EPAPER

Sajjala Ramakrishna Reddy vs YS Jagan: నాకేం తెలియదు.. జగన్‌ని ఇరికిస్తున్న సజ్జల

Sajjala Ramakrishna Reddy vs YS Jagan: నాకేం తెలియదు.. జగన్‌ని ఇరికిస్తున్న సజ్జల

Sajjala Ramakrishna Reddy vs YS Jagan: ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అధికారం కోల్పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయంట. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు ఆయన అన్నీ తానే అన్నట్లు వ్యవహరించారు. అప్పట్లో ఏపీలో రెండు ప్రధాన రాజకీయ దాడులు, సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాటిలో సజ్జల పాత్రపై విచారణ కొనసాగుతుంది . ఆ క్రమంలో ఆయన సన్నిహితుల దగ్గర తన బాధలు చెప్పుకుంటూ తెగ బాధ పడిపోతున్నారంట.


ఏపీలో రెండు ప్రధాన రాజకీయ దాడులు, సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ అవసరమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని సీఐడీ కు బదిలీ చేసింది. కేసుల్లో నిందితులుగా ఉన్న వారు పరారీలో ఉండటంతో వారు దేశం దాటకుండా లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది.

ముఖ్యంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి , సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసుల్లో గత ప్రభుత్వంలో సలహాదారుగా చక్రం తిప్పిన వైసీపీ ప్రధాన కార్యదర్శ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. దానిపై ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు.. అయితే తాజాగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదలాయించింది. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఆ క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో కనిపించిన సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు షాకిచ్చారంట. ఆయనపై లుక్ అవుట్ నోటీసు ఉందని, విదేశాలకు ఆయన వెళ్లే అవకాశం లేదని చెప్పారంట . దీంతో ఆయన తాను విదేశాలకు వెళ్లడం లేదని , హైదరాబాద్ కు వెళ్తున్నట్లు వారికి వివరించి ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చిందంట.


టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జలతో పాటు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేశ్,లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురికి గతంలోనే పోలీసులు నోటీసులు పంపారు . వీరిలో నందిగం సురేశ్‌ను అరెస్టు కూడా చేశారు. అయితే వారంతా హైకోర్టులో ముందస్తు బెయిల్ కు పిటిషన్లు వేసినా కొందరికి మాత్రమే ఊరట లభించింది. ఇందులో సజ్జలపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేయలేదని తెలుస్తోంది.

ఆ క్రమంలో సజ్జల తనను కలిసిన వారి దగ్గర తెగ ఇదైపోతున్నారంట . తాను ఏమన్నా మంత్రిగా పనిచేసానా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నానా.. కేవలం సలహాదారుగా నియమిస్తే ఆ పని చేసుకున్నానని.. ఇప్పుడు అన్ని కేసులు తనకు చుట్టుకుంటున్నాయని వాపోతున్నారంట. ప్రభుత్వ సలహాదారుగా జగన్ ఆదేశించిన అంశాలపై మీడియా ముందుకొచ్చి మాట్లాడేవాడినని, అంతే కాని విధాన నిర్ణయాలు, పార్టీ నేతల వ్యవహారాలతో తనకు సంబంధం ఏముందని ఫీల్ అవుతున్నారంట.

Also Read: పిల్ల ఫ్యాక్షనిస్ట్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్క‌డ‌?

వాస్తవానికి జర్నలిస్ట్ బేక్ గ్రౌండ్ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ హాయంలో జగన్ తర్వాత జగన్ స్థాయిలో ఫోకస్ అయ్యారు . జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక సజ్జల పాత్ర ఉండేదంటారు . ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆయనే ప్రెస్ మీట్ పెడుతుండేవారు . ప్రభుత్వంతో పాటు పార్టీ నిర్ణయాల్లో ఆయన ప్రమేయం ఉండేదంట. ఆఖరికి మొన్నటి ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలో కూడా సజ్జల మాటే చెల్లుబాటైందన్న టాక్ ఉంది .

నటి కాదంబరి జత్వానీ కేసులో తెర వెనుక కథంతా నడిపించింది సజ్జలే అన్న ఆరోపణలున్నాయి. ఆ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లు అడ్డంగా బుక్కైపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి మరీ వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. జత్వానీని అరెస్టు చేసి, ముంబై నుంచీ తీసుకురావడం వరకూ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణాతాతా, విశాల్ గున్నీలు.. పోలీసుల్లా కాకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా వ్యవహరించారని తేలింది. విశాల్ గున్నీ ఇచ్చిన వాంగ్మూలంతో.. ఆ కథంతా నడిపించింది సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది స్పష్టమైంది.

దాంతో పాటు టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సజ్జల పాత్రపై విచారణ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఆయన విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసు జారీ అయిందంటున్నారు. ఆ విషయం బయటకు పొక్కకపోయినా.. ఢిల్లీలో పోలీసులు అడ్డుకున్నారని, ప్రభుత్వం వైసీపీ వారిని అన్యాయం వేధిస్తుందని వైసీపీ మీడియా ఆరోపించడంతో సజ్జలకు లుక్ అవుట్ నోటీసు జారీ అయిన విషయం వెలుగు చూసింది. ఇప్పుడు దానిపై కూడా ఆయన తెగ బాధ పడిపోతున్నారంట. సొంత మీడియానే తనను బదనాం చేసిందని కనిపించిన ప్రతివారి దగ్గర గోడు వెల్లబోసుకున్నారంట. ఆయన్ని కలిసి వచ్చిన వైసీపీ నేతలు ఇవ్వన్ని ముచ్చటించుకుంటూ సజ్జలపై తెగ జాలి పడిపోతున్నారిప్పుడు. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు ఇదేనేమో

Related News

BRS Leaders Serious on KTR: చిన్న దొర ఎందుకిలా..? గులాబీ వర్గాల్లో షాకింగ్ చర్చ

India Vs Canada Issue: ట్రూడోకు భారత్‌పై ఎందుకంత పగ.. గెలవడం వెనుక అసలు కథ ఇదే?

Byreddy Siddharth Reddy: పిల్ల ఫ్యాక్షనిస్ట్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్క‌డ‌?

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

Big Stories

×