EPAPER

Vizag Honey Trap Case: మత్తు స్ప్రే చల్లి.. న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌పై మరో కేసు నమోదు

Vizag Honey Trap Case: మత్తు స్ప్రే చల్లి.. న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌పై మరో కేసు నమోదు

Vizag Honey Trap Case Latest Update: గత కొద్ది రోజులుగా తెగ వినిపిస్తున్న పేరు కిలాడీ లేడీ జాయ్‌ జమీమా.. ఓ పెద్ద గ్యాంగ్‌ను వేసుకొని ఆమె దందాను రన్ చేస్తుందా? లేక ఓ పెద్ద గ్యాంగే ఆమెను రిక్రూట్ చేసుకొని దందా చేస్తున్నారా? తెలీదు కానీ.. మొత్తానికి హాట్ హాట్ వీడియోలను షేర్‌ చేసి.. మొదట యువకుల మదిని దోచేస్తూ.. ఆ తర్వాత వారి వీక్‌నేస్‌లను క్యాచ్ చేసి.. క్యాష్‌ చేసుకుంటోంది. ఓ బాధితుడి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత తవ్వుతున్న కొద్ది.. అసలు బాగోతాలు బయటికి వచ్చాయి. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించడం.. ఇప్పటికే అకౌంట్స్‌ను ఫ్రీజ్‌ చేయడం ఇవన్నీ జరిగిపోయాయి.


మొదట మాటలు.. ఆ తర్వాత ముచ్చట్లు.. ఇక ఆ తర్వాత మెల్లిగా ముగ్గులోకి దింపడం.. ఫిజికల్ రిలేషన్‌షిప్‌లోకి తీసుకురావడం.. ఇక్కడ దొరికిపోతున్నారు బాధితులు. వీడియోలు షూట్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం.. ఇంకా బయటికి రాని వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ కిలాడీ లేడీ బారిన పడి చాలా మంది యువకులు తమ పర్స్‌ను ఖాళీ చేసుకున్నారు. తాజాగా హనీ ట్రాప్ నిందితురాలు జాయ్ జమీమా కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి.

బాధితులంతా ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులకు మరో బాధితుడు కంప్లైంట్ చేశాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి.. ఉద్యోగం కోసం విశాఖ రాగా.. జమీనాతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అతను కంపెనీలోఉద్యోగం చేస్తుండగా.. కంపెనీ యజమాని తనను ప్రాజెక్టు హెడ్‌గా నియమించారని బాధితులకు జాయ్ జమీమా చెప్పింది. వర్క్ కోసం ప్రతిరోజూ కలుస్తూ పరిచయం పెంచుకున్నట్లు తనతో ఫ్రెండ్‌షిప్ పెంచుకున్నట్లు బాధితుడు చెబుతున్నాడు. తనపై మత్తు మందును.. స్ప్రేగా చల్లి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను జాయ్ జమీమా తీసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆ ఫోటోలు, వీడియోలు బయటికి రాకుండా ఉండాలంటే తనకు డబ్బులు ఇవ్వాలంటూ అతన్ని జాయ్ జమీమా భయపెట్టినట్లు తెలుస్తోంది.


Also Read: స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు.. సీఎం చంద్ర‌బాబుకు ఈడీ క్లీన్ చిట్, కానీ..

డబ్బులు డిమాండ్ చేసిన ప్రతిసారీ.. జాయ్ జమీమాకు డబ్బులిస్తూనే వచ్చాడు. మూడు కోట్లు ఇస్తే శాశ్వతంగా వదిలేస్తానంటూ బాధితుడిని బెదిరించటంతో పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి.. విశాఖలో ఉన్న తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని హైదరాబాదు వెళ్లిపోవడానికి ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న జాయ్ జమీమా.. మధ్యదారిలో అతన్ని అడ్డగించింది. తన దగ్గర ఉన్న డబ్బు, వస్తువులు, లాప్‌ట్యాప్‌..తీసుకుని వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విశాఖలో జాయ్ జమీమాను అరెస్టు చేశారని తెలుసుకుని హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చి.. ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ ఘటనపై భీమిలి, పీఎంపాలెం, కంచరపాలెం పోలీస్ స్టేషన్ తో ఫిర్యాదు చేశానని.. కొత్తగా ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసినట్లు చెబుతున్నాడు.

Related News

Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు… అధికారులకు క్లాస్, ఏం చెప్పిందంటే ?

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. క్లీన్ ఎనర్జీ పాలసీకి ఆమోదం..

Tirupati: శవంతో సాహస యాత్ర! ప్రాణాలకు తెగించినా పట్టించుకోని అధికార యంత్రాంగం

AP Liquor Policy: ఏపీలో సామాన్యులకు మద్యం పంట.. లిక్కర్ వ్యాపారులకు షాక్

AP TG Weather Updates: ఏపీకి తుపాను ముప్పు, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. బెంగుళూరు, చెన్నైలో కుండపోత

Skill Development Scam: స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు.. సీఎం చంద్ర‌బాబుకు ఈడీ క్లీన్ చిట్, కానీ..

Big Stories

×