EPAPER

Pushpa 2 : బన్నీ బావ కోసం రంగంలోకి స్టార్ హీరో… ఆ క్రేజీ ప్లాన్ వర్కవుట్ అయితే రికార్డులు గల్లంతే

Pushpa 2 : బన్నీ బావ కోసం రంగంలోకి స్టార్ హీరో… ఆ క్రేజీ ప్లాన్ వర్కవుట్ అయితే రికార్డులు గల్లంతే

Pushpa 2 : త్వరలోనే “పుష్ప 2” (Pushpa 2) సునామీ రాబోతోంది. తుఫానుకు ముందు ఉండే సైలెన్స్ లా ఇంకా మేకర్స్ సినిమా ప్రమోషన్లను షురూ చేయలేదు. కానీ తాజాగా ఈ సినిమా మరో 50 రోజుల్లో రిలీజ్ కాబోతోంది అంటూ డిసెంబర్ 6న “పుష్ప 2” (Pushpa 2)ను తగ్గకుండా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఈ లోపు ఓ స్టార్ హీరో పమోషన్స్ లో హెల్ప్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.


బన్నీ కోసం రంగంలోకి బావ

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు స్నేహితులు కావడం అనేది సర్వసాధారణం. అల్లు అర్జున్ (Allu Arjun), తారక్ (Jr NTR) విషయంలో అయితే అది హద్దులు దాటి బావ బావ అని పిలుచుకునే దాకా వెళ్ళింది. ఇంత క్లోజ్ గా ఉండే వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఓపెన్ గా ఒకరి సినిమాకు ఒకరు ప్రమోషన్స్ చేసింది లేదు. తాజాగా ఆ లోటును తీర్చుబోతున్నారని తెలుస్తోంది. తారక్ ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ కోసం ఓపెన్ గా సపోర్ట్ చేయడమే కాకుండా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2)పై హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తారక్ సపోర్ట్ తోడైతే ఆ తుఫాను తీరం దాటే దాకా బాక్స్ ఆఫీస్ బీభత్సం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. రీసెంట్ గా ‘దేవర’ మూవీ తో సోలోగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్ ను బన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రమోషన్స్ కోసం రంగంలోకి దింపబోతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ (Pushpa 2) ట్రైలర్ లాంచ్ ను ముంబైలో జరిగే ఈవెంట్లో తారక్ చేతుల మీదుగా జరపబోతున్నారని, దానికి ఇప్పటికే తారక్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని అంటున్నారు. అయితే బన్నీ కోసం బావ రంగంలోకి తారక్ దిగబోతున్నాడు అనే వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.


వరుస అప్డేట్స్ తో పూనకాలు…

సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతుండడంతో మేకర్స్ అప్డేట్స్ తో ఫాన్స్ కి పూనకాలు తెప్పించే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2 ‘ (Pushpa 2) మూవీ నుంచి ట్రైలర్ ను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ను ‘కంగువ’ (Kanguva) మూవీ థియేటర్లలో రిలీజ్ చేస్తారని టాక్ నడిచింది. ఆ సినిమా కంటే ‘పుష్ప 2’ (Pushpa 2)కే ఎక్కువగా హైప్ ఉండడంతో ఎన్టీఆర్ (Jr NTR)ను రంగంలోకి దించితే అటు ప్రమోషన్స్ తో పాటు ఇటు బజ్ కూడా పెరుగుతుంది అన్న ఆలోచనలో ఉన్నారట సుకుమార్, బన్నీ. ఇక ఈ ట్రైలర్ లంచ్ ఈవెంట్ తో పాటు ఐటమ్ సాంగ్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ ఫైనల్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టబోతున్నారని, ఈ గ్యాప్ లో పాటను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. ఏదేమైనా బన్నీ కోసం తారక్ ప్రమోషన్లలో పాలుపంచుకుంటే రికార్డులు గల్లంతవ్వడం ఖాయం.

Related News

Lucky Bhaskar,KA: దీపావళి సినిమాకు అమావాస్య సెంటిమెంట్

Shruthi Haasan : మరో బాయ్ ఫ్రెండ్ వేటలో శృతి… కాబోయే వాడిలో ఈ లక్షణం ఉండాలట

Sid Sriram: ఒక్క రోజు రెమ్యునరేషన్ తెలిస్తే షాక్.. ఈ డిమాండ్ మాములుగా లేదుగా..?

Rewind Movie Review : రివైండ్ మూవీ రివ్యూ

Pushpa 2 : థియేట్రికల్ రైట్స్ కు భారీ ధరలు కోట్ చేస్తున్న నిర్మాతలు… చేతులెత్తేస్తున్న బయ్యర్స్

Vijay Devarakonda : దేవరకొండ కాళ్లపై పడ్డ కేరళ అభిమాని… సినిమాలను మాత్రం హిట్ చేయరు

Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం… ‘బిగ్ బాస్ ‘ షూటింగ్ పరిస్థితి ఇదీ!!

Big Stories

×