EPAPER

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్ రావ్ ఫైర్

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్ రావ్ ఫైర్

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం ఏసీడీపీ నిధులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రజా పాలన అని గొప్పగా చెప్పిన ప్రభుత్వం, బడ్జెట్‌లో పొందుపర్చిన విధంగా ప్రతి శాసన సభ నియోజకవర్గానికి ఏసీడీపీ నిధులు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.


బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తామని చెప్పారు. ఒక్కటి కూడా ఇచ్చింది లేదని మండిపడ్డారు. రైతు బంధు రూ. 10 వేలు కాదు, రూ. 15 వేలు ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క రూపాయి రైతుల అకౌంట్స్‌లో వెయ్యలేదని విమర్శించారు. ‘‘అధికారంలోకి వచ్చారు కేసీఆర్ కిట్ బంధు పెట్టారు. చెరువులు నిండినా చేప పిల్లలను వదలడం లేదు. చేప పిల్లలు తక్కువ పోయాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. టెండర్ పిలవలేదు. ముదిరాజ్‌లకు, గంగ పుత్రులకు తీవ్రమైన అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ ఇలాంటి మార్పులు చేస్తోంది’’ అంటూ మండిపడ్డారు.

ALSO READ : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?


రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు హరీష్ రావు. తమ హయంలో ఉత్తర, దక్షణ రెండు భాగాలుగా ప్రతి పాదన చేశామని, ఉత్తర భాగం 158 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. భూసేకరణ కోసం 3ఏ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఖర్చు మాత్రం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం చెరి సగం భరించేలా ప్రతిపాదన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా, భూసేకరణ చెయ్యడం లేదని, ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఉత్తర భాగంలో యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ విలువ ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దక్షిణ భాగం అలైన్మెంట్ పూర్తిగా మార్చారని, ప్రభుత్వంలో ఉన్న కొందరి నేతల భూములు ఉన్నందునే అలా జరిగిందని చెప్పారు.

స్వార్థం కోసం అలైన్మెంట్ మార్చడం వల్ల 182 కిలోమీటర్ల నుంచి 198 కిలోమీటర్లకు పెరిగిందని మండిపడ్డారు. పెరిగిన 16 కిలోమీటర్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు చేత నిర్మిస్తామని చెప్తున్నారని, దానివల్ల రూ.20 వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తుల భూముల కోసం రూ. 20 వేల కోట్ల భారం ప్రజలపై వేయడం కరెక్ట్ కాదన్నారు. రుణమాఫీ కోసం అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల అంటున్నారని, అలైన్మెంట్ మార్చడం వల్ల రూ. 20 వేల కోట్లు ఎక్కడ నుండి తెస్తారని అడిగారు హరీష్ రావు.

Related News

CM Revanth Reddy: దిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ భేటీ, క్యాబినెట్ బెర్తులపైనా కీలక సమావేశం

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

Ekashila Housing Society: ఏకశిలలో ఏకఛత్రాధిపత్యం, సొసైటీ మాటున అక్రమాలెన్నో.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Mlc Kodandaram : గురుకులాలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది – ఎమ్మెల్సీ కోదండరాం

Special Powers To Hydra: హైడ్రా కోరలకు మరింత పదును.. జీవో జారీ, ఇక వాటిపై కమిషనర్‌దే ఫైనల్ నిర్ణయం

Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?

Big Stories

×