EPAPER

Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?

Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?

Telangana, Ap IAS Officers :  తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ, ఏపీ సర్కార్లు ఝలక్ ఇచ్చాయి.


తెలంగాణలో రిలీవ్…

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో నలుగురు మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు టచ్ లోనే ఉన్నారు. డీఓపీటీ, క్యాట్ ఆదేశాలపై కీలక చర్చలు సైతం చేశారు. మరోవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు సైతం చేయనున్న విషయంపైనా చర్చించారు. అయితే హైకోర్టులో తీర్పు రాకముందే ఇవాళ ఉదయమే సదరు అధికారిణులను సర్కారు రిలీవ్ చేసినట్లు సమాచారం.


ఏపీ అధికారులూ రిలీవ్…

మరోవైపు ఏపీలోని తెలంగాణ కేడర్’కి చెందిన అధికారులు అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్లనూ ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసి అటు అధికారులతో పాటు ఇటు ప్రజలకూ ప్రభుత్వ వైఖరిని తెలియజేసినట్టైంది.

కేంద్రం ఆదేశాలు, రాష్ట్రం యాక్షన్… 

కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 11 మంది ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితమే అందరినీ రిలీవ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం.  డీఓపీటీ ఆదేశాల మేరకు వారందరినీ రిలీవ్ చేసినట్లు వెల్లడించింది. ఇక రిలీవ్ అయిన అధికారులతో తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి అధికారిక సంబంధం లేదని వివరించింది. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్ ఈ జాబితాలో ఉన్నారు.

ఏపీకి వెళ్లాల్సిందే మరి…

మొత్తంగా తెలంగాణలో 11 మంది ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుండగా, తమను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. దీన్ని కేంద్రం తిరస్కరిస్తూ ఏపీలోనే రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రాన్ని బలపర్చిన క్యాట్…

అయినా క్యాడర్ అలాట్ మెంట్ లో అసంతృప్తి ఉన్న అధికారులు క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్, ఏపీకి వెళ్లాల్సిందిగా కేంద్రం ఆదేశాలనే బలపర్చింది.

సేవ చేయాలని లేదా ?

ఆంధ్రలో ప్రజలు వరదలతో బాధపడుతున్నారని, అలాంటి వారికి సేవ చేయాలని లేదా అంటూ క్యాట్ నిలదీసింది. బుధవారంలోగా ఏపీ ప్రభుత్వంలో జాయిన్ ఇవ్వాలని క్యాట్ సైతం ఆదేశించింది. దీంతో మరోసారి 11 మంది అధికారులు న్యాయపోరాటం కొనసాగించారు. తమకు తెలంగాణ క్యాడర్ కావాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు తెలంగాణను వదిలి ఏపీలో రిపోర్ట్ చేయాలని, ఆ తర్వాతే విచారణ అని సూచించింది. దీంతో అధికారులకు మరోసారి కంగుతిన్నారు.

ముగిసిన కేంద్రం గడువు…

ఇక బుధవారంలోగా రిపోర్ట్ చేయాలన్న కేంద్రం-డీఓపీటీ ఆదేశాలకు నేటితో గడువు ముగిసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు (ఐఏఎస్, ఐపీఎస్) తెలంగాణ నుంచి ఏపీ, ఏపీ నుంచి తెలంగాణకు ఇంతర్రాష్ట్ర బదిలీ కావాల్సి ఉంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా అధికారులకు ప్రభుత్వం కొత్త పోస్టింగ్స్’లను  కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Also Read : ఎల్లుండి టీడీఎల్పీ భేటీ, క్యాడర్ బలోపేతంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Related News

Rain Effect: బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వరద ముప్పు

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?

CM Chandrababu: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

CM Chandrababu : ఎల్లుండి టీడీఎల్పీ భేటీ, క్యాడర్ బలోపేతంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు.. అధికారులకు క్లాస్

Big Stories

×