EPAPER

Bomb Threat: ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మైనర్.. పోస్టుల వెనక రహస్యమిదే!

Bomb Threat: ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మైనర్.. పోస్టుల వెనక రహస్యమిదే!

Minor In Custody Over Bomb Threats To Airlines: దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా పలు విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. మూడు రోజులుగా మొత్తంగా 19 విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముంబై నుంచి వెళ్లే ఇండిగో విమానాలను బెదిరిస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


వివిధ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు చేసిన తనిఖీలో ఛత్తీస్ గడ్ నుంచి వాటి మూలాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మైనర్(17) ఓ వ్యాపారవేత్త కుమారుడిగా అనుమానిస్తున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. కాగా, కొన్ని విమానాలను కెనడాలోని రిమోట్ విమానాశ్రయానికి మళ్లించారు.

అయితే ఆ మైనర్ తన స్నేహితులను సైతం ఇందులో ఇరికించాలని అనుకున్నాడు. మైనర్, అతని స్నేహితులకు డబ్బు విషయంలో విభేదాలు ఉండడంతో బెదిరింపులు కూడా చేసినట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్‌లోని రాజ్ నంద్‌గావ్‌లో స్కూల్ మానేసిన ఈ మైనర్ తో పాటు అతడి తండ్రిని సైతం పోలీసులు పిలిపించారు.


Also Read: మరోసారి హరియాణా సీఎంగా సైనీ, ప్రధాని మోదీ సమక్షంలో రేపే ప్రమాణస్వీకారం

ఈ మేరకు విచారించిన అనంతరం మైనర్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ హోంకు తరలించగా.. ఆ బాలుడి తండ్రిని మాత్రం ఇంకా ప్రశ్నిస్తున్నారు. అయితే తన స్నేహితుడితో వివాదం ఉన్నందున అతడి పేరుతో ఎక్స్ లో ఖాతా తెరిచాడు. అనంతరం దాని నుంచి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.

Related News

CM Nayab Singh Saini : మరోసారి హరియాణా సీఎంగా సైనీ, ప్రధాని మోదీ సమక్షంలో రేపే ప్రమాణస్వీకారం

Delhi Pollution Supreme Court: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్!

Omar Abdullah CM Oath: జమ్ము కశ్మీర్ సిఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచే మద్దతు!

‘Jai Shri Ram’ In Mosque: మసీదులో ‘జై శ్రీ రామ్’ జపించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

Kalaburagi Jail : కర్ణాటక జైలులో ఖైదీలకు విఐపి ట్రీట్‌మెంట్.. జైలర్‌పై కేసు నమోదు

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

Big Stories

×