EPAPER

Chicken Lollipop: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో

Chicken Lollipop: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో
Chicken Lollipop: చికెన్ లాలీపాప్‌లు పేరు చెబితేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. పిల్లలు కూడా వీటిని చాలా  ఇష్టంగా తింటారు. చికెన్ ఆధారిత వంటకాలలో లాలీపాప్‌లు అభిమానులు ఎక్కువ. వీటిని తినాలంటే రెస్టారెంట్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూడా చాలా సులువుగా చికెన్ లాలీపాప్‌లు చేసేయొచ్చు. ఇక్కడ మేము ఎలా చేయాలో రెసిపీ ఇచ్చాము.


చికెన్ లాలీపాప్‌కు కావలసిన పదార్థాలు
చికెన్ – అరకిలో
కార్న్ ఫ్లోర్ – పావు కప్పు
మైదా – మూడు స్పూన్లు
గుడ్డు – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
వెల్లుల్లి రెబ్బలు – ఆరు
అల్లం ముక్కలు – చిన్న ముక్క
టమాటో కెచప్ – రెండు స్పూన్లు
షెజ్వాన్ సాస్ – రెండు స్పూన్లు
సోయా సాస్ – రెండు స్పూన్లు
వెనిగర్ – రెండు స్పూన్లు
మిరియాల పొడి – పావు స్పూను
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
కారం – ఒక స్పూను

Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

చికెన్ లాలీపాప్ రెసిపీ
1. చికెన్ లాలీపాప్‌లను ముందుగానే చికెన్ సెంటర్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవాలి.
2. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
3. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
4. చికెన్ లాలీపాప్స్ వేసిన గిన్నెలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
5. అందులోనే సోయాసాస్, వెనిగర్, మిరియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టేయాలి.
6. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదాపిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, ఒక గుడ్డు వేసి బాగా కలుపుకోవాలి.
7. మారినేట్ చేసిన చికెన్ లాలీపాప్‌లను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో వేసి బాగా తడుపుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేయాలి.
9. ఆ నూనెలో చికెన్ లాలీపాప్ లను వేసి ఎర్రగా మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు మరొక కళాయి తీసుకొని చిన్న మంట మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
11. ఆ నూనెలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం వేసి వేయించుకోవాలి.
12. అలాగే షెజ్వాన్ సాస్ కూడా వేసి వేయించాలి.
13. ఆ తర్వాత సోయాసాస్, వెనిగర్, టమోటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలి.
14. ఇప్పుడు టీ స్పూను కార్న్ ఫ్లోర్‌ను చిన్నకప్పు నీళ్ళల్లో వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి చిక్కబడే వరకు వేయించాలి.
15. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ లాలిపాప్ లను వేసి కలుపుకోవాలి.
16. పైన కొత్తిమీర లేదా ఉల్లికాడల తరుగును వేసి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ స్పైసీ చికెన్ లాలీపాప్ సిద్ధంగా ఉన్నట్.టే


చికెన్ లాలీపాప్‌లను ముందుగానే చికెన్ సెంటర్ వాడికి చెబితే లాలీపాప్ ఆకారంలో ముక్కలను కొట్టి ఉంచుతారు. వాటిని తెచ్చుకొని చికెన్ లాలీపాప్ చేసుకోవడం సులువు.

Related News

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Moringa and Beauty: మునగాకులను ఇలా వాడితే మొటిమలు రావడం దాదాపు తగ్గిపోతాయి

Chemicals in Cooking Utensils: ఈ వంట పాత్రల్లో డేంజర్ కెమికల్స్? వీటిలో ఆహారం వండితే.. ఆ భయానక వ్యాధి పక్కా!

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Hair Growth Oil: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

Stress Relief Tips: ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

Big Stories

×