EPAPER

Marital Rape: భర్తపై రేప్ కేసు.. విచారణకు అంగీకరించిన ఢిల్లీ కోర్టు!

Marital Rape: భర్తపై రేప్ కేసు.. విచారణకు అంగీకరించిన ఢిల్లీ కోర్టు!

Marital Rape: దేశంలో ఇటీవల మారిటల్ రేప్ (భార్యపై భర్త అత్యాచారం) గురించి కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు మధ్య అంటే చర్చ జరిగింది. భార్యపై భర్త అత్యాచారం కేసు పెట్టినా విచారణకు స్వీకరించకూడదని కేంద్ర ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు చెప్పింది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు సుప్రీం కోర్టు తన అభిప్రాయం బహిర్గతం చేయలేదు. మరోవైపు ఒక ఢిల్లీ కోర్టులో ఇలాంటి కేసు ఒకటి విచారణకు రాగా.. దాన్ని కోర్టు స్వీకరించింది. 19 ఏళ్ల భార్యను ఒక 21 ఏళ్ల యువకుడు రేప్ చేసి హత్య చేశాడని.. ఈ కేసులో అత్యాచారం కూడా పరిగణించాలని పిటీషనర్లు కోరగా.. కోర్టు అంగీకరించింది.


ఈ కేసులో భారతీయ దండ్ సంహిత చట్టంలోని సెక్షన్ 376(2) అత్యాచారం, సెక్షన్ 366 ఒక మహిళను బలవంతంగా వివాహం చేసుకోవడం, 342 మహిళను బంధించి వేధించడం, 506 బెదిరించడం లాంటి ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టు అదేశాలతోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడం విశేషం. యువతి కుటుంబ సభ్యులు కోర్టులో పిటీషన్ వేసిన తరువాత కోర్టు పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొన్నారు.

Also Read:  ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!


వివరాల్లోకి వెళితే.. రోషన్ (21), రేణు (19 పేర్లు మార్చబడినవి) స్కూల్ లో కలిసి చదువుకొనే వారు. రేణుకు 13 సంవత్సరాలున్నప్పుడు రోషన్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. కొంతకాలం తరువాత రేణు కూడా అతడిని ప్రేమించింది. కానీ ఈ తరువాత రేణుకు ఇష్టలేకపోయినా ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో రేణు తల్లిదండ్రులు పోలీసులు ఆ సమయంలోనే ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ కేసులో రేణు అంగీకారం ఉందనే అనుమానంతో రోషన్ పై చర్యలు తీసుకోలేదు. రోషన్ కుటుంబం, రేణ కుటంబ సభ్యులను పిలిచి ఈ కేసులో పోలీసులు సంధి కుదిర్చారు.

అయితే ఆ తరువాత రోషన్ తాను ఇక రేణు భర్తనని వాదించేవాడు. దీంతో రేణు కూడా అతడితో డేటింగ్ చేసేది. ఇదంతా రేణు తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అలా 6 సంవత్సరాల తరువాత మార్చి 2024లో రేణుపై మరోసారి అత్యాచారం చేశాడని.. అయితే ఈసారి పోలీస్ కేసు భయంతో రేణుని బలవంతంగా తీసుకెళ్లి గుడిలో పెళ్లిచేసుకున్నాడని రేణు తల్లిదండ్రలు తెలిపారు. అయినా ఆ పెళ్లిని ఇరువైపులా అంగీకారం లభించలేదు. దీంతో రేణు, రోషన్ వేర్వేరుగా తమ తల్లిదండ్రుల వద్దనే ఉండేవారు. ఈ క్రమంలో మే 2024లో రేణు ఇక తాను తల్లిదండ్రులు ఇంట్లో ఉండడం సమంజసం కాదని రోషన్ తో వాదించింది. కానీ రోషన్ ఆమెను ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచన లేదు. రేణు ఒత్తిడి చేయడంతో ఆమెను చితకబాదాడు. ఆమె చావుబతుకుల్లో ఉండగా.. ఒక పబ్లిక్ పార్కు వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. కానీ ఆమెను పార్కులో ప్రజలు చూసి ఆస్పత్రికి తరలించారు. 15 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత రేణు కోలుకుంది.

ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రేణు తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. విషయం సీరియస్ అయింది. కానీ అప్పటికే రోషన్ పరారయ్యాడు. ఆ తరువాత మళ్లీ సెప్టెంబర్ 1 2024న రోషన్ తిరిగి వచ్చి మరోసారి రేణుతో గొడవపడ్డాడు. తనపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. కానీ ఈ సారి రేణు భయపడలేదు. దీంతో రోషన్ ఆమెను మరోసారి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. దీంతో రేణు, ఆమె తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టులో రోషన్ కు వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో కోర్టు సెప్టెంబర్ 21 పిటీషన్ విచారణకు స్వీకరించి.. ముందుగా పోలీసులను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కానీ అప్పటికే రేణు.. రోషన్ కొట్టిన దెబ్బల కారణంగా అనారోగ్యం పాలై మరణించింది. దీంతో రోషన్ పై రేప్, హత్య కేసు నమోదైంది. ఈ పిటీషన్ లో రోషన్ వివాహానికి ముందు ఫిబ్రవరి 2024లో తమ కూతురు రేణుపై అత్యాచారం చేశాడని.. ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించాలని రేణు తల్లిదండ్రులు తాజాగా పిటీషన్ లో కోరారు.

Related News

Karnataka MUDA ED Raids: కర్ణాటక సిఎంపై ఈడీ గురి.. మైసూరు ముడా ఆఫీసులో తనిఖీలు

Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?

Bihar Hooch : కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

Big Stories

×