EPAPER

Supreme Court citizenship Assam: ‘అస్సాంలో వలసదారులకు పౌరసత్వం సబబే’.. 1953 పౌరసత్వ చట్టంపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court citizenship Assam: ‘అస్సాంలో వలసదారులకు పౌరసత్వం సబబే’.. 1953 పౌరసత్వ చట్టంపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court citizenship Assam| భారతదేశంలోని పౌరసత్వం చట్టం సెక్షన్ 6Aపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పౌరసత్వం చట్టం ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి అస్సాం వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం సరైన నిర్ణయమేనని చెప్పింది. అయితే చట్ట ప్రకారం.. జనవరి 1, 1966 నుంచి మార్చి 25, 1971 మధ్య కాలంలో మాత్రమే అస్సాం వలస వచ్చిన వారికి పౌరసత్వం పొందే హక్కు ఉందని తెలిపింది. మార్చి 25, 1971 తరువాత అస్సాం వచ్చిన వారికి భారత పౌరసత్వం పొందే హక్కు లేదని స్పష్టం చేసింది.


అస్సాంలో బంగ్లాదేశీ వలసదారులకు ఎందుకు పౌరసత్వం
మార్చి 26, 1971న పాకిస్తాన నంచి వేరుపడి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అంతకుముందు బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం అరాచకాలకు భయపడి బంగ్లాదేశ్ నుంచి చాలామంది పొరుగునే ఉన్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వలస వచ్చారు. అయితే ఆ సమయంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU).. ఈ చట్టం వల్ల బంగ్లాదేశీయుల సంఖ్య అస్సాంలో పెరిగిపోతోందని నిసనలు చేసింది. అందుకే బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తరువాత వలసదారుల ఎంట్రీని భారతదేశం అంగీకరించలేదు. ఈ క్రమంలో 1971, మార్చి 26 తరువాత బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులపై భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే 1985లో అస్సాం అకార్డ్ లో భాగంగా భారత పౌరసత్వ చట్టంలో సెక్షన్ 6A ని జోడించింది. సెక్షన్ 6A ప్రకారమే బంగ్లా వలసదారులకు పౌరసత్వం ఇస్తోంది.

Also Read: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు


అయితే ఈ చట్టాన్ని అస్సాంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సెక్షన్ 6Aని తొలగించాలని అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల అస్సాంలోని స్థానికులకు సమస్య కలుగుతోందని, అక్కడి సంప్రదాయాలు, జీవన విధానంలో అనూహ్య మార్పులు వస్తున్నాయని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు గురువారం అక్టోబర్ 17, 2024న కీలక తీర్పు వెలువరించింది.

జనవరి 1, 1966 నుంచి మార్చి 25, 1971 వరకు మాత్రమే భారతదేశం వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడంలో తప్పేమి లేదని.. అయినా చట్ట ప్రకారం.. వలసదారులకు పౌరసత్వం హక్కులు పరిమితి ప్రకారమే ప్రభుత్వం ఇస్తోందని.. వారి పౌరసత్వం లభించినా 10 సంవత్సరాలపాటు ఓటు హక్కు ఉండదని గుర్తు చేసింది. పిటీషనర్లు చెప్పినట్లు బంగ్లా వలసదారుల వల్ల అస్సాంలో వచ్చే సంప్రదాయ సమస్యలు ఏమిటో ఆధారాలతో నిరూపించాలని ప్రశ్నించింది.

Also Read: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

పౌరసత్వం అంశంతో అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ముడిపడి ఉండడంతో సుప్రీం కోర్టు అందులో కలుగుజేసుకోవడంలో నిరాకరించింది. కేవలం సెక్షన్ 6Aపై మాత్రమే తన నిర్ణయం తెలిపింది. అదనంగా బంగ్లాదేశ్ నుంచి చట్టవ్యతిరేకంగా భారతదేశంలో చొరబడే వలసదారులను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో వివరాలు ఇవ్వాలని అడిగింది. అక్రమ వలసదారులను గుర్తించడం.. వారిని తిరిగి పంపించే ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చెప్పాలని ప్రశ్నించింది.

అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్ మార్గంలో వస్తున్నారని వారిని రాష్ట్ర ప్రభుత్వం నియత్రించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ లో పేర్కొంది. బంగ్లాదేశ్, భారతదేశం మధ్య 4096.7 కిలోమీటర్ల సరిహద్దులు ఉండడంతో వలసదారులను అడ్డుకోవడం కష్టంగా ఉందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Related News

Karnataka MUDA ED Raids: కర్ణాటక సిఎంపై ఈడీ గురి.. మైసూరు ముడా ఆఫీసులో తనిఖీలు

Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?

Bihar Hooch : కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

Big Stories

×