EPAPER

Natural Hair Dyes: తెల్లజుట్టు నల్లగా మారిపోవాలా ? ఇంట్లోనే ఈ హెయిర్ డై తయారు చేసుకోండి

Natural Hair Dyes: తెల్లజుట్టు నల్లగా మారిపోవాలా ? ఇంట్లోనే ఈ హెయిర్ డై తయారు చేసుకోండి

Natural Hair Dyes: వయస్సు పెరిగే కొద్దీ జుట్టు రంగు మారడం సర్వసాధారణంగా మారింది. ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే జుట్టు రంగులోకి మారడం ప్రారంభం అవుతోంది.దీనికి కారణం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే.చాలా మంది జుట్టు తెల్లగా మారినప్పుడు తిరిగి నల్లగా మారడానికి మార్కెట్‌లో లభించే హెయిర్ డైలను వాడతారు.


అయితే అలాంటి ఉత్పత్తులలో చాలా వరకు రసాయనాలు ఉంటాయి. అంతే కాకుండా ఇవి జుట్టు రాలడానికి కూడా కారణమవుతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు మనం ఇంట్లోనే సహజసిద్ధమైన హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు. ఇవి మీ జుట్టును నల్లగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

మార్కెట్‌లో లభించే హెయిర్ కలర్ లను జుట్టుకు అప్లై చేయడం ద్వారా, 20-25 రోజులలోనే తలపై జుట్టు మళ్లీ తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. కానీ ఇంట్లోనే సహజమైన హెయిర్ డైలు తయారు చేసుకుని వాడటం వల్ల రెండు నెలల పాటు జుట్టు రంగు అలాగే ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేచురల్ హెయిర్ డై ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


నేచురల్ హెయిర్ డై తయారుచేసే విధానం:
మీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి మీరు ఇంట్లోనే నేచురల్ హెయిర్ డైని తయారు చేసుకోవాలనుకుంటే. దీని కోసం హెన్నా, ఇండిగో ( నీలిమందు చెట్టు యొక్క ఆకులు) పెరుగు వాడండి.

Also Read: జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు నేచురల్ హెన్నా తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఇదే పేస్ట్ లో 1 టేబుల్ స్పూన్ నీలిమందు ఆకుల పొడిని బాగా కలపండి.అందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇలా తయారుచేసిన ఈ పేస్ట్‌ని జుట్టు మూలాల నుండి జుట్టు మొత్తానికి అప్లై చేసి 2 గంటల పాటు అలాగే ఉంచండి. దీని తరువాత, జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా జుట్టు ముదురు నలుపు రంగు లోకి మారడం ప్రారంభమవుతుంది.

జుట్టుకు నేచురల్ హెయిర్ డైని అప్లై చేసిన తర్వాత, వచ్చే 24-28 గంటల వరకు జుట్టుకు షాంపూ లేదా కండీషనర్‌ని ఉపయోగించవద్దు.ఈ హెయిర్ డై జుట్టు రంగును బలపరుస్తుంది. అంతే కాకుండా సుమారు 2 నెలల వరకు జుట్టు రంగు మారదు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Big Stories

×