EPAPER

Game of Thrones : కత్తులతో చేసిన సింహాసనం గుర్తుందా… ఎన్ని కోట్లకు అమ్మేశారో తెలుసా?

Game of Thrones : కత్తులతో చేసిన సింహాసనం గుర్తుందా… ఎన్ని కోట్లకు అమ్మేశారో తెలుసా?

Game of Thrones : ప్రపంచంలోనే అద్భుతమైన వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న సిరీస్ లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టాప్ లో ఉంటుంది. ఈ సిరీస్ కు సంబంధించి 2011 నుంచి 18 మధ్య దాదాపు 8 సీజన్లు రాగా, అవన్నీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి అంటే ఈ సిరీస్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇలా వ్యూస్ పరంగానే కాకుండా తాజాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ఉపయోగించిన థ్రోన్ వేలంలో కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.


కోట్లలో పలికిన థ్రోన్

డల్లాస్ లో నిర్వహించింద హెరిటేజ్ ఆక్షన్ లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ రెప్లికా భారీ ధరకు అమ్ముడుపోయింది. కత్తులతో తయారు చేసిన ఈ ప్రత్యేకమైన సింహాసనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో చాలా స్పెషల్. అయితే తాజాగా వేలంలో అమ్ముడుపోయిన ఈ రెప్లికాను ఐరన్ తో తయారు చేశారు. దీనికి సంబంధించి ఆరు నిమిషాల బిడ్డింగ్ జరగగా, ఈ థ్రోన్ కొనడానికి జనాలు ఎగబడినట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన సింహాసనం దాదాపు రూ. 85 కోట్లకు వేలంలో అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. ఇది ఇండియాలో ఒక భారీ సినిమా బడ్జెట్ అని చెప్పొచ్చు. మరి గేమ్ ఆఫ్ త్రోన్ సింహాసనం అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది కదా.


900 వస్తువులు వేలంలో… 

కాగా గత వారం మూడు రోజుల పాటు జరిగిన ఈ వేలం కార్యక్రమంలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు సంబంధించిన ఆయుధాలు, నగలు, ఆర్మర్స్ తో పాటు దాదాపు 900ల ఐకానిక్ వస్తువులను ఇందుల వేలం వేశారు. ఈ ఈవెంట్ కు ఏకంగా 4,500 మంది బిడ్డర్స్ రావడం విశేషం. అంతేకాకుండా ఇది హెరిటేజ్ సెకండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఈవెంట్ కావడం విశేషం. కాగా ఐరన్ థ్రోన్ మాత్రమే కాకుండా 30కి పైగా ఇతర వస్తువులు కూడా ఈ ఆక్షన్ లో ఆరు అంకెల ప్రైస్ పలకడం మరో విశేషం. అందులో జాన్ స్నో సిగ్నేచర్ స్వార్డ్ దాదాపు 4 లక్షల డాలర్లకు అమ్ముడైంది. అలాగే అతని వాచ్ 3,37,500 డాలర్లకు, ఎమీలియా క్లార్క్ గ్రే రెడ్ డేనేరీస్ టార్గారియన్ 1,12,500 డాలర్లకు, జైన్ లెనిస్టర్ బ్లాక్ లెదర్ ఆర్మర్ అండ్ కింగ్స్ గాడ్ ఆర్మర్ కూడా భారీ ధరకు సేల్ అయినట్టు తెలుస్తోంది.

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రీక్వెల్…

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ కి ప్రీక్వెల్ గా వచ్చిన ‘హౌస్ ఆఫ్ డ్రాగన్’ కూడా బ్లాక్ బస్టర్ హిట్. 2022 లోనే తొలి సీజన్ రిలీజ్ కాగా, ఈ ఏడాది జూన్లో రెండవ సీజన్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ‘హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2’ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా జూన్ 16 నుంచి ఒక్కో ఎపిసోడ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ హెచ్బివో మాక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.

Related News

Fouji : చాలా పెద్ద ప్లాన్ వేసావ్ కదా హను, మళ్ళీ చాలా ఏళ్లు తర్వాత తెరపైకి ఆ కాంబినేషన్

Devi Sri Prasad: పాపం కన్స్టర్ లుకు కూడా ఇన్వైట్ చెయ్యాల్సిన పరిస్థితి

Sudheer Babu : పాపం 18 సినిమాలు చేస్తే , కేవలం రెండే వర్కౌట్ అయ్యాయి

Ram Charan : బాబాయ్ బాటలో అబ్బాయి, మనం చేసే పనిలో మంచి కనిపించాలి, మనం కాదు

Vettaiyan OTT : అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్నరజినీకాంత్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Suriya: ఇలా కూడా వర్కవుట్స్ చేయొచ్చా? జిమ్‌లో హీరో సూర్య వీడియో వైరల్

Christamas Movies 2024 : క్రిస్మస్ కు సందడి చెయ్యబోతున్న టాలీవుడ్ మూవీస్ ఇవే..

Big Stories

×