EPAPER

Bank Holidays: బాబోయ్ అన్ని సెలవులా!.. 2023లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే..

Bank Holidays: బాబోయ్ అన్ని సెలవులా!.. 2023లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే..

Bank Holidays: బ్యాంక్ జాబ్ అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. మంచి ఉద్యోగం.. మంచి జీతం.. నియమిత పనివేళలు.. సమాజంలో హోదా.. ఇలా వైట్ కాలర్ జాబ్ అంటే బ్యాంక్ ఉద్యోగమే గుర్తుకు వస్తుంది. ఇక బ్యాంకుతో పనిపడని వ్యక్తి ఉండనే ఉండరు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో బ్యాంకుకు వెళ్లాల్సిన వారే.


మరి, బ్యాంకుకు వెళితే.. ఆ రోజు సెలవని తెలిస్తే? ఎందుకంటే, కొన్ని సందర్భాల్లో ఇతరులకు వర్కింగ్ డే అయినా కూడా బ్యాకులకు మాత్రం హాలిడే ఉంటుంది. అందుకే, ఏయే రోజున బ్యాంకు బంద్ ఉంటుందో ఆ జాబితాను ముందే రిలీజ్ చేస్తారు. లిస్ట్ లో ఉండే సెలవులే కాకుండా.. సడెన్ గా ఉద్యోగులు చేసే సమ్మెలు వీటికి అదనం. అవి చెప్పిరావు. కానీ, ఏడాదిలో పలుమార్లు స్ట్రైక్ పేరుతో ఉద్యోగులు డుమ్మా కొడుతుంటారు.

తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ సెలవు తేదీలను ప్రకటించింది. 2023లోనూ బ్యాంకులకు చాలానే సెలవులు రానున్నాయి. ఆదివారాలు, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. సంక్రాంతి, మహా శివరాత్రి, దీపావళి వంటి పండగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 20 రోజులకు పైగా బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.


2023లో ఏపీ, తెలంగాణలో బ్యాంకు సెలవులు ఇవే..

జనవరి 15 – సంక్రాంతి
జనవరి 26 – రిపబ్లిక్ డే

ఫిబ్రవరి 18 – శివరాత్రి

మార్చి 7 – హోలీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి

ఏప్రిల్‌ 1 – ఫైనాన్సియల్ ఇయర్ ఆరంభం
ఏప్రిల్‌ 5 – జగ్జీవన్‌రాం జయంతి
ఏప్రిల్‌ 7 – గుడ్‌ ఫ్రైడే
ఏప్రిల్‌ 14 – అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్‌ 22 – రంజాన్‌

మే 1 – లేబర్ డే

జూన్‌ 29 – బక్రీద్‌
జులై 29 – మొహర్రం

ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం

సెప్టెంబర్‌ 7 – శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్‌ 18 – వినాయక చవితి
సెప్టెంబర్‌ 28 – మిలాద్‌-ఉన్‌-నబి

అక్టోబర్‌ 2 – గాంధీ జయంతి
అక్టోబర్‌ 24 – విజయదశమి

నవంబర్‌ 12 – దీపావళి
నవంబర్‌ 27 – కార్తీక పౌర్ణమి/గురునానక్‌ జయంతి

డిసెంబర్‌ 25 – క్రిస్మస్‌

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×