EPAPER

Tomato Face Pack: నిగనిగలాడే ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ వాడాల్సిందే

Tomato Face Pack: నిగనిగలాడే ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ వాడాల్సిందే

Tomato Face Pack: ముఖం అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకోసం చాలా రకాల ఫేస్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. ఇదిలా ఉంటే గ్లోయింగ్ స్కిన్ కోసం పార్లర్లలో వేలల్లో ఖర్చు చేసే వారు కూడా ఉంటారు. అయినా కూడా ఫలితం అంతంత మాత్రమే. అంతే కాకుండా బయట రసాయనాలతో తయారు చేసే ఫేస్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది. లేదా చర్మం అందంగా మెరిసిపోవాలంటే హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను వాడటం ఉత్తమం.


మీరు ఆఫీసు లేదా ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉంటే బ్యూటీ పార్లర్‌కు వెళ్లడానికి అంతగా సమయం ఉండదు. ఇలాంటి సమయంలోనే ఇంట్లో ఉన్నా కూడా చర్మం నిగనిగలాడేలా చేసుకోవచ్చు.ముఖ్యంగా అందుకోసం టమాటోతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇంట్లోనే 4 టమాటో ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోండి. ఇవి మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. మరి ఈ ఫేస్ ప్యాక్ లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. టమాటో , తేనె ఫేస్ ప్యాక్:


కావలసినవి:
టమాటో – 1 టేబుల్ స్పూన్
తేనె – 1 టీ స్పూన్

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకున అందులో 1 టేబుల్ స్పూన్ టమాటో రసంతో పాటు 1 టీ స్పూన్ తేనెను వేసి కలపండి. ఆ తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 15 – 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం తెల్లగా మారుతుంది.

2. టమాటో, శనగ పిండి ఫేస్ ప్యాక్:

కావలసినవి:

టమాటో- 1

శనగపిండి- 2 టేబుల్ స్పూన్

పసుపు- 1/2 టీ స్పూన్

తయారీ విధానం: ముందుగా ఒక టమాటో నుంచి రసం తీయండి.అందులో రెండు చెంచాల శనగపిండి, అర చెంచా పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

3. టమాటో, పెరుగు ఫేస్ ప్యాక్:

కావలసినవి:

టమాటో- 1

పెరుగు- 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:ఒక టమాటో నుంచి రసం తీయండి. అందులో రెండు చెంచాల పెరుగు వేయాలి.తర్వాత ఈ రెండింటినీ మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా తాజా చేస్తుంది.

4. టమాటో, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:

కావలసినవి:

టమాటో- 1

నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్

Also Read: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

తయారీ విధానం: ఒక టమాటో రసం తీయండి.అందులో ఒక చెంచా నిమ్మరసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది ముఖంపై మచ్చలను తొలగిస్తుంది. అంతే కాకుండా ముఖం తెల్లగా మారుతుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Chicken Lollipop: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Hair Growth Oil: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

Stress Relief Tips: ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

Papaya: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా ? ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోండి

Cinnamon Water: బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే !

Big Stories

×