EPAPER

Fighter Jet: బాపట్ల హైవేపై యుద్ద విమానం.. అసలేం జరిగిందంటే..

Fighter Jet: బాపట్ల హైవేపై యుద్ద విమానం.. అసలేం జరిగిందంటే..

Fighter Jet: అది బాపట్ల జిల్లా. కొరిశపాడు సమీపంలోని హైవే. రహదారి మొత్తం నిర్మానుషం. ఆ రోడ్డుపై వాహనాలు లేవు. అటూఇటు వచ్చిపోయేవారు లేరు. అంతా ఖాళీ. అలాంటి సమయంలో.. చెవులు చిల్లుపడేలా పెద్ద సౌండ్. ఆకాశం నుంచి వినిపించింది. ఏంటా అని.. ఆ పక్కనే పొలాల్లో పని చేస్తున్న వాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఆకాశం వైపు చూస్తే.. దూరంగా ఓ చిన్న సైజు విమానం కనిపించింది. అదేంటి? మా బాపట్లకి విమానం ఏంటి? అనుకున్నారు వారంతా.


ఆ విమానం కిందకు వస్తున్న కొద్ది ఆకారం భారీగా పెరిగింది. సౌండ్ విపరీతంగా వచ్చింది. చూట్టానికి మామూలు విమానంలా లేదు. మరికాస్త దగ్గరికి వచ్చాక తెలిసింది.. అది యుద్ద విమానం అని. ఆ ఫైటర్ జెట్.. అలా అలా ఆ హైవే మీదుగా వెళ్లిపోయింది. కాసేపటికే మరో విమానం. ఆ తర్వాత ఇంకోటి. మొత్తం నాలుగు ఫైటర్ జెట్లు, ఒక కార్గో ఫైటు బాపట్లలో హల్ చల్ చేశాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే…

బాపట్ల జిల్లా జాతీయ రహదారిపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. చెన్నై-కోల్‌కతా హైవేపై కొరిశపాడు-రేణంగివరం మధ్య రన్‌వే ఏర్పాటు చేశారు. ఇందుకోసం 4 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్డు నిర్మించారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా ఒక కార్గో విమానం, నాలుగు ఫైటర్ జెట్లు వచ్చాయి.


ట్రయల్ రన్ లో భాగంగా ఫైటర్‌ జెట్ల విన్యాసాలు అలరించాయి. రన్‌వేకు అత్యంత సమీపంలో విమానాలు ఎగిరి తిరిగి వెళ్లిపోయాయి. ఏర్పాట్లను భారత వైమానికదళ అధికారులు పర్యవేక్షించారు.

Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×