EPAPER

Weight Loss Jabs: నిరుద్యోగులకు ఉచితంగా ‘వెయిట్ లాస్’ టీకాలు.. యూకేలో కొత్త పథకం, వాళ్లకే ఎందుకు?

Weight Loss Jabs: నిరుద్యోగులకు ఉచితంగా ‘వెయిట్ లాస్’ టీకాలు.. యూకేలో కొత్త పథకం, వాళ్లకే ఎందుకు?

ఈ రోజుల్లో యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి ఊబకాయం. ఒబేసిటీ కారణంగా బోలెడు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నా, బ్రిటన్ లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఒబేసిటీతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్కడ ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో యూకే సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఒబేసిటీతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సాయం అందించేందుక ప్రణాళికలు సిద్ధం చేసింది.


బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై పెను భారం

ఇప్పటికే ఒబేసిటీతో బాధపడుతున్న చాలా మంది ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. పలు రకాలా ఇబ్బందులతో ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. వారు బరువు తగ్గేలా ఇంజెక్షన్లను వేయిస్తోంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా బరువు కంట్రోల్ అయి మళ్లీ ఉద్యోగాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నది. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థపై తీవ్ర ఆర్థికభారం పడుతున్నట్లు బ్రిటన్ హెల్త్ మినిస్టర్ వీస్ స్ట్రీటింగ్ వెల్లడించారు. వీరి కోసం ప్రతి ఏటా ఏకంగా 10 బిలియన్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఊబకాయులు బరువు తగ్గేలా ఇంజెక్షన్లు వేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బరువు తగ్గే ఇంజెక్షన్లపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిగాయని, మెరుగైన ఫలితాలు రావడంతో ప్రస్తుతం ఈ ఇంజెక్షన్లు ఊబకాయులకు వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంజెక్షన్లు వారిని వీలైనంత త్వరగా బరువు తగ్గేలా చేసి, మళ్లీ ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఊబకాయం

బ్రిటన్ ప్రజలు తిండి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే దేశంలో ఊబకాయం పెరుగుతుందని వీస్ స్ట్రీటింగ్ తెలిపారు. “బ్రిటన్ ప్రజలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం పెరుగుతోంది. ఒబేసిటీ అనేది మనిషి ఆయుష్షును తగ్గిస్తుంది. దేశంలోని ఊబకాయుల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా ఏకంగా 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఈ సమస్య పెను భారంగా మారింది. ఊబకాయం కారణంగా ఉద్యోగులు జాబ్ కు సరిగా వెళ్లలేకపోతున్నారు. కొంత మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఊబకాయులు బరువు తగ్గేలా ఇంజెక్షన్లు వేయిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ను అలవర్చుకోవాలి” అని దేశ ప్రజలకు సూచించారు.

Read Also: వెల్లుల్లి తింటే ప్రాణాలు పోతాయట, అమెరికన్ లేడీకి వింత రోగం!

ఊబకాయాన్ని కంట్రోల్ చేస్తామన్న  బ్రిటన్ ప్రధాని   

అటు బ్రిటన్ లో ఊబకాయుల బరువు తగ్గించేందుక ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ఆదేశ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్లను లిల్లీ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్నది. ఈ ఇంజెక్షన్ల కోసం ఆ సంస్థ ఏకండా 820 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెడుతోంది.

Read Also: ఈ వంట పాత్రల్లో డేంజర్ కెమికల్స్? వీటిలో ఆహారం వండితే.. ఆ భయానక వ్యాధి పక్కా!

Related News

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Moringa and Beauty: మునగాకులను ఇలా వాడితే మొటిమలు రావడం దాదాపు తగ్గిపోతాయి

Chemicals in Cooking Utensils: ఈ వంట పాత్రల్లో డేంజర్ కెమికల్స్? వీటిలో ఆహారం వండితే.. ఆ భయానక వ్యాధి పక్కా!

Chicken Lollipop: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Hair Growth Oil: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

Big Stories

×