EPAPER

OTT Movie: మిస్టరీ చర్చ్.. ఎవరి ప్రమేయం లేకుండానే నన్‌కు కడుపు, ఆ సీన్స్ ఉంటాయ్ పిల్లలతో చూడకండి

OTT Movie: మిస్టరీ చర్చ్.. ఎవరి ప్రమేయం లేకుండానే నన్‌కు కడుపు, ఆ సీన్స్ ఉంటాయ్ పిల్లలతో చూడకండి

OTT Movie: మైఖేల్ మోహన్ దర్శకత్వం వహించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఇమ్మాక్యులేట్’.  ఈ మూవీలో సిడ్నీ స్వీనీ, అల్వారో మోర్టే, బెనెడెట్టా పోర్కరోలి, డోరా రొమానో, జార్జియో కొలంజెలి, సిమోనా టబాస్కో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా గురించి తెలుసుకుందాం..


బతికి ఉండగానే సమాధి

సినిమా ప్రారంభం కాగానే సిస్టర్ మేరీ కాన్వెంట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. పై అధికారి గదిలో నుంచి గేట్ తాళాలు దొంగిలించి, గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎంతకీ గేట్స్ ఓపెన్ కావు. గేట్ లోని గ్యాప్ లో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. అంతలో నలుగురు ముసుగు వ్యక్తులు వచ్చి సిస్టర్ మేరీ కాలును విరిచేస్తారు. వాళ్లు ఆమెను బతికి ఉండగానే సమాధిలో పాతిపెడతారు. కాసేపటి తర్వాత మెలువ వచ్చి మేరీ గట్టిగా ఏడుస్తుంది. సాయం కోసం అరుస్తుంది.


నన్ గా మారిన మిచిగాన్ యువతి

సీన్ కట్ చేస్తే.. సిసిలియా కాన్వెంట్ లో చేరేందుకు మిచిగాన్ నుంచి ఇటలీకి వస్తుంది. రెవరెండ మదర్ సిసిలియాను ప్రేమగా కాన్వెంట్ లోకి ఆహ్వానిస్తుంది. కాన్వెంట్ లో ఆమెకు ఓ గదిని కేటాయిస్తుంది. నిజానికి ఈ కాన్వెంట్ లో ముసలి నన్స్ అంతా తమ చివరి రోజులను గడుపుతారు. వీరిని జాగ్రత్తగా చూసుకోవడమే మిగతా నన్స్ పని. సిస్టర్ ఇసుబెల్ కు సిసిలియో కాన్వెంట్ లో చేరడం పెద్దగా ఇష్టం ఉండదు. నీకు వెళ్లాలని ఉంటే ఇప్పుడే వెళ్లిపో. నన్ గా మారాక ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉండదని చెప్తుంది. తాను అన్నింటికి సిద్ధపడే ఇక్కడికి వచ్చానని చెప్తుంది.

చనిపోయిన బతికిన సిస్టర్ సిసిలియో

సిస్టర్ సిసిలియో నన్ గా మారేందుకు అంతా సిద్ధం అవుతుంది. ఈ వేడుకకు ఫాదర్ టెడెస్కి వస్తాడు. కార్డినల్ ఇటాలియన్ లో ప్రమాణం చేయిస్తాడు. టెడెస్కి వాటిని ఇంగ్లీష్ లోకి మార్చి సిసిలియాకు చెప్తాడు. అన్ని ప్రమాణాలు చేసి ఆమె నన్ గా మారుతుంది. వేడుక అయ్యాక టెడెస్కి, సిసిలియా మాట్లాడుకుంటారు. ఆమెను నన్ గా మారమని చెప్పిందే టెడెస్కి. చిన్నప్పుడు ఆమె ఐస్ మీద నడుస్తుండగా నీళ్లలోకి పడిపోతుంది. అప్పుడు ఆమె గుండె కాసేపు ఆగిపోతుంది. తర్వాత తను మళ్లీ బతుకుతుంది. దేవుడు తనని మళ్లీ బతికించాడని ఆమె భావిస్తుంది. దేవుడి మీద నమ్మకంతోనే ఆమె నన్ గా మారుతుంది.

కాన్వెంట్ లో వింత ఘటనలు

ఆ రోజు రాత్రి తను ముఖం కడుక్కునే సమయంలో ఓ ఏడుపు వింటుంది. ఎవరో అని వెళ్లి చూస్తుంది. అక్కడ ఓ నన్ కనిపిస్తుంది. ఆమెకు ముఖం ఉండకపోవడంతో షాక్ అవుతుంది. అదే సమయంలో అక్కడికి రెవెరెండ్ మదర్ వస్తుంది. సిసిలియాను బలిపీఠం దగ్గరికి తీసుకెళ్లి ఓ ఇనుప సీలను చూపిస్తుంది. ఇది జీసస్ కు శిలువ వేసిన మూడు సీలల్లో ఒకటి అని చెప్తుంది. ఆమెకు ఏం అర్థం కాక కళ్లు తిరిగి పడిపోతుంది. ఆమె కళ్లు తెరిచే సమయానికి కొంత మంది ముసుగు వ్యక్తులు వచ్చి ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు ఆమెకు నిద్రలోనుంచి మేలుకుంటుంది. అప్పుడే ఆమె గదిలోకి ఎవరో వ్యక్తి వచ్చినట్లు గమనిస్తుంది. వెంటనే ఆమె లైట్ ఆన్ చేయగా ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయం అవుతుంది. కాన్వెంట్ లో వింత వింత సంఘటను ఆమెను కలవర పెడతాయి. కొద్ది రోజుల్లోనే అక్కడ ఆమె  అందరితో కలిసిపోతుంది.

శారీరక సంబంధం లేకుండానే సిస్టర్ కడుపులో బిడ్డ

ఓ రోజు సిసిలియో వాంతి చేసుకుంటుంది. డాక్టర్ ఆమెను చెక్ చేసి టాబ్లెట్స్ ఇస్తారు. కొద్ది సేపటి తర్వాత ఆమెకు కార్డినల్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తుంది. అక్కడ ఫాదర్ టెడెస్కి, రెవెరెండ్ మదర్ కూడా ఉంటుంది. నువ్ ప్రమాణాలను అతిక్రమించావా? అని కార్డినల్ సిసిలియా మీద కోప్పడుతాడు. తాను అస్సలు అతిక్రమించలేదంటుంది. నన్ గా చేరడానికి ముందు ఎవరితోనైనా ఫిజికల్ గా కలిశావా? అని అడుగుతాడు. దానికి ఆమె లేదని చెప్తుంది. అప్పుడు టెడెస్కి అసలు విషయం చెప్తాడు. నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్తాడు. అయితే, ఎవరితో ఆమె ఫిజికల్ గా కలవకపోయినా కడుపులో బిడ్డ పెరగడం మిరాకిల్ అని భావిస్తారు. దేవుడి వరం అనుకుంటారు. ఆమె మరో మేరీ అని భావిస్తారు. వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకలో సిస్టర్ ఇసబెల్, సిస్టర్ బెన్ అస్సలు సంతోషంగా ఉండరు. కానీ, అందరూ సిసిలియోను గౌరవంగా చూస్తారు. వేడుక తర్వాత ఆమె బాత్ టబ్ లో రిలాక్స్ అవుతుండగా సిస్టర్ ఇసబెల్ అక్కడి వచ్చి ఆమె మీద దాడి చేసి చంపాలని భావిస్తుంది. నీ ప్లేస్ లో ఉండాల్సింది నేను అంటూ కొడుతుంది. వెంటనే మిగతా నన్స్ అక్కడికి వచ్చి ఇసబెల్ ను అక్కడి నుంచి లాక్కెళ్తారు. వెంటనే ఇసబెల్ బిల్డింగ్ మీది నుంచి దూకి చనిపోతుంది.

జీసస్ ను మళ్లీ పుట్టించే ప్రయోగం

ఈ కాన్వెంట్ లో జరుగుతున్న విషయాలపై సిస్టర్ బెన్ కు అనుమానం కలుగుతుంది. సిస్టర్ సిసిలియో ఎలా ప్రెగ్నెంట్ అయ్యింది? ఇసబెల్ ఎందుకు చనిపోంది? అంటూ గట్టిగా నిలదీస్తుంది. ఏవో విషయాలను దాస్తున్నారని మిగతా నన్స్ తో అంటుంది. అప్పుడు టెడెస్కి ఆమె నోరు మూసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. చీకటిపడ్డాక బెన్ తో మాట్లాడేందుకు సిసిలియో ఆమె రూమ్ కు వెళ్తుంది. కానీ, అక్కడ తను ఉండదు. కొంత దూరం నుంచి ఏవో శబ్దాలు రావడంతో ఆమె అటు చూస్తుంది. కొంత మంది ఫేస్ లెస్ నన్స్ ఆమెను బంధించి నాలుక కోస్తారు. భయంతో సిసిలియా అరవబోవడంతో ఓ ముసలి నన్ వచ్చి ఆమె నోరు మూస్తుంది. మరుసటి రోజు సిసిలియో తన రూమ్ లో గట్టిగా అరుస్తుంది. అందరూ వెళ్లి చూస్తే సిసిలియోకు గర్భస్రావం జరుగుతుంది. టెడెస్కి ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తుంటాడు. అదే సమయంలో రెవెరెండ్ మదర్ సిసిలియో బెడ్ ను పరిశీలిస్తుంది. మంచం కింద ఓ కోడి చనిపోయి కనిపిస్తుంది. అయితే, కాన్వెంట్ నుంచి తప్పించుకునేందుకు ఆమె రక్తస్రావం డ్రామా ఆడిందని అర్థం అవుతుంది. వెంటనే ఆమె టెడెస్కికి కాల్ చేసి చెప్తుంది. సిసిలియో కారులో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, టెడెస్కి ఆమెను పట్టుకొచ్చి కాన్వెంట్ లో పడేస్తాడు. ఆ తర్వాత సిసిలియాను టెడెస్కి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. వాస్తవానికి టెడెస్కి ఫాదర్ కాకముందు ఓ జెనెటిక్ సైంటిస్ట్. ఆయన జీసస్ డీఎన్ఏను కనిపెట్టి కొత్త జీసస్ ను తయారు చేయాలని భావిస్తాడు. అయితే, గత 20 ఏళ్లుగా ఆయన చేసే ప్రయోగాలు ఫెయిల్ అవుతాయి. సిసిలియా కడుపులో ఉన్న బేబీ సక్సెస్ ఫుల్ బేబీ. అందుకే ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు. అదే ప్రయోగం సిస్టర్ ఇస్ బుల్ మీద చేసినా సక్సెస్ కాదు. అందుకే ఆమె సిసిలియోపై దాడి చేస్తుంది. ఈ విషయాన్ని టెడెస్కి సిసిలియాకు చెప్తాడు. ఆమె షాక్ అవుతుంది. కాన్వెంట్ నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ఆమె పాదాల మీద సిలువ ఆకారంతో కాల్చి గాయపరుస్తాడు.

కాన్వెంట్ నుంచి బయటపడి, బిడ్డను చంపేసి..

ఆ తర్వాత డాక్టర్ వచ్చి ఆమె ఎప్పుడైనా డెలివరీ కావచ్చని చెప్తాడు. ప్రజలను కాపాడేందుకు జీసస్ మళ్లీ పుట్టబోతున్నాడని అందరూ సంతోషపడుతారు. సిసిలియాకు మాత్రం ఆబిడ్డకు జన్మనివ్వడం ఇష్టం ఉండదు. సిసిలియో గదిలో రెవరెండ్ మదర్ మాత్రమే ఉంటుంది. కాసేపటి తర్వాత ఆమెను సిలువతో కొట్టి చంపేస్తుంది సిసిలియో. బయటకు వచ్చి కార్డినల్ ను కూడా సిసిలియో చంపేస్తుంది. డాక్టర్ అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే ఆమె టెడెస్కీ ల్యాబ్ లో ఇథనాల్ పోస్తుంది. అప్పుడే అక్కడికి టెడెస్కీ వస్తాడు. నువ్వుకాకపోతే మరో వ్యక్తితో బిడ్డను పుట్టిస్తాం. నువ్వు ఇలాంటి పనులు చేయకుండా బిడ్డను తమకు ఇవ్వాలని చెప్తాడు. అదే సమయంలో టెడెస్కిని ల్యాబ్ లో బంధించి అందులోకి లైటర్ ను విసిరేస్తుంది. కానీ, ల్యాబ్ నుంచి టెడెస్కి బయటపడుతాడు. అతడు సిసిలియో వెంటపడుతాడు. అప్పుడు ఆమె బంకర్ లోకి వెళ్తుంది. అక్కడ బెన్ డెడ్ బాడీ కనిపించడంతో భయపడుతుంది. వెంటనే తనకు బయటకు వెళ్లే దారి కనిపిస్తుంది. తను బయటపడే టైమ్ లోనే టెడెస్కి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. తన దగ్గర ఉన్న సీజర్ తో ఆమె పొట్టను కోసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు సిసిలియో తన దగ్గర ఉన్న ఇనుప సీలతో టెడెస్కి మెడకు గుచ్చి చంపేస్తుంది. సిసిలియో అక్కడి నుంచి బయటపడి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ మనిషి రూపంలో కాకుండా మాన్ స్టర్ రూపంలో పుడతాడు. ఆ బిడ్డను కూడా చంపేస్తుంది. దీంతో సినిమా అయిపోతుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. దీన్ని తెలుగులోనూ చూసేయొచ్చు.

Read Also: భర్తకు ప్రియుడితో అడ్డంగా దొరికిపోయే భార్య… దిమ్మ తిరిగే ట్విస్ట్ లున్న బో*ల్డ్ మూవీ

Related News

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ తో గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : లైంగిక వేధింపులు… ఆంటీకి లొంగిపోయే అబ్బాయి… ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడాల్సిన బో*ల్డ్ మూవీ

OTT Movie : పబ్లిక్ ప్లేస్ లో పొరపాటున కూడా చూడకూడని బో*ల్డ్ సినిమాలు.. పక్కా అడల్ట్ కంటెంట్

OTT Movie : పార్టనర్స్ ను మార్చుకునే రెండు జంటలు… ఈ బో*ల్డ్ మూవీ అరాచకం భయ్యా

OTT Horror Movie : ఆ శపించబడిన సొరంగాన్ని తెరిస్తే ప్రపంచ అంతం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

OTT Bold Movie : భర్త ముసలి వాడని కన్పించిన మగాళ్లతో ఆ పని… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : చేతబడితో డబ్బులే డబ్బులు… ట్విస్టుల మీద ట్విస్ట్ లున్న హర్రర్ మూవీ

Big Stories

×