EPAPER

Sudheer Babu : పాపం 18 సినిమాలు చేస్తే , కేవలం రెండే వర్కౌట్ అయ్యాయి

Sudheer Babu : పాపం 18 సినిమాలు చేస్తే , కేవలం రెండే వర్కౌట్ అయ్యాయి

Sudheer Babu : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు. వారిలో కొంతమంది ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినవాళ్లు. ఇంకొంతమంది షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వాళ్ళు, మరికొంతమంది కొన్ని సినిమాల్లో నటులుగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఆ తర్వాత హీరోలుగా మారి అద్భుతమైన హిట్స్ అందుకొని వాళ్లకంటూ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నవాళ్లు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో సుధీర్ బాబు ఒకరు. సుధీర్ బాబు ఒకప్పుడు చాలా సూపర్ హిట్ సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటుడుగా కూడా కనిపించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి గుర్తింపు కూడా సాధించుకున్నాడు. ఎట్టకేలకు ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.


తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ను సాధించలేకపోయింది. కానీ సుదీర్ బాబుకి టాలెంట్ ఉంది అని ప్రూవ్ అయింది. ముఖ్యంగా అందరినీ ఆశ్చర్యపరిచినవి సుధీర్ బాబు చేసిన డాన్స్ అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత మారుతి చేసిన ప్రేమ కథ చిత్రం సినిమా సుధీర్ బాబుకి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ సినిమాతోనే హర్రర్ కామెడీ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చాలా తక్కువ బడ్జెట్ తో చేసిన ఆ సినిమా మంచి లాభాలను తీసుకురావడంతో పాటు మంచి పేరును కూడా తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత కొంతకాలం వరకు సుధీర్ కి సరైన హిట్ సినిమాలు లేవు.

ఇక ఇంద్ర గంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమా డీసెంట్ హిట్గా నిలిచింది. వాస్తవానికి సుధీర్ బాబు హిట్ సినిమాల ప్రస్తావన వస్తే ఒకటి ప్రేమ కథ చిత్రం, రెండు సమ్మోహనం పేరు మాత్రమే వినిపిస్తుంది. అయితే దాదాపు ఇప్పటివరకు సుధీర్ బాబు 18 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో కేవలం ఈ రెండు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఇక మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు సుధీర్. ఇన్ని సినిమాలు చేసినా కూడా సక్సెస్ రేట్ మరి ఇంత తక్కువగా ఉండడానికి కారణం సుదీర్ స్టోరీ సెలెక్షన్ అనుకోవచ్చు. కానీ సినిమా కోసం కంప్లీట్ ఎఫెక్ట్స్ పెట్టి సుదీర్ పని చేస్తాడు అని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. సిక్స్ ప్యాక్ కూడా చాలా సినిమాల్లో చూపిస్తూ వచ్చాడు. ఏదేమైనా మంచి సినిమా వర్కౌట్ అయ్యి సుధీర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయితే ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ ఏర్పడుతుంది.


ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అలానే సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఇంప్రెస్సివ్ గా అనిపించింది. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన ఫాదర్ కాన్సెప్ట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమా సుధీర్ కి ఏ స్థాయి హిట్ అందిస్తుందో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడకు తప్పదు.

Tags

Related News

This Week Releases: ఈవారం విడుదల కానున్న సినిమాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవే.. కే విశ్వనాథ్ చివరి చిత్రానికి ఎక్కువ కట్స్

Fouji : చాలా పెద్ద ప్లాన్ వేసావ్ కదా హను, మళ్ళీ చాలా ఏళ్లు తర్వాత తెరపైకి ఆ కాంబినేషన్

Devi Sri Prasad: పాపం కన్స్టర్ లుకు కూడా ఇన్వైట్ చెయ్యాల్సిన పరిస్థితి

Ram Charan : బాబాయ్ బాటలో అబ్బాయి, మనం చేసే పనిలో మంచి కనిపించాలి, మనం కాదు

Vettaiyan OTT : అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్నరజినీకాంత్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Suriya: ఇలా కూడా వర్కవుట్స్ చేయొచ్చా? జిమ్‌లో హీరో సూర్య వీడియో వైరల్

Big Stories

×