EPAPER

Devi Sri Prasad: పాపం కన్స్టర్ లుకు కూడా ఇన్వైట్ చెయ్యాల్సిన పరిస్థితి

Devi Sri Prasad: పాపం కన్స్టర్ లుకు కూడా ఇన్వైట్ చెయ్యాల్సిన పరిస్థితి

Devi Sri Prasad:  దేవిశ్రీప్రసాద్, ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవి అనే సినిమాతో సంగీత దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. దేవిశ్రీప్రసాద్ అతి తక్కువ కాలంలోనే మంచి మ్యూజిక్ ఇచ్చి ఒక బ్రాండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. దేవి మ్యూజిక్ అంటే ఒకప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ ఉండేది. దేవి తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ ఆల్బమ్స్ ను ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో దేవి మ్యూజిక్ కొంచెం స్లో అయింది. కానీ ఒకప్పుడు దేవి మ్యూజిక్ అంటే అద్భుతం అని చెప్పొచ్చు. కంప్లీట్ ఆల్బమ్ ను క్రేజీగా కంపోజ్ చేసేవాడు దేవి. దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, వెంకీ,శంకర్ దాదా ఎంబిబిఎస్,వర్షం లాంటి అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్ ఉన్నాయి. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు.


కేవలం సినిమాలోని సాంగ్స్ మాత్రమే కాకుండా సినిమాలో సీన్స్ కి దేవి ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒక సీన్ ని ఎలివేట్ చేయాలంటే దేవిశ్రీప్రసాద్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వేరే రేంజ్ కి తీసుకెళ్తాడు. అలా దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మామూలు సీన్స్ కూడా ఒక హై లో అనిపిస్తుంటాయి. ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోస్ కి దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేశాడు.ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కి దేవి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జల్సా సినిమాలో ప్రతి పాట అద్భుతం అని చెప్పొచ్చు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని సాంగ్స్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ సాధించుకున్నాయి.

అలానే మహేష్ బాబు హీరోగా చేసిన వన్ నేనొక్కడినే సినిమాకి దేవి ఇచ్చిన ఆల్బమ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకి ఇప్పటివరకు దేవియే సంగీతం అందించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. ఇంక మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సాంగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో దేవి హవా కొంతమేరకు తగ్గిందని చెప్పొచ్చు అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో దేవి మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.


ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో కన్స్టర్ ఎంత పెద్దగా ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కన్స్టర్ కి టికెట్స్ కొనుక్కొని మరీ వెళ్లే సంగీత ప్రియులు ఉన్నారు. ఇక దేవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో 19వ తారీఖున దేవిశ్రీప్రసాద్ కన్స్టర్ జరగనుంది. దీని గురించి ఒక ప్రెస్ మీట్ కూడా రీసెంట్ గా నిర్వహించారు దేవిశ్రీప్రసాద్. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి ప్రత్యేకంగా కాన్సెప్ట్ కి రమ్మని ఆహ్వానించారు. అసలు దేవికి ఉన్న టాలెంట్ కి అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా కన్స్టర్ అనౌన్స్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా దేవి ఫ్యాన్స్ అందరితో పాటు ప్రముఖులు కూడా అక్కడికి చేరిపోతారు.

Related News

This Week Releases: ఈవారం విడుదల కానున్న సినిమాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవే.. కే విశ్వనాథ్ చివరి చిత్రానికి ఎక్కువ కట్స్

Fouji : చాలా పెద్ద ప్లాన్ వేసావ్ కదా హను, మళ్ళీ చాలా ఏళ్లు తర్వాత తెరపైకి ఆ కాంబినేషన్

Sudheer Babu : పాపం 18 సినిమాలు చేస్తే , కేవలం రెండే వర్కౌట్ అయ్యాయి

Ram Charan : బాబాయ్ బాటలో అబ్బాయి, మనం చేసే పనిలో మంచి కనిపించాలి, మనం కాదు

Vettaiyan OTT : అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్నరజినీకాంత్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Suriya: ఇలా కూడా వర్కవుట్స్ చేయొచ్చా? జిమ్‌లో హీరో సూర్య వీడియో వైరల్

Big Stories

×