EPAPER

Apple iPad Mini : అదిరే ఫీచర్స్ తో ఐపాడ్ మినీ లాంఛ్.. స్పెసిఫికేషన్స్, ధర వివరాలివే!

Apple iPad Mini : అదిరే ఫీచర్స్ తో ఐపాడ్ మినీ లాంఛ్.. స్పెసిఫికేషన్స్, ధర వివరాలివే!

Apple iPad mini : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఐపాడ్ మినినీ భారత్లో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆపిల్ లాంఛ్ చేసిన ఐపాడ్స్ కి భిన్నంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ తో ఈ ఐపాడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.


ఆపిల్ కంపెనీ ఐప్యాడ్ మినీను భారత్లో లాంఛ్ చేసింది. పోర్టబుల్ డిజైన్స్ తో పాటు A 17 ప్రో చిప్ సెట్‌తో ఈ ఐపాడ్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఆపిల్ ఇప్పటి వరకు విడుదల చేసిన ఐపాడ్స్ తో పోలిస్తే లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఫీచర్స్ ను సైతం ఐపాడ్ మినీలో తీసుకొచ్చింది.

స్పెసిఫికేషన్స్ : ఐపాడ్ మినీ 8.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే తో లాంఛ్ అయింది. ఐఫోన్ 15 ప్రో మోడల్ లో వినియోగించిన ఏ 17 ప్రో చిప్సెట్ తో ఈ ఐపాడ్ ను డిజైన్ చేశారు. ఆపిల్ పెన్సిల్ ప్రో ను సపోర్ట్ చేసే ఈ ఐపాడ్.. గత మోడల్స్ తో పోలిస్తే మరింత వేగంగా పనిచేస్తుందని ఆపిల్ సంస్థ వివరించింది.


డిజైన్ : ఇక ఐపాడ్ మిని డిజైన్ ను అత్యాధునికంగా ఆపిల్ డిజైన్ చేసింది. ఫ్లాట్ సైడ్స్ తో ఐపాడ్ ప్రో, ఐ పాడ్ తరహాలో డిజైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక పోర్టబుల్గా ఉండే ఈ ఐపాడ్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ను సైతం సపోర్ట్ చేస్తుందని చెప్పుకొచ్చింది.

కెమెరా : ఆపిల్ మినీ ఐపాడ్ బ్యాక్ కెమెరా 12 ఎంపీ వైడ్ కెమెరాతో డిజైన్ చేశారు. ఫ్రెంట్ కెమెరా సైతం 12Mp గా ఉంది. ఇక ఈ కెమెరా సెంటర్ సైడ్ ఫీచర్ ను సైతం సపోర్ట్ చేస్తుందని… వీడియో కాల్ సమయంలో ఫ్రేమ్ మధ్యలో ఉండేలా ఫేషియల్ సిస్టమ్ ఆటోమేటిక్గా వర్క్ చేస్తుందని ఆపిల్ కంపెనీ తెలిపింది.

ALSO READ : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

ప్రస్తుతం ఐపాడ్ మినీ ముందస్తు బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి అక్టోబర్ 23 నుంచి సేల్ ప్రారంభమవుతుందని తెలిపిన ఆపిల్… ఐప్యాడ్ మినీ 128gb, 256 జిబి స్టోరేజ్ వేరియంట్స్ తో రాబోతుందని చెప్పుకు వచ్చింది. ఐప్యాడ్ మిని (W-Fi) వేరియంట్ ధర రూ.49,900 గా ఉంది. అదే వైఫై సెల్యూలర్‌ మోడల్‌ ధర రూ.64,900 గా ఉందిని ఆపిల్ తెలిపింది.

ఆపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు స్టూడెంట్ కు ప్రత్యేక డిస్కౌంట్స్ ని అందిస్తుంది. అలాగే ఆపిల్ ఐప్యాడ్ మినీ పై సైతం స్టూడెంట్స్కు ప్రత్యేక డిస్కౌంట్ ఉంటుందని తెలిపిన ఆపిల్ కంపెనీ.. ఐప్యాడ్ మినీ బ్లూ, పర్పుల్, స్పేస్ గ్రే, స్టార్ లైట్ కలర్స్ లో అందుబాటులోకి రానుందని వివరించింది.

ఆపిల్ కంపెనీ త్వరలోనే మరిన్ని లేటెస్ట్ గాడ్జెట్స్ అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఐఫోన్ ఎస్ సి ఫోర్ తో పాటు ఐఫోన్ 17 సరీస్ లాంఛ్ కు సన్నాహాలు చేస్తుంది. ఇక ఐఫోన్ ఎస్సీ ఫోర్ మోడల్ వచ్చే ఏడాది మార్చి లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్మార్ట్ గ్లాసెస్ తీసుకురాటానికి ఆపిల్స్ సన్నాహాలు చేస్తుందని తాజాగా బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. ఇక ఏది ఏమైనా ఆపిల్ నుంచి త్వరలోనే లేటెస్ట్ అప్డేట్స్ రాబోతున్నాయనే చెప్పాలి.

Related News

Vivo y300 Plus : బెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసిన vivo.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Android : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

Redmi : రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

Realme : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

Big Stories

×