EPAPER

Vettaiyan: ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన లైకా.. తాజా టికెట్ ధరలివే..!

Vettaiyan: ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన లైకా.. తాజా టికెట్ ధరలివే..!

Vettaiyan..కోలీవుడ్ ప్రముఖ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ టీ.జే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన చిత్రం వేట్టయాన్ – ద హంటర్. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)జైలర్ సినిమా తర్వాత నటించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి తోడు దసరా సందర్భంగా విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పించకపోవడంతో ప్రజలు గత్యంతరం లేక ఈ సినిమా చూశారనే వార్తలు కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు పని దినాలలో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి టికెట్ ధరలు తగ్గించినట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


తగ్గించిన టికెట్టు ధరలు ఇవే..

ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ వారు రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా ప్రదర్శించబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా దసరా సెలవులు ముగియడంతో అందరికీ అందుబాటులో ఉండేలా తెలంగాణలో ఈ సినిమా టికెట్ రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్ లలో రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్ లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ.110 గా టికెట్ రేట్లను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ధరలు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.ఫలితంగా కలెక్షన్లు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి టికెట్లు రేట్లు తగ్గడంతో ఆక్యుపెన్సీ కూడా పెరిగేటట్టు కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే అక్టోబర్ 18 వరకు ఎదురు చూడాల్సిందే.


వేట్టయాన్ తారాగణం..

ఇకపోతే ఈ సినిమా లో నటిస్తున్న భారీ తారాగణం విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ , రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతి యాక్టర్ కూడా తమ లెవెల్ కి మించి నటించారనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. లైకా ప్రొడక్షన్స్ కు చెందిన GKM తమిళ కుమారన్ , రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ పై M. షెన్ బాగమూర్తి నిర్మించారు.. న్యాయం, అధికారం, అవినీతి, విద్యా వ్యవస్థ, ఎన్కౌంటర్ , హత్య ఇతివృత్తాలను ఇందులో చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఇకపోతే రూ.240 కోట్లను అప్పుడే అధిగమించిన ఈ సినిమా తెలంగాణలో రేట్లు తగ్గించడంతో మరింత వసూలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రజినీకాంత్ సినిమా..

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా జైలర్ సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత అనారోగ్య పాలైన ఆయన ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కడుపులో పెద్ద రక్తనాళానికి శస్త్ర చికిత్స జరగగా అందులో భాగంగానే ఆయన వేట్టయాన్ ప్రమోషన్ కి హాజరు కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే సినిమా మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది.

Related News

Vijay Devarakonda : దేవరకొండ కాళ్లపై పడ్డ కేరళ అభిమాని… సినిమాలను మాత్రం హిట్ చేయరు

Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం… ‘బిగ్ బాస్ ‘ షూటింగ్ పరిస్థితి ఇదీ!!

Pushpa 2: ఉత్తరాంధ్రలో భారీ ధర.. ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే..!

Anee Master : జానీ గురించి అనీ మాస్టర్ ప్రెస్ మీట్… వెనకుండి ఇంత కథ నడిపించింది ఆ స్టార్ హీరోనా?

Anee Master : జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Big Stories

×