EPAPER

South Korea Vs North Korea: యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

South Korea Vs North Korea: యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

South Korea Vs North Korea War: ఒకవైపు, ఈస్ట్ యూరప్.. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాలు ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తుంటే.. ఇప్పుడు ఈస్ట్ ఆసియాలో కొరియా కలవర పెడుతోంది. ఉత్తర కొరియా లీడర్ కిమ్ చేస్తున్న చర్యలు యుద్ధానికి సిద్ధమైనట్లే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ కొత్త కొత్త ఆయుధాలను తయారు చేసిన ఉత్తర కొరియా.. తాజాగా, దక్షిణ కొరియాకు వెళ్లే రైలు, రోడ్డు మార్గాలను బాంబులతో పేల్చేసింది. మరోవైపు, కొత్తగా 14 లక్షల మందిని సైన్యంలో చేర్చుకుంది. ఈ పరిణామాలన్నీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ జోరుమీద ఉన్నట్లు కన్ఫామ్ చేస్తున్నాయి. మరి, మరో యుద్ధం షురా అవుతుందా..? కొరియా అల్లకల్లోలం కానుందా..? కిమ్ చేష్టలు దేనికి సూచన అనుకోవాలి..?


తూర్పు యూరప్‌లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై రెండేళ్లు దాటింది. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయేల్-హమాస్ యుద్ధం కూడా ఏడాది క్రాస్ అయ్యి, మధ్య ప్రాచ్ఛం మొత్తం పాకేలా ఉంది. మరోవైపు, మూడో ప్రపంచ యుద్ధం అల్రెడీ మొదలయ్యిందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నార్త్ కొరియా-సౌత్ కొరియాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య యుద్ధం తప్పదనే పరిణామాలు కనపడ్డాయి. మళ్లీ కాస్త సద్దుమణినట్లే కనిపించినా.. ఉత్తర కొరియా చేష్టలతో కలవరం మాత్రం తగ్గలేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశంలో అణుబాంబుల ప్రయోగాలను రెండింతలు పెంచిన తర్వాత.. దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల, వందల కొద్దీ చెత్తతో నిండిన బెలూన్లను దక్షిణ కొరియాలో వదిలిన కిమ్ జోంగ్.. తాజాగా, దక్షిణ కొరియాకు వెళ్లే రైలు, రోడ్డు మార్గాలను బాంబులతో పేల్చేశాడు. ఉత్తర కొరియా నుండి దక్షిణ కొరియాకు ఎలాంటి ఉపరితల మార్గాలు లేకుండా ఆంక్షలు విధించాడు. అంతేనా, ఒక్క వారం వ్యవధిలోనే తన ఆర్మీలోకి 14 లక్షల మంది కొత్త సైన్యాన్ని రిక్రూట్ చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే.. ఈస్ట్ ఏషియాలో కొరియా యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.


ఉత్తర కొరియాలోని విద్యార్థులు, యూత్ లీగ్ అధికారులతో సహా సుమారు 14 లక్షల మంది యువత కొత్తగా సైన్యంలో చేరినట్లు అక్టోబర్ 16న ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. విప్లవాన్ని మరింత ఉదృతం చేస్తూ.. ఆయుధాలతో శత్రువును నాశనం చేసే పవిత్ర యుద్ధంలో పోరాడాలని ఉత్తర కొరియా యువకులు నిశ్చయించుకున్నారని KCNA నివేదిక పేర్కొంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు ఎక్కువగా నడుస్తున్న సమయంలో కేవలం రెండు రోజుల్లోనే దేశంలోని కొరియన్ పీపుల్స్ ఆర్మీలో పది లక్షల మంది యువకులు చేరారని ఉత్తర కొరియా ప్రకటించింది. గతేడాది, ఉత్తర కొరియా మీడియా కథనాల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి స్వచ్ఛందంగా తమ పౌరులు సైన్యంలో చేరడానికి ముందుకు వస్తున్నారని వెల్లడించగా.. ఇప్పుడు, కొత్తగా మరో 14 లక్షల మంది చేరినట్లు పేర్కొన్నారు.

Also Read:  భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

అలాగే, ఉత్తర, దక్షిణ కొరియాల పటిష్టమైన సరిహద్దులో ఉన్న అంతర్-కొరియా రోడ్లు, రైలు మార్గాలను తాజాగా ఉత్తర కొరియా బాంబులతో పేల్చేసింది. కొరియా ద్వీపకల్పంలోని దక్షిణ భాగానికి అనుసంధానించబడిన రెండు ప్రధాన రహదారులు ఇందులో ఉన్నాయి. పశ్చిమ తీరంలో జియోంగుయ్ లైన్, తూర్పు తీరంలో డోంఘే లైన్‌లోని భాగాలు.. ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే రెండు ప్రధాన రహదారులు, రైల్వే లింకులను భారీ పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. ఇలా, ప్రయాణ మార్గాలను నాశనం చేయడం వల్ల పెద్దగా తేడా లేనప్పటికీ కిమ్ జోంగ్ దీన్నొక హెచ్చరిక సూచనగా పంపాలని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. నిజానికి, రెండు కొరియాలు ప్రపంచంలోని అత్యంత బలమైన సరిహద్దులలో ఒకటిగా విభజించబడ్డాయి. ఇరు దేశాల మధ్య రోడ్లు సంవత్సరాలుగా ఉపయోగంలో లేవు. అయితే, ఉత్తర కొరియా రాజధానిపైకి సియోల్ డ్రోన్‌లను పంపిందని ప్యోంగ్యాంగ్ ఆరోపించిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఉత్తర కొరియా రోడ్డు మార్గాలను పేల్చిన తర్వాత, ప్రతిస్పందనగా దక్షిణ కొరియా సైన్యం సైనిక సరిహద్దు రేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో కాల్పులు ప్రారంభించింది. ఉత్తర కొరియా సైన్యం కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అమెరికా సహకారంతో పూర్తిగా యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. దీనికి ముందు, ఈ ఏడాది మే నెల నుండి ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాలోకి చెత్తతో నిండిన వేల కొద్దీ బెలూన్‌లతో దాడి చేసింది. దీనితో, రెండు కొరియాల మధ్య ఘర్షణలు పెరుగుతూ వచ్చాయి. అయితే, దక్షిణ కొరియా పాలనకు వ్యతిరేకంగా కొందరు ఈ బెలూన్‌ ప్రయోగాలు చేసినట్లు ప్యోంగ్యాంగ్ పేర్కొంది. ఒక వేళ, యుద్ధం చెలరేగితే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మ్యాప్ నుండి దక్షిణ కొరియా తుడిచిపెట్టుకుపోతుందని ఉత్తర కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా యుద్ధాన్ని కోరుకుంటే, దాని ఉనికిని లేకుండా చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని KCNA నివేదిక వెల్లడించింది.

ఇక, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఇటీవల రెండు రకాల వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణుల విజయవంతంగా ప్రయోగించారు. వీటిలో ఒకటి “సూపర్-లార్జ్ కన్వెన్షనల్ వార్‌హెడ్” కాగా, మరొకటి, ఇంప్రూవ్డ్ క్రూయిజ్ క్షిపణి అని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఉత్తర కొరియా భద్రతకు బయటి శక్తులు తలపెట్టిన ముప్పుకు ప్రతిస్పందనగా ఈ పరీక్షలు జరినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ పరీక్షల్లో 4.5 టన్నుల సూపర్-లార్జ్ ట్రెడిషనల్ వార్‌హెడ్‌తో అమర్చిన ‘హ్వాసాంగ్‌ఫో-11-డా-4.5 క్షిపణులు’ ఉన్నట్లు KCNA తెలిపింది. ఇక, సాంప్రదాయ ఆయుధాల రంగంలో కూడా అణుశక్తిని బలోపేతం చేయడం, బలమైన సైనిక సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం, ఖండాతర ప్రమాదకర సామర్థ్యాన్ని కూడా పఠిష్టం చేస్తున్నట్లు కిమ్ వెల్లడించారు. అయితే, ఉత్తర కొరియా ఆయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నప్పటికీ ప్యోంగ్యాంగ్ వాటిని పట్టించుకోవట్లేదు. రష్యాతో ఆయుధ వాణిజ్యం జరగట్లేదని చెబుతూనే సైనిక సంబంధాలను బలపరుచుకుంటోంది.

Related News

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

TDP VS Janasena: భగ్గుమన్న నిడదవోలు.. కూటమిలో కొట్లాట?

MP Bharath Vs Ganta Srinivasa Rao: బాలకృష్ణ చిన్నల్లుడికి గంటా షాక్.. అసలు కథ ఇదే

Big Stories

×