EPAPER

BRS Leaders Serious on KTR: చిన్న దొర ఎందుకిలా..? గులాబీ వర్గాల్లో షాకింగ్ చర్చ

BRS Leaders Serious on KTR: చిన్న దొర ఎందుకిలా..? గులాబీ వర్గాల్లో షాకింగ్ చర్చ

కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాత్రం ఇంకా బీఆర్ఎస్ ఉనికిని, తమది జాతీయ పార్టీ అని తండ్రి ప్రకటించారని గుర్తించడం లేదని ఎప్పుడో తేలిపోయింది. తాను స్వయంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడైనప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో తమ శాఖలున్నాయని మర్చిపోయినట్లు స్టేట్ మెంట్లు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా, ఇతర దేశాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి.. రాష్ట్రాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు అఅరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు.

అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఆ ర్యాలీలపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడో ఏపీలో జరిగిన రాజకీయ అరెస్టు విషయంలో ఇక్కడ ఆందోళనలు ఏంటని కేటీఆర్ మీడియా మీట్ పెట్టి మరీ అడిగారు. అప్పుడు బీఆర్ఎస్ ఏపీ శాఖ ఒకటి ఉందనీ, దానికి ఏపీలో ఓ కార్యాలయం ఉందనీ మరిచిపోయినట్లు మాట్లాడారు. ఏపీ రాజకీయాలు మనకెందుకు అంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించిన కేటీఆర్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా గుర్తించి నమోదు చేసిన తరువాత కూడా కేటీఆర్ తమది ఇంకా టీఆర్ఎస్ పార్టీయే అనడంపై అప్పట్లో గులాబీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేశాయి.


తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తనకు సంబంధం లేని వ్యవహారంలో వేలు పెట్టి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేని నాన్ లోకల్ అన్నప్పుడు కేటీఆర్ కౌశిక్‌ని వెనకేసుకొచ్చి మాట్లాడి ఆ పార్టీని ఆదరించిన గ్రేటర్ పరిధిలోని సెటిలర్లకు షాక్ ఇచ్చారు. ఆ క్రమంలో అధికారం కోల్పోయాక పార్టీ పెద్దగా ఆయన ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ఇస్తున్న స్టేట్‌మెంట్లపై ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారంట. నాడు బీఆర్ఎస్ హయంలోనే మూసీ రి డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్, బఫర్ జోన్‌లుగా మార్కింగ్ కూడా చేశారు.

Also Read: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై పట్టుదలతో ఉంది . అయితే కేటీఆర్ మాత్రం మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను రెచ్చ గొడుతూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వారి పక్షాన నిలబడి పోరాడతానంటూ పాతవి మర్చిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఇక అప్పట్లో ఫాక్స్‌కాన్ కంపెనీ తమ చొరవతోనే వచ్చిందని ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. ఆ కంపెనీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడేమో ఫాక్స్‌కాన్ కంపెనీ తరలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గులాబీ శ్రేణులకు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు.

తాజాగా దామగుండంలో శంకుస్థాపన జరిగిన నేవీ రాడార్ స్టేషన్ చుట్టూ కేటీఆర్ రాజకీయం మొదలు పెట్టారు. దామగుండం ప్రాజెక్ట్‌ నిర్మిస్తే మూసీ నది కనుమరుగవుతుందని, మూసీకి ముఖ్యమంత్రే మరణశాసనం రాస్తున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు తమ ప్రభుత్వంపై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వేల ఎకరాల అటవీ భూములను నాశనం చేయడానికి పూనుకుందని మండిపడ్డారు. రాడార్ సెంటర్లు జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాలి కానీ, జనావాసాల మధ్య కాదని హితవు పలికారు.

వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే ఆ రాడార్ స్టేషన్‌కు భూమి పూజ జరిగింది. ఆ క్రమంలో కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ధ్వజమెత్తుతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, అనుమతులన్నీ ఆ పార్టీ హయాంలోనే వచ్చాయని పేర్కొంది. వాళ్ల ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్ట్‌ను ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తుండడం విడ్డూరమని, గతంలో ఆమోదించి ఇప్పుడు రాజకీయం చేయడం ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరేమీ కాదని ఎద్దేవా చేస్తున్నారు.

మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ రాడార్ ప్రాజెక్ట్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోందంటూ మండిపడ్డారు. కేటీఆర్ ఆందోళనలు చేయాలనుకుంటే దానికి అనుమతులు ఇచ్చిన ఆయన తండ్రికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసుకోవాలని సూచించారు.

ఆ క్రమంలో కేటీఆర్ స్టేట్ మెంట్‌లపై గులాబీ పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతుందంట. ట్వీట్లతో రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళ పరుస్తున్న మా చిన్నబాస్‌కు ఏమైందో అని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయంట. ఏదైనా మంచి జరిగితే బీఆర్ఎస్ అకౌంట్‌లో, చెడు జరిగితే ప్రభుత్వ అకౌంట్‌లో వేస్తూ పార్టీని నవ్వులపాలు చేస్తున్నారని తలలు పట్టుకుంటున్నాయంట. ఆయన ట్వీట్లతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందని.. ఇప్పటికైనా ఆయన ఉడుకుమోతుతనం మానుకుని.. ప్రొఫెషనల్ పొలిటీషియన్‌లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్గాలు ఆఫ్ ద రికార్డ్‌గా సూచిస్తున్నాయి. మరి చిన్న దొరకు ఆ సూచనలు నచ్చుతాయో లేదో చూడాలి.

Related News

India Vs Canada Issue: ట్రూడోకు భారత్‌పై ఎందుకంత పగ.. గెలవడం వెనుక అసలు కథ ఇదే?

Sajjala Ramakrishna Reddy vs YS Jagan: నాకేం తెలియదు.. జగన్‌ని ఇరికిస్తున్న సజ్జల

Byreddy Siddharth Reddy: పిల్ల ఫ్యాక్షనిస్ట్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్క‌డ‌?

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

Big Stories

×