EPAPER

Hyderabad Weather Updates: పెద్ద పెద్ద నగరాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ సేఫేనా?

Hyderabad Weather Updates: పెద్ద పెద్ద నగరాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ సేఫేనా?

Hyderabad Weather Updates: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా.. కానీ ఆ సూత్రం మన దగ్గర అది రివర్స్. వర్షం పడి.. వరదగా మారి, ఏరై పొంగినప్పుడు సహాయక చర్యలను ప్రభుత్వాలు చేస్తుంటాయి. కానీ ఆ వరద ముందు రాకుండా చేసేది ఎంత మంది? సిటీల్లో భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్ కామన్ అవుతున్నాయి. అసలు పెద్ద పెద్ద నగరాల్లోనే ఎందుకింత భారీ వర్షాలు కురుస్తున్నాయి? మేఘాలన్నీ అక్కడే ఎందుకు తిరుగుతున్నాయో  ఇప్పుడు తెలుసుకుందాం.


నగరాలకు, భారీ వర్షాలకు లింక్ ఏంటో తెలిసిపోయింది. ఈ రెండూ విడిచిపెట్టి ఉండలేవని క్లారిటీ వచ్చింది. ఇదేదో వట్టి ముచ్చట కాదు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ కొత్త స్టడీ చెబుతున్న విషయమిది. టెక్సాస్ వర్శిటీ పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 1,056 నగరాల్లో వర్షపాతం ఎలా ఉందో పరిశీలించారు. అందులో గుర్తించిందేంటంటే.. ఈ నగరాల్లో 60 శాతంపైగా వర్షం. వాటి చుట్టుపక్కల రూరల్ ఏరియాస్ కంటే ఎక్కువగా సిటీల్లోనే పడుతోందంటున్నారు. సో సిటీల్లో ఎక్కువ, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ వర్షం అన్న పరిస్థితి కనిపిస్తోంది.

వర్షం పడ్డప్పుడు నగరాలు స్పాంజ్ మాదిరిగా మారిపోతున్నాయి. స్పాంజ్ ను ఒక్కసారి ప్రెస్ చేస్తే నీళ్లు ఎలాగైతే బయటకొస్తాయో.. సేమ్ టూ సేమ్ సిటీల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే సిటీల్లో పెరిగిన వర్షపాతానికి తోడు.. రోడ్లన్నీ కాంక్రీట్, అలాగే తారుతో నిండి ఉంటే.. నీళ్లు ఇంకే చోటే లేకుండా పోతోంది. ఈ వర్షం నీళ్లన్నీ రోడ్లపైనే పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. పోనీ స్ట్రామ్ వాటర్ కెనాల్స్ సరిగా ఉన్నాయా అంటే అవీ లేవు. అన్నీ ఆక్రమణలు. కుచించుకుపోయిన పరిస్థితులే. ఇలాంటి పరిస్థితి తెలుసు కాబట్టే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉంటేనే అనుమతి ఇస్తామంటున్నారు. కనీసం ఎంతో కొంత నీళ్లు ఇంకుతాయి కదా.


నగరాల్లో వర్షాలు పెరగడానికి ఇంకిన్ని కారణాలను టెక్సాస్ వర్శిటీ పరిశోధకులు గుర్తించారు. ఎత్తైన భవనాలు ఉండటం, అవి గాలి వేగాన్ని నిరోధించడంతో బలమైన కదలిక ఏర్పడి, ఒత్తిడి పెంచుతుంది. మేఘాలు వర్షం కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు సిటీల్లో జనాభా ఎలాగూ భారీగానే ఉంటుంది. దీంతో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీస్ అయి వేడిని పెంచుతాయి. ఇవన్నీ క్లౌడ్ బరస్ట్ పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఏ నగరంలోనైనా కొంత భాగాన్ని మైక్రో మోడల్ ప్రాజెక్ట్‌గా టైం ప్లాన్‌తో సేఫ్ జోన్‌గా మార్చడానికి సాంకేతిక నిపుణులు, డెవలప్‌మెంట్ ప్లానర్‌లు, పర్యావరణవేత్తలు, నీటిపారుదల, స్ట్రక్చరల్ ఇంజనీర్‌లు ఇలా అందరూ కలిసి వస్తేనే కథ మారుతుంది. లేకపోతే చెన్నై, బెంగళూరు సీన్లే కనిపించడం ఖాయం.

Also Read: తెలంగాణ కేబినేట్ విస్తరణ.. వారికే ఛాన్స్, ఢిల్లీలో నేతల మకాం

ఈ సీజన్ లో ఇప్పటిదాకా హైదరాబాద్ లో భారీ వర్షం కురవలేదు కాబట్టి సేఫ్. లేకపోతే ఇక్కడ కూడా చెన్నై, బెంగళూరు సీన్లే కనిపించి ఉండేవి. ఎందుకంటే మన సిటీకి కొద్దిపాటి సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకునే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. చిన్న పాటి వర్షాలతో వాన నీళ్లు ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యాయి. కాబట్టి సేఫ్. కానీ హైదరాబాద్ లో వరద నీళ్లు, డ్రైనేజ్ వాటర్ వెళ్లేందుకు ప్రత్యేకంగా వ్యవస్థలు లేవు. రెండూ ఒకటే అన్నట్లుగా ఉందిక్కడ. చిన్నపాటి వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ లు. ఒక్కటేమిటి సిటీల్లో చినుకు పడితే చిత్తడే. అడుగడుగునా నరకమే.

నగరాలు ఎకానమీ బూస్టర్లు. ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాయి. ఇన్ కమ్ జెనరేట్ చేస్తాయి. ప్రభుత్వాలకు కల్పతరువుగా ఉంటాయి. సంపాదన, ఆదాయం, ఉద్యోగం, ఉపాధి వరకు ఓకే.. కానీ పర్యావరణం విషయానికొస్తేనే అష్ట దరిద్రాలన్నీ నగరాల్లోనే కనిపిస్తుంటాయి. నీటి వనరులు కబ్జాలకు గురై, వట్టిపోయి,.. కాలుష్యకాసారంగా మారి నిర్జీవంగా మారుతుంటాయి. గృహ, పారిశ్రామిక వ్యర్థాలన్నీ కలిసేవి నీటి వనరుల్లోనే మరి. అందుకే హైదరాబాద్ లాంటి చోట్ల హైడ్రా వంటి సిస్టమ్ వచ్చింది. చెరువుల దగ్గరి కబ్జాలను కూల్చేస్తున్నారు. అయితే బెదిరించేందుకే అని, కమీషన్ల కోసమే ఈ పనులు అని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఓ మంచి పని కార్యరూపం దాల్చాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. చాలా ఓర్పు, నేర్పు ఉండాలి కూడా. ఇప్పుడు హైడ్రా విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే పట్టుదలగా ఉన్నారు. పర్యావరణాన్ని రక్షిస్తేనే అది మనల్ని రక్షిస్తుందన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా పదేపదే చెబుతున్నారు. నగరాలు నరకాలుగా మారొద్దని అనుకుంటున్నారు.

 

Related News

Adani group donation: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ.. తెలంగాణకు భారీ విరాళం.. కారణం ఇదే!

Konda Surekha Defamation Case : నాంపల్లి కోర్టుకు రాలేనన్న కేటీఆర్, ఈనెల 23కు కేసు వాయిదా వేసిన న్యాయస్థానం

KTR on TDP Congress:ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే.. బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ చేస్తున్నారు.. కేటీఆర్

Adulterated Milk Mafia: యాసిడ్ తో పాల తయారీ.. తాగారంటే ప్రాణాలు పోవాల్సిందే!

Hyderabad Restaurants Raids: పాచిన పిండి, కుళ్లిన ఉల్లి.. ‘చట్నీస్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటల్స్ బంద్..

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Big Stories

×