెలిస్కోప్‌ను ఉపయోగించి 2019 ఏప్రిల్ 19న, మానవేతర సాంకేతిక సిగ్నల్స్‌ను పొందిన సాక్ష్యాలను కనుగొన్నట్లు హాలండ్ పేర్కొన్నారు. ఆయన వాదనలను బట్టి, భూమికి సుదూరం నుండి గ్రహాంతర వాసులు ఈ తరంగాలను పంపాయి. అయితే, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను ధృవీకరించడానికి కొంత సమయం తీసుకున్నారనీ.. దీనికి కారణం, ఆ వచ్చిన సంకేతాలు చాలా తక్కువ స్థాయిలో ఉండటమేనని వెల్లడించారు. వంద మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ రేడియో టెలిస్కోప్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ సమాచారం హాలండ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2021లో, బ్రేక్‌త్రూ లిసన్ సదరు రేడియో సిగ్నల్‌ను గుర్తించినట్లు హాలండ్ వెల్లడించారు. అయితే, ఈ సంకేతాలు.. భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అంతరిక్షంలోని ప్రాక్సిమా సెంటారీ చుట్టు పక్కల ప్రాంతం నుండి వచ్చాయని ప్రాజెక్ట్ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే, తర్వాత వాటిని తప్పుడు అలారం అని భావించినప్పటికీ.. తదనంతర పరిశోధనల్లో ఈ సిగ్నల్ ఒక విద్యుదయస్కాంత వర్ణపటానికి చెందినదనీ.. ఎంతో అభివృద్ధి చెందిన గ్రహాంతరవాసుల నాగరికత నుండి వచ్చి ఉండొచ్చని సైమన్ హాలండ్ వెల్లడించారు.

అయితే, ఎప్పటి నుండో గ్రహాంతరవాసులను ఎవరు మొదట కనిపెడతారా అనే పోటీలో చైనా కూడా పరుగులు పెడుతుందనీ.. అందుకే, సంచలనాత్మకమైన ఈ ఆవిష్కరణను బహిర్గతం చేసే రేసులో కొంత పోటీ ఉండవచ్చని హాలండ్ చెబుతున్నారు. చైనీస్ శాస్త్రవేత్తలు, దీన్ని వారి స్వంత ఆవిష్కరణగా చెప్పుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు హాలండ్ వెల్లడించారు. ఏలియన్లు ఉన్నారనే వార్త బయటకి తెలిసి కొన్ని గంటలే అయినప్పటికీ.. అధికారికంగా ధృవీకరించే రేసులో చైనా అందర్నీ ఓడించాలని చూస్తుందని.. హాలండ్ ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చైనా దగ్గరున్న ఐదు వందల మీటర్ల ఎపర్చరు గోళాకార టెలిస్కోప్ ప్రోగ్రామ్‌, స్పాట్‌ను ప్రస్తావిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. ఫాస్ట్ అనేది భూమిపై అతిపెద్ద టెలిస్కోప్. ఇది అరేసిబో అబ్జర్వేటరీని కూడా అధిగమించిన సామర్ధ్యంతో పనిచేస్తుంది. కాస్మోస్‌లోని సుదూర ప్రాంతాల నుండి చాలా కఠినమైన సంకేతాలను కూడా ఇది గుర్తించగలదు. కనుక, చైనా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

South Korea Vs North Korea: యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

TDP VS Janasena: భగ్గుమన్న నిడదవోలు.. కూటమిలో కొట్లాట?

MP Bharath Vs Ganta Srinivasa Rao: బాలకృష్ణ చిన్నల్లుడికి గంటా షాక్.. అసలు కథ ఇదే

Big Stories

×