EPAPER

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.


బుధవారం గ్రేటర్‌లోని పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారాయన.

మూసీ అభివృద్ధి, హైడ్రా విషయంలో అవగాహన, ఆలోచన లేకుండా దూకుడుగా వెళ్తోందని దుయ్యబట్టారు కేటీఆర్. దీనివల్ల పేద, మధ్య దిగువ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదన్నది ఆయన మాట. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి డీపీఆర్ లేదన్నారు.


మూసీ పరివాహన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని ఇప్పుడు వాళ్లే కూలగొడుతున్నారని విమర్శించారు. మూసీ పేరిట దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. వంద శాతం కెపాసిటీ ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మాణం చేపట్టామన్నారు. వాటిని ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు.

ALSO READ: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

పనిలోపనిగా పెండింగ్ బకాయలు ఇవ్వలేదని, వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు 80 వేల కోట్ల దాటిందంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నా రు. గతంలో చెప్పినట్టుగానే అబద్దాలను మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారాయన. ఖమ్మం, మహబూబాబాద్ ల్లో వరదల వల్ల నష్టపోయినవారికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

Related News

Minister Seethakka : అప్పుల అప్పారావు లెక్కలెన్నో..! – మంత్రి సీతక్క

Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు… అధికారులకు క్లాస్, ఏం చెప్పిందంటే ?

Attack On Big Tv Team : బిగ్ టీవీ సిబ్బందిపై గచ్చిబౌలి స్టేడియంలో దౌర్జన్యం… ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు

BRS MLAs meeting: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

IAS Lunch Motion: ఐఏఎస్‌ల్లో టెన్షన్.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది?

Konda Gattu temple: కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. రైస్ దొంగలిస్తూ అడ్డంగా..

Big Stories

×