EPAPER

Cow Ghee or Buffalo Ghee: ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి… ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిది?

Cow Ghee or Buffalo Ghee: ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి… ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిది?

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే మన శరీరానికి అత్యవసరమైన, ఆరోగ్యకరమైన కొవ్వు అందుతోంది. ఆవు నెయ్యి, గేదె నెయ్యి… రెండూ మార్కెట్లో లభిస్తాయి. ఈ రెండింటితోను ఇంట్లో కూడా నెయ్యి తయారు చేసుకోవచ్చు. గేదె నెయ్యి తెల్లగా ఉంటే, ఆవు నెయ్యి కాస్త పసుపు రంగులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


గేదె నెయ్యిలో కేలరీలు ఎక్కువ
గేదె నెయ్యి విషయానికి వస్తే ఈ నెయ్యిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు గేదె నెయ్యిని వాడడం మంచిది. ఆవు నెయ్యిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా గేదె నెయ్యిని తినడమే మంచిది. ఎందుకంటే దీనిలో ఎముకలను పోషించే కొవ్వు పదార్థాలు నిండుగా ఉంటాయి. ఆవు నెయ్యి విషయానికి వస్తే ఈ నెయ్యి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఆయుర్వేదం ఇదే చెబుతోంది
ఆయుర్వేదంలో గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యిలోనే ఎక్కువ ఔషధ గుణాలున్నాయని చెబుతారు. ఇది సానుకూలమైన మార్పులను శరీరంలో అందిస్తుంది. ఆవు నుండి వచ్చే పాలను చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే ఇది సానుకూల శక్తులను అందిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి కూడా ఆవు నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని రకాల మూలికలలో తయారీలో ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు.


ఆవు నెయ్యితో పోలిస్తే గేదె నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సాధారణంగా ఆవు నెయ్యి 6 నుంచి 8 నెలల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. కానీ గేదె నెయ్యి రెండేళ్ల వరకు కూడా నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో గేదె నెయ్యి మంచిదని అర్థం చేసుకోవచ్చు.

బరువు తగ్గించే నెయ్యి
బరువు తగ్గాలనుకునే వారు గేదె నెయ్యికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఆవు నెయ్యిని ప్రతిరోజూ ఒక స్పూన్ తింటే మంచి ఫలితాలు వస్తాయి. ఆవు నెయ్యిలో ఉండే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ జీవక్రియకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ స్థాయిలను తక్కువగా ఉండేలా చూస్తుంది. దీని వల్ల బరువు పెరిగే సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఆవు నెయ్యిని తినడం మంచిది.

కొలెస్ట్రాల్ ఎంత ఉంటుంది?
గేదె నెయ్యిలో ఆవు నెయ్యి కంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ అధికంగా శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి అధిక బరువు ఉన్నవారు గేదె నెయ్యిని తినక పోవడమే మంచిది. ఆవు నెయ్యిలో అధిక మొత్తంలో పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మంచి కొవ్వులుగా చెప్పకుంటారు. గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యిలో సంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం కూడా తక్కువే. కాబట్టి ఆవు నెయ్యి ఈ రెండింటిలో ఏది తింటే మంచిది అని ఆలోచిస్తే ఆవు నెయ్యిని ఎంపిక చేసుకోవడమే ఉత్తమం.

Also Read: ఈ వంట పాత్రల్లో డేంజర్ కెమికల్స్? వీటిలో ఆహారం వండితే.. ఆ భయానక వ్యాధి పక్కా!

ఆవు నెయ్యి తినడం వల్ల స్థూలకాయం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే అనేక వ్యాధుల నుండి కూడా ఇది మనల్ని కాపాడుతుంది. అయితే క్రీడాకారులు, రెజ్లర్లు, శారీరక శ్రమ చేసేవారు గేదె నెయ్యని తినడం ఉత్తమం. ఇది వారికి చురుకైన జీవనశైలిని అందిస్తుంది. వారికి ఎక్కువ శక్తిని అందించడానికి కూడా గేదె నెయ్యి ముందుంటుంది. అదే బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గించాలనుకుంటే మాత్రం ఆవు నెయ్యిని ఎంపిక చేసుకోవాలి.

Related News

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Big Stories

×