EPAPER

Delhi Pollution Supreme Court: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్!

Delhi Pollution Supreme Court: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్!

Delhi Pollution Supreme Court| దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా చలికాలంలో ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ దారుణ స్థితికి పడిపోతున్నాయి. ఈ సమస్యపై సుప్రీం కోర్టు బుధవారం సీరియస్ అయింది. రాజధానిలో గాలి కాలుష్యానికి ముఖ్యకారణం హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వమే నిర్లక్ష్యమని మండిపడింది.


ఇంత తీవ్ర సమస్య ఉంటే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా? అని దేశ అత్యున్నత ఢిల్లీ పొరుగు రాష్ట్రాల తీరును ఎండగట్టింది. పంజాబ్ లోని రైతులు పంట ఎండు గడ్డి (మొద్దు)ని కాల్చడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ నిపుణులు చెబుతున్నా.. ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవలేదో? అర్థం కావడం లేదని సుప్రీం కోర్టు త్రిసభ్యధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Also Read: నకిలీ వేల్ షార్క్ చూపించి కోట్లు సంపాదించిన చైనా కంపెనీ.. ఎలా గుర్తుపట్టారంటే


ముగ్గురు న్యాయమూర్తులు.. జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎ జి మసీహ్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలలోని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సిఎక్యూఎం) అధికారులని ఢిల్లీ వాయు కాలుష్యానికి బాధ్యులుగా చేసింది. ”హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలలో పంట ఎండు గడ్డి కాల్చడంపై నిషేధం ఉన్నా రైతులు నియమాలను పాటించకపోతే వారిని ఎందుకు శిక్షించలేదు? హర్యాణాలో అయితే 2021 నుంచి ఇప్పటి వరకు కేవలం 200 మందిపై నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. అది కూడా ఏదో చిన్న ఫైన్ విధించి చేతులు దులుపుకున్నారు.

అసలు అధికారులు పనిచేస్తున్నారా?. హర్యాణా, పంజాబ్ ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలు పాటించవా?.. పాటించకపోతే తాము ఏమీ చేయలేమని చెప్పాలి? ఆ తరువాత మేము చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీలపై ఎవరైనా రాజకీయ ఒత్తిడి చేస్తుంటే.. మాకు తెలియజేయాలి. వారికి కూడా కోర్టు సమన్లు జారీ చేస్తుంది. వాయు కాలష్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో? పంజాబ్, హర్యాణా చీఫ్ సెక్రటరీలు సమాధానం చెప్పాలి. ఇద్దరూ వారం రోజుల తరువాత కోర్టులో స్వయంగా హాజరుకావాలి.” అని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం వాయు కాలుష్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కోర్టు విచారణ సమయంలో ప్రభుత్వం తరుపున వాదించే పంజాబ్ అడ్వకేట్ జెనెరల్ కు న్యాయమూర్తల కోపంతో చెమటలు పట్టాయి. 2013లో పంజాబ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షన చట్టం తీసుకువచ్చింది. కానీ దాని అమలు ఏమాత్రం లేదని సుప్రీం కోర్టు గమనించింది. విచారణ మధ్యలో పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది తమకు ఎండు గట్టి కాల్చే లొకేషన్ తెలుసుకునేందకు ఆలస్యం జరగుతోందని చెప్పగా.. న్యాయమూర్తులు మరింత ఆగ్రహం చూపించారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాటిలైట్లు పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలకు పొగ వచ్చే లొకేషన్ గుర్తించి వెంటనే సమాచారం అందిస్తోందని.. ఈ విషయం రికార్డుల్లో ఉన్నా.. కోర్టును మధ్య పెట్టేందుకు చూస్తారా? అని అడ్వకేట్ జెనెరల్ కు చురకలు అంటించారు.

ఢిల్లీలో దసరా తరువాత వాయు కాలుష్యం పెరిగిపోయింది. పైగా త్వరలో దీపావళి రానుంది. ఈ నేపథ్యంలో రాజధానిలో టపాసులు కాల్చడం, విక్రయించడం, తయారు చేయడంపై నిషేధం ఉంది. వాహన కాలుష్యంపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వాయు కాలుష్యం కారణంగా దేశ రాజధానిలో ప్రతీ సంవత్సరం శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

 

Related News

CM Nayab Singh Saini : మరోసారి హరియాణా సీఎంగా సైనీ, ప్రధాని మోదీ సమక్షంలో రేపే ప్రమాణస్వీకారం

Omar Abdullah CM Oath: జమ్ము కశ్మీర్ సిఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచే మద్దతు!

‘Jai Shri Ram’ In Mosque: మసీదులో ‘జై శ్రీ రామ్’ జపించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

Kalaburagi Jail : కర్ణాటక జైలులో ఖైదీలకు విఐపి ట్రీట్‌మెంట్.. జైలర్‌పై కేసు నమోదు

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు

Big Stories

×